Big TV Kissik talks Promo:బిగ్ టీవీ నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ షో ఇప్పుడు ఏకంగా 33వ ఎపిసోడ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే..తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని నిర్వహకులు విడుదల చేశారు. ఈ ఎపిసోడ్ కి ప్రముఖ నటి కస్తూరి శంకర్ గెస్ట్ గా వచ్చారు.. అయితే ఇందులో ఎన్నో విషయాలను పంచుకున్న ఈమె తన కోరికలను కూడా బయట పెట్టడంతో ఈ వయసులో ఆ కోరిక మామూలుగా లేదుగా అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
జబర్దస్త్ వర్ష హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ కిస్సిక్ టాక్స్ కి గెస్ట్ గా వచ్చిన కస్తూరి శంకర్ తో వర్షా మాట్లాడుతూ..” మీరు విజయ్ దేవరకొండ పక్కన సిస్టర్ గా చెయ్యమని.. అందుకు ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తే ఒప్పుకుంటారా?” అని ప్రశ్నించగా.. అదే హీరో పక్కన వేరే పాత్ర ఇస్తే తక్కువ రెమ్యునరేషన్ తో చేయడానికి కూడా సిద్ధం అంటూ తెలిపింది కస్తూరి శంకర్. అదేంటి సిస్టర్ పాత్ర మీరు చేయరా? అని అడిగితే సిస్టర్ ఏంటి ఇప్పుడు ఫట్మని ఐటమ్ సాంగ్ చేయడానికి కూడా నేను సిద్ధమే అంటూ కస్తూరి శంకర్ రియాక్షన్ ఇచ్చింది. మొత్తానికైతే ఈ వయసులో కూడా ఐటమ్ సాంగ్ చేయడానికి సిద్ధమని అందులోనూ విజయ్ దేవరకొండ పక్కన ఐటమ్ సాంగ్ చేస్తానని చెప్పడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. లేటు వయసులో కూడా యంగ్ హీరో పక్కన ఐటమ్ సాంగ్ చేస్తానంటోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ALSO READ:Big TV Kissik talks Promo : మణికొండ రాసిస్తానంటున్న కస్తూరి.. మరీ అంత ఆస్తి ఉందా ?
ఇకపోతే ఇదే ఇంటర్వ్యూలో తాను ఏకంగా నాలుగు సార్లు చచ్చి బ్రతికాను అంటూ చెప్పుకొచ్చింది. మనల్ని కన్నవాళ్ళు మరణిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు.. కానీ మనం కన్నవాళ్ళు ప్రాణాలతో పోరాడుతున్నారు అంటే ఇక ఆ బాధ వర్ణించలేనిది. నా కూతురు కూడా చావు అంచుల వరకు వెళ్ళింది. ఇక అప్పుడు నేను కూడా ఇక లేను ఫిక్స్ అయిపోయాను అంటూ తెలిపింది. అసలు ఏమైంది మీ కూతురికి అని వర్ష ప్రశ్నించగా.. లుకేమియా వచ్చింది అని చేదు నిజాలు బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది కస్తూరి శంకర్.
అల్లు అర్జున్ జైలుకి వెళ్ళిన విషయంపై కూడా ఆమె స్పందిస్తూ ఏదైనా సరే తలరాత.. ముఖ్యంగా అది నా వరకు వచ్చే వరకు తెలియలేదు. ఇక అల్లు అర్జున్ టైం బ్యాడ్ కాబట్టి ఆయన కూడా జైలుకి వెళ్లి వచ్చాడు అంటూ తెలిసింది కస్తూరి శంకర్. మొత్తానికి అయితే కస్తూరి శంకర్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి పూర్తి ఎపిసోడ్ చూడాలి అంటే శనివారం రాత్రి 7 గంటల వరకు ఎదురు చూడాల్సిందే.