Mobile Snatching: ఇదో పెద్ద ట్టిస్ట్.. ఓ ఇద్దరు యువకులు కలిసి దొంగతనం చేయడానికి ప్రయత్నించారు. కానీ ఇందులోనే ఉహించని సంఘటన జరిగింది. సెల్ ఫోన్ దొంగతనానికి పాల్పడిన ఓ ఇద్దరు స్నాచర్లపై ఓ సాధారణ కూలీ చూపిన సాహసం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. దొంగతనానికి పాల్పడిన వ్యక్తిలో ఓకరు మృతి చెందగా మరో యుకుడు దొరికి పోయి కటకటాల పాలయ్యాడు.
బెంగళూరులో నివసించే ఓ కూలీ రోడ్డుపై నడుచుకుంటూ వెల్తున్నాడు. అయితే అటు వైపుగా బైక్ పై ఇద్దరు యువకులు వచ్చి కూలీ చేతిలోని మోబైల్ ఫోన్‌ని లాక్కోని పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన కూలీ భయడకుండా తన చేతిలో ఉన్నటువంటి బ్యాగుతో పారిపోతున్న యువకులపై భలంగా విసిరాడు. దీంతో బైక్ పారిపోతున్న యువకుల అదుపు తప్పిపోయి కింద పడ్డారు. దీంతో అక్కడి స్థానికులు అలర్ట్ అయి యువకులను పట్టుకున్నారు.
Also read: District Review: తెలంగాణలో ఐఏఎస్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ టాస్క్..?
బైక్ పై పారిపోవడానికి ప్రయత్నించిన యువకుల్లో జునైద్ అనే యువకుడు అకస్మాత్తుగా అక్కడిక్కడే గుండె పోటుకు గురై అక్కడే కుప్పకూలి చనిపోయాడు. మరో యువకుడు తీవ్రగాయాలవగా అక్కడ ఉన్న స్థానికుల చిక్కిపోయాడు. దీంతో వెంటనే అప్రమ్తత్తమైన అక్కడి స్థానికులు రెండో యువకుడిని పట్టుకోని పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం అక్కడికి చేరుకున్న పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకోని అరెస్టు చేసి స్టేషన్‌కి తరలించారు.
Also read: ఢిల్లీకి సీఏం విజయ్.. ‘జననాయగన్’ రిలీజ్ డేట్ ఫిక్స్..?