R.K.Roja: సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందనే సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు ఈ విషయం గురించి బహిరంగంగా మీడియా సమావేశాలలో మాట్లాడారు. నేటి తరం హీరోయిన్లు మహిళా ఆర్టిస్టులు మాత్రమే కాకుండా సీనియర్ సెలబ్రిటీలు సైతం అప్పట్లోనే ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయని పలు సందర్భాలలో తెలియచేశారు. తాజాగా నటి రోజా (Roja)సైతం ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఈ క్యాస్టింగ్ కౌచ్(Casting couch) గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రోజాకు ఇండస్ట్రీలో మహిళలకు ఎదురయ్యే ఇబ్బందుల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలోనే రోజా మాట్లాడుతూ.. నేను రాజకీయాలలోకి వచ్చిన తర్వాతనే గట్టిగా మాట్లాడుతున్నాను కానీ సినిమా సమయంలో ఎవరితో పెద్దగా మాట్లాడేదాన్ని కాదు వాళ్ళు ఫలానా విషయం గురించి పరోక్షంగా మాట్లాడుతున్నారని నాకు అర్థం అయినప్పటికీ అర్థం కాని దాని లాగే ఉండేదాన్ని ఈ తింగరిదాంతో మనకెందుకులే అని వెళ్ళిపోయేవారు. ఇక మనం సెట్లో అందరితో మాట్లాడుతున్న సమయంలోనే కొంతమంది మీద చేతులు వేసి సిగ్నల్స్ ఇస్తుంటారు. అలాంటి వాటన్నింటినీ నేను చూసి చూడనట్టు ఉండే దానిని తెలిపారు.
ఇకపోతే తాను షూటింగ్లో ఉన్నాను అంటే తన పక్కన అన్నయ్య ఉండేవాడు. అన్నయ్య చూసి కూడా నాతో మాట్లాడటానికి కాస్త భయపడేవారు. నాకు మరో ప్లస్ పాయింట్ ఏంటి అంటే సెల్వ గారు సపోర్ట్ ఉండేవారని రోజా తెలిపారు. అప్పట్లో ఆయన సౌత్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ డైరెక్టర్. తనతో ఎవరైనా ఏదైనా మిస్ బిహేవ్ చేస్తే కనుక నేను వెళ్లి ఎక్కడ సెల్వ గారితో చెబితే వాళ్ల కెరియర్ కి ఇబ్బందనే భయం కూడా అందరిలో ఉండేది. అందుకే తనవరకు ఎవరు ఎలాంటి ఇబ్బందులకు గురి చేసేవారు కాదని, కానీ సెట్ లో ఇలాంటివన్నీ గమనిస్తూ ఉండేదాన్ని అంటూ రోజా తెలిపారు. ఇక ఈమె అప్పటికే డైరెక్టర్ సెల్వా గారితో లవ్ లో ఉన్న నేపథ్యంలో ఈమెకు ఇలాంటి చేదు అనుభవాలు ఎదురు కాలేదని తెలిపారు.
ఇక రోజా తెలుగులో మాత్రమే కాకుండా కన్నడ, తమిళ, మలయాళ భాషలలో కూడా సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. హీరోయిన్ గా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి బ్లాక్ బాస్టర్స్ అందుకున్న ఈమె ఇటీవల కాలంలో తన సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా కీలక పాత్రలలో అడపాదడపా సినిమాలలో నటిస్తున్నారు. మరోవైపు తెలుగు బుల్లితెర కార్యక్రమాలకు జడ్జిగా కొనసాగుతూ బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. మరోవైపు రాజకీయ కార్యకలాపాలలో కూడా రోజా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
Also Read: వెంకటేష్ రోజా మధ్య గొడవలు? అందుకే సినిమాలు చేయలేదా?