R.K.Roja: ఆర్కే రోజా సౌత్ సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన ఈమె ఇటీవల రాజకీయాలపై దృష్టి సారించడంతో సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు. ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రోజా డైరెక్టర్ సెల్వమని( Selvamani)తో తన ప్రేమ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. రోజా డైరెక్టర్ ఆర్.కె. సెల్వమణి దర్శకత్వంలో ‘చెమ్మరుతి’ అనే సినిమాలో నటించారు. ఈ చిత్రం ద్వారా ఆమె తమిళ పరిశ్రమకు పరిచయమయ్యారు.
ఇలా తన మొదటి సినిమా ఫస్ట్ షెడ్యూల్లో భాగంగానే డైరెక్టర్ సెల్వమనితో తాను ప్రేమలో పడిపోయానని తెలిపారు. అయితే డైరెక్టర్ తో లవ్ అనగానే ఎవరు ఎలాంటి అబ్జెక్షన్ చెప్పలేదా అంటూ ప్రశ్న ఎదురవడంతో మా లవ్ స్టోరీ తెలిసి చిరంజీవి (Chiranjeevi) గారు ఎప్పుడూ నన్ను ఆటపట్టిస్తూ ఉండేవారు. ఇలా మా ప్రేమ గురించి తెలిసిన చిరంజీవి గారు ఏమ్మా నీకు ఎవరు తెలుగోళ్లు దొరకలేదా? పోయి పోయి అరవోన్ని లవ్ చేసావ్ అంటూ నన్ను తిట్టేవారని, చిరంజీవి గారు ఇలా మాట్లాడటంతో వెంటనే సురేఖ అక్క కల్పించుకొని మీకేంటి ప్రాబ్లం ఆ పిల్లకు నచ్చారు, ఆయనకు నచ్చారు. అలా చెప్పకూడదు చిన్న పిల్లలకు, మరి వారి మైండ్ డైవర్ట్ అవుతుంది అంటూ సురేఖ అక్క చిరంజీవి గారిని అరిచేవారని రోజా అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు.
ఇక నేను పథకం ప్రకారం సెల్వ గారిని లవ్ చేయాలని అనుకోలేదు. ఆయన చూపించే కేరింగ్ అలాగే ఆయన విధివిధానాలు నాకు బాగా నచ్చాయని అందుకే తనతో ప్రేమలో పడిపోయానని రోజా తెలిపారు. ఇలా వీరిద్దరూ దాదాపు 11 సంవత్సరాలు ప్రేమలో ఉన్న అనంతరం పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే .ఇక ఈ దంపతులకు ఒక అమ్మాయి అబ్బాయి జన్మించారు. ఇక ప్రస్తుతం సెల్వమని దర్శకుడుగా సినిమాలను తగ్గించారని చెప్పాలి. ఇక రోజా కూడా సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా పలు సినిమాలలో నటించినప్పటికీ అనంతరం ఈమె రాజకీయాలలోకి రావడంతో రాజకీయ కార్యకలాపాలలో బిజీ అయ్యారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జబర్దస్త్ కార్యక్రమానికి జడ్జిగా కొనసాగారు.కానీ మంత్రి అయిన తర్వాత బుల్లితెరకు దూరమయ్యారు. ఎన్నికలలో రోజా ఓటమి పాలు కావడంతో ఈమె తిరిగి తమిళ సినిమాలలో నటిస్తున్నారు. అదేవిధంగా బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్యక్రమాలకు జడ్జిగా కొనసాగుతూ ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీ అవుతున్నారు.
Also Read: ఇండస్ట్రీ క్యాస్టింగ్ కౌచ్ పై రోజా కామెంట్స్.. రమ్మని సిగ్నల్ ఇచ్చేవారంటూ!