E-Paper
Advertisement

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న అనస్వర రాజన్..మరీ ఇంత డెడికేషన్ ఏంటీ అమ్మడు!

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న అనస్వర రాజన్..మరీ ఇంత డెడికేషన్ ఏంటీ అమ్మడు!
Advertisement

Anaswara Rajan: అనస్వర రాజన్ పరిచయం అవసరం లేని పేరు. నటుడు రోషన్ జోడీగా ఛాంపియన్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగు, తమిళ భాషలలో వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇలా అనస్వర నటించిన “ఇట్లు అర్జున” (Itlu Arjuna)సినిమా అక్టోబర్ 30వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు.

తెలుగులో మాట్లాడిన అనస్వర..

ఈ నేపథ్యంలోనే టీజర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం పాల్గొన్నారు. ఇక అనస్వర ఈ టీజర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ అభిమానులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. గత సినిమా ఈవెంట్ లో  భాగంగా  ఈమె తెలుగు ప్రేక్షకులను ఉద్దేశించి తన తదుపరి సినిమా ఈవెంట్లో కచ్చితంగా తెలుగు మాట్లాడతానని చెప్పారు .అదే విధంగానే ఈ టీజర్ లాంచ్ కార్యక్రమంలో ఈమె తెలుగులో మాట్లాడుతూ ప్రేక్షకులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఇక ఈ సినిమా గురించి మాట్లాడుతూ సినిమా చాలా అద్భుతంగా ఉందని ప్రతి ఒక్కరికి ఈ సినిమా ఆకట్టుకుంటుందని తెలిపారు.

నిర్మాతగా డైరెక్టర్ కొత్త ప్రయత్నం..

Advertisement

ఇట్లు అర్జున సినిమాలో తాను కీర్తి పాత్రలో కనిపిస్తానని కీర్తి పాత్ర ప్రతి ఒక్కరికి నచ్చుతుందని ఈమె తెలిపారు. ఇలా ఈ కార్యక్రమంలో తెలుగులో మాట్లాడటంతో అభిమానులందరూ కూడా ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అభిమానుల కోసం ఈమె తెలుగు నేర్చుకొని మరి మాట్లాడటంతో తెలుగు పట్ల అలాగే ప్రేక్షకులకు ఇచ్చిన మాట పట్ల చాలా డెడికేషన్ తో ఉన్నారంటూ కామెంట్ లు చేస్తున్నారు. ఇక ఇట్లు అర్జున సినిమా విషయానికి వస్తే.. ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుముల(Venky Kudumula) నిర్మాతగా మరి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

చిరంజీవి సినిమాలో అనస్వర…

మహేష్ ఉప్పాల దర్శకత్వంలో  ‘వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్’ బ్యానర్‌పై  వెంకీ కుడుముల నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న అనీష్ వినికిడి లోపం, మూగ సమస్యలతో బాధపడే ఒక ప్రత్యేకమైన టాలెంట్ కలిగిన అర్జున అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా ఒక ప్రేమ కథ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఈ సినిమా అక్టోబర్ 30 వ తేదీ విడుదల అయ్యి ఎలాంటి సక్సెస్ అందుకుంటుందనేది తెలియాల్సి ఉంది. ఇక అనస్వర విషయానికి వస్తే ఈమె మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కాకా(Kaaka) సినిమాలో కూడా నటిస్తున్నారు. ఇందులో చిరంజీవి కూతురుగా డాక్టర్ పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Also Read: వెండితెర పైకి ‘రఘుకుల తిలకరారా’ సాంగ్..

Related News

తిరుమల లడ్డులో కొవ్వు లేదు.. మతోన్మాదుల కొవ్వు తప్ప.. ప్రకాష్ రాజ్ ట్వీట్ వైరల్!

వెండితెర పైకి ‘రఘుకుల తిలకరారా’ సాంగ్..

భూ కబ్జా వ్యవహారం.. నిర్మాత సి కళ్యాణ్ పై పోలీస్ కేసు నమోదు!

‘కొబ్బరి మట్ట’ సంపూ కాదు.. ‘ది ప్యారడైజ్’లో కొత్త సంపూని చూస్తారట!

విడాకుల వ్యవహారంపై స్పందించిన నీతి టేలర్.. అంత మాట అన్నారేంటి?

‘ది ప్యారడైజ్’ ప్రమోషన్స్ కోసం కయాదు లోహర్ కొత్త స్ట్రాటజీ.. ఫొటోస్ వైరల్!

రోజాకు ఇష్టమైన పొలిటీషియన్ తనేనా.. జగన్ కాదా? ఇదేమీ ట్విస్ట్ రా బాబు!

Big Stories

Advertisement
×