E-Paper
Advertisement

నాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తున్న ఇరుముడి.. వీడియో వైరల్!

నాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తున్న ఇరుముడి.. వీడియో వైరల్!
Advertisement

Irumudi Movie:ప్రముఖ డైరెక్టర్ శివా నిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వంలో.. మాస్ మహారాజా రవితేజ (Raviteja) హీరోగా, ప్రియా భవాని శంకర్ (Priya Bhavani Shankar) హీరోయిన్ గా, బేబీ నక్షత్ర (Baby Nakshatra) వీరి కూతురి పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఇరుముడి.. ఆగస్టులో విడుదలైన ఈ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిం..దే ముఖ్యంగా కలెక్షన్లు బాగా వస్తున్నప్పటికీ.. థియేటర్ ఒప్పందం ప్రకారం యశ్ టాక్సిక్ మూవీ కోసం కొన్ని థియేటర్ల నుండి సినిమాను తీసేసినప్పటికీ కూడా.. ఈ సినిమా కలెక్షన్లు రాబట్టింది అంటే.. ఈ చిత్రానికి ప్రేక్షక ఆదరణ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఈ సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి కూడా వచ్చి సంచలనం సృష్టిస్తోంది.

నాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తున్న ఇరుముడి..

అలాంటి ఈ సినిమా ఇప్పుడు నాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ అందరి మనసులను కొల్లగొట్టేసింది. సాధారణంగా 80s,90 లలో థియేటర్లు చాలా తక్కువగా ఉండేవి. ఇక అంతమంది ప్రజలు సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్లి సినిమా చూడాలి అంటే చాలా కష్టంగా ఉండేది. అందుకే ఊర్లోనే అందరూ కలిసే చోట ఒక పెద్ద తెర వేసి ఆ తెర పైన తమకు నచ్చిన సినిమా వేసుకొని ఊరంతా కలిసి సరదాగా సినిమా చూసేవారు. అయితే ఇప్పుడు ఇలాంటి సంఘటన ఇరుముడి సినిమా విషయంలో జరగడం ప్రత్యేకం అనే చెప్పాలి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాకి పిల్లల నుండి పెద్దల వరకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో ప్రత్యేకంగా తెరలు ఏర్పాటు చేసి మరీ పల్లెల్లో ప్రదర్శిస్తున్నారు

పల్లెటూర్లలో తెరపై ప్రత్యేక ప్రదర్శన..

Advertisement

వీధుల్లో పెద్ద స్క్రీన్లు పెట్టి కుటుంబ సభ్యులు గ్రామస్తులతో కలిసి సినిమాను చూస్తున్న వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వినాయక చవితి సందర్భంగా కొన్ని గ్రామాలలో వెండితెరపై సినిమాను ప్రదర్శించడం ఇక్కడ విశేషంగా మారింది. థియేటర్లకు వెళ్లలేకపోయిన ప్రేక్షకులు ఇలా తమ గ్రామాల్లోనే తమ ఊరి ప్రజలతో కలిసి సినిమా చూసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది అంటూ గ్రామస్తులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే గ్రామాల్లో ప్రదర్శన వీడియోలు సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంటే 80స్, 90స్ కిడ్స్ తమ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ:రికార్డ్ ధరకి ‘డ్రాగన్’ ఓటీటీ రైట్స్.. ఎన్ని కోట్లంటే?

ఇరుముడి రికార్డుకి అడ్డుకట్ట వేసిన ఓటీటీ.

Advertisement

ఇకపోతే ఈ ఏడాది తెలుగులో అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన ఇరుముడి సినిమా ఒక అరుదైన మైలురాయిని కోల్పోయింది. ఈ సినిమా ఓటీటీలోకి త్వరగా రావడంతో నైజాంలో 100 కోట్ల గ్రాస్ మార్క్ ను చేజార్చుకుంది. 95 కోట్ల మధ్య ఆగిపోయిన ఈ చిత్రం మరికొంత కాలం థియేటర్లలో ఉండుంటే .. ఆ అరుదైన మైలు రాయిని సులభంగా దాటేదని ట్రేడ్ వర్గాలు కూడా చెబుతున్నాయి.. ఏది ఏమైనా నైజాం ఏరియాలో రికార్డు సృష్టించాల్సిన ఇరుముడి ఓటీటీ కారణంగా ఆ రికార్డును మిస్ చేసుకుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇకపోతే ఆగస్టు 21న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సెప్టెంబర్ 18 స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. అలా నెల తిరగకుండానే ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.200 కోట్లకు పైగా వసూలు రాబట్టింది.

Related News

డైరెక్టర్ సెల్వాతో రోజా లవ్..చిరంజీవి అంత మాట అన్నారా?

బాడీ షేమింగ్ ట్రోల్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కత్రినా కైఫ్!

ఇండస్ట్రీ క్యాస్టింగ్ కౌచ్ పై రోజా కామెంట్స్.. రమ్మని సిగ్నల్ ఇచ్చేవారంటూ!

వెంకటేష్ రోజా మధ్య గొడవలు? అందుకే సినిమాలు చేయలేదా?

మీనాక్షికి చుక్కెదురు..హైకోర్టు కీలక ఉత్తర్వులు?

సోషల్ మీడియా దెబ్బకు దిగివచ్చిన అను ఇమ్మాన్యుయేల్.. ?

వామ్మో.. మౌనిరాయ్ నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

Big Stories

Advertisement
×