R.K.Roja: ఆర్కే రోజా పరిచయం అవసరం లేని పేరు. ఈమె సినీనటిగా రాజకీయ నాయకురాలిగా అందరికీ ఎంతో సుపరిచితమే. హీరోయిన్ గా తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషలలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి సక్సెస్ అందుకున్న రోజా ఇటీవల కాలంలో రాజకీయాలలో కొనసాగుతూ సినిమాలను కాస్త తగ్గించారని చెప్పాలి. ప్రస్తుతం అడపాదడపా సినిమాలలో నటిస్తూ మరోవైపు బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తూనే రాజకీయ వ్యవహారాలలో బిజీగా ఉన్నారు.
ఇక రోజా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలో తెలుగు తమిళ భాషలలో స్టార్ హీరోలు అందరితో కలిసి సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈమె మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో వెంకటేష్ తో కలిసి పెద్దగా సినిమాలు చేయలేదు. కేవలం వీరిద్దరి కాంబినేషన్లో పోకిరి రాజా(Pokiri Raja) అనే సినిమా మాత్రమే విడుదలైంది ఈ సినిమా తర్వాత వీరిద్దరూ సినిమాలు చేయలేదు. ఇలా వెంకటేష్ రోజా కాంబినేషన్ లో సినిమా రాకపోవడానికి కారణం వీరి మధ్య ఉన్న గొడవలేనని తెలుస్తోంది. తాజాగా ఈ విషయాన్ని రోజా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.
నిజానికి తనకు వెంకటేష్ గారికి ఎలాంటి గొడవలు లేవని తెలిపారు అయితే తమిళంలో ఒక సినిమా రీమేక్ విషయంలో తన భర్త అలాగే వెంకటేష్ గారికి మధ్య చిన్న మిస్ అండర్ స్టాండింగ్ వచ్చింది. ఇక తన భర్తతో విభేదాలు వచ్చినప్పుడు నేను కూడా వెంకటేష్ గారితో మాట్లాడటం తగ్గించానని తెలిపారు. అదేవిధంగా పోకిరి రాజా సినిమాకు సంబంధించి ఒక పాట రీ సూట్ చేయాల్సి వచ్చిందని అందుకు తనకు డేట్స్ ఇచ్చారు .తాను కూడా ముందుగా తన భర్త సెల్వ పుట్టినరోజు కావడంతో అంతకుముందే సాంగ్ ఫినిష్ చేయమని కోరాను అలాగే అని పిలిపించారు కానీ సాంగ్ షూటింగ్ పూర్తి చేయలేదు. అందుకే కోపంతో నేను ఎవరికి చెప్పకుండా షూటింగ్ లోకేషన్ నుంచి చెన్నై వెళ్లిపోయానని రోజా తెలిపారు.
ఇలా నేను వెళ్లిపోవడంతో కొంతమంది వెంకటేష్ గారు ఎదురుచూస్తున్న రోజా వెళ్లిపోయారని, మీరు అంటే లెక్క లేదా అంటూ చాలా మాటలు చెప్పి ఉంటారు. ఇలా కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల మా సినిమాలు రాలేదని తెలిపారు.అదే విధంగా తమిళంలో సూపర్ సక్సెస్ అయిన రాజా సినిమాని(Raja Movie) తెలుగులో రీమేక్ చేశారు. అయితే ఆ సినిమాలో కూడా నేను నటించాల్సి ఉంది. కానీ వెంకటేష్ గారు సౌందర్యతో చేశారు అప్పుడు అనిపించింది ఇంక నా మీద కోపం తగ్గలేదు కానీ ఎప్పటికైనా నిజం తెలుసుకుంటారని నేను కూడా ఎక్కడ చెప్పలేదు. ఇప్పుడు ఎక్కడైనా కనిపిస్తే చాలా మంచిగా మాట్లాడుతారని నాకు మంత్రిగా ప్రమోషన్ వచ్చినప్పుడు కూడా ఆయన విష్ చేశారని రోజా తెలిపారు.
Also Read: మనుషులు అన్నాక చచ్చిపోరా? అమ్మ మరణం పై కార్తీక్ ఎమోషనల్!