E-Paper
Advertisement

హీరోయిన్ రుక్మిణి వసంత్ డీప్‌ఫేక్ కేసులో ట్విస్ట్ .. ముగ్గురు అరెస్ట్..

హీరోయిన్ రుక్మిణి వసంత్ డీప్‌ఫేక్ కేసులో ట్విస్ట్ .. ముగ్గురు అరెస్ట్..
Advertisement

Rukmini Vasanth : కన్నడ హీరోయిన్ రుక్మిణి వసంత్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే ఈమె అటు కోలీవుడ్ లోనూ, ఇటు టాలీవుడ్ లోనూ వరుసగా అవకాశాలు అందుకుంటూ బిజీగా మారింది.. కన్నడ హీరోయిన్ పేరు ఇటీవల వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.. ఇటీవల ఓ సైబర్ నేరానికి బాధితురాలిగా మారారు. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి కొందరు కేటుగాళ్లు సృష్టించిన అసభ్యకరమైన చిత్రాలు సోషల్ మీడియాలో కలకలం రేపిన విషయం తెలిసిందే. దీనిపై సీరియస్ అయినా ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు సీరియస్ గా తీసుకున్న పోలీసులు అరెస్ట్ చేశారు.. దీని గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం..

హీరోయిన్ డీప్‌ఫేక్ కేసులో ముగ్గురు అరెస్ట్.. 

కొన్ని రోజుల క్రితం హీరోయిన్ రుక్మిణి వసంత్ స్విమ్మింగ్ పూల్ దగ్గర బికినీ ధరించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అయితే ఆ వీడియోలో ఉన్నది ఆమె కాదు అని హీరోయిన్ నిర్ధారించింది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వేదికగా స్పందిస్తూ.. ఇలాంటి అశ్లీల కంటెంట్‌ను సృష్టించడం, షేర్ చేయడం అత్యంత బాధ్యతారాహిత్యమైన చర్య. ఈ వీడియోలు పై తన కుటుంబం ఎంతో బాధ పడుతుందని ఆమె వెల్లడించారు. బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన బెంగళూరు పోలీసులు సాంకేతిక ఆధారాల సహాయంతో దర్యాప్తును వేగవంతం చేశారు. ఎట్టకేలకు ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. రవి కుమార్, చంద్రకాంత్, రంజిత్ ను అదుపులోకి తీసుకున్నారు. న్యాయస్థానం వారికి రిమాండ్ విధించింది.. ఈ విషయాన్ని హీరోయిన్ రుగ్ విని వసంత్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపింది.

Advertisement

Also Read :Podarillu Today Episode : చక్రిని రెచ్చగొట్టిన నారాయణ.. బాధతో మందు తాగిన చక్రీ.. అయ్యో.. మహాకు మైండ్ బ్లాక్..

రుక్మిణి వసంత్ సినిమాల విషయానికొస్తే..

కన్నడ ఇండస్ట్రీ లో వరుసగా సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకుంది హోమ్లీ బ్యూటీ రుక్మిణి వసంత్.. నిఖిల్ సిద్ధార్థ్ సరసన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఇక రీసెంట్ గా కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో జరిగే కాంతార 2 మూవీలో నటించి ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకుంది. ఆ మూవీ భారీ విషయాన్ని అందుకోవడంతో ఈమెకు అవకాశాలు వరుసగా క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ సరసన డ్రాగన్ మూవీలో నటిస్తుంది. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. దీంతో పాటుగా మరో రెండు చిత్రాలకు సైన్ చేసినట్టు తెలుస్తుంది. త్వరలోనే వాటి గురించి ప్రకటించే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో హైపర్ ఆక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది..

Advertisement

Related News

మృణాల్ ఠాకూర్ ఫైర్.. ఇక షేర్ చేసినా కేసులే!

నిఖిల్ ‘స్వయంభు’లో శక్తిమాన్.. టాప్ సీక్రెట్ రివీల్ చేసిన హీరో!

ఎన్టీఆర్ లేకుండానే ‘డ్రాగన్’ షూటింగ్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్!

శూర్పణఖ పాత్రపై రకుల్ షాకింగ్ కామెంట్స్!

ఆటా సందీప్ దూకుడు.. జానీ, శేఖర్ మాస్టర్లకి ఇక కష్టమేనా ?

జయం రవి విడాకుల కేస్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఆర్తి తల్లి!

త్రిషపై ఉదయనిధి అసభ్యకర వ్యాఖ్యలు.. కుష్బూ సంచలన ట్వీట్!

సర్జరీ తర్వాత తొలిసారి దర్శనమిచ్చిన రామ్ చరణ్.. డ్యాషింగ్ లుక్ తో!

Big Stories

Advertisement
×