Son Killed Step Father: అమెరికాలోని స్టేటెన్ ఐలాండ్ దారుణం జరిగింది. సవతి తండ్రి(45)ని కొడుకు అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ కేసులో 19 ఏళ్ల కొడుకుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఓ యువతి తన సోదరుడు నివాసం ఉంటున్న కారీ అవెన్యూలోని ఇంటికి వచ్చింది. ఇల్లంతా రక్తపు మరకలు కనిపించాయి. బాత్ టబ్ లో తన సోదరుడు తల లేకుండా పడి ఉండడాన్ని చూసి షాక్ కు గురైంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది.
బాధితుడి తల, మెడపై పలుమార్లు కత్తితో దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. అతడు సంఘటనా స్థలంలోనే చనిపోయినట్లు తెలిపారు. వ్యక్తిని తల నరికి చంపారని నిర్ధారించారు. సవతి తండ్రి హత్య కేసులో కొడుకును పోలీసులు అరెస్ట్ చేశారు. అతడికి అంతకు ముందు నేర చరిత్ర లేదని తెలిపారు.
న్యూయార్క్ పోస్ట్ ప్రకారం బాధితుడు స్థానికంగా ఓ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. అతడికి కంటి చూపు సరిగ్గా కనిపించడంలేదని పోలీసులు గుర్తించారు. తన చెల్లెలితో సవతి తండ్రి చెడుగా ప్రవర్తించినందుకే హత్య చేసినట్లు టీనేజర్ పోలీసులకు చెప్పాడు. వీరి కుటుంబంలో సమస్యలు ఉన్నట్లు న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది.
బాధిత వ్యక్తి 60 ఏళ్లుగా ఆ ఇంట్లో నివసిస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు. ప్రపంచం చాలా భయంకరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
“నేను ఆ యువకుడ్ని ఎప్పుడూ చూడలేదు. ఆ వ్యక్తి నాకు తెలుసు. నాకు ఇదంతా ఒక షాక్ లా ఉంది. చాలా దారుణంగా హత్య చేశాడు” అని పొరుగింటి వ్యక్తి ఒకరు తెలిపారు. ప్రస్తుతం కస్టడీలో ఉన్న కొడుకుపై పోలీసులు కేసు నమోదు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అతని మానసిక అనారోగ్యం ఉందని పోలీసు భావిస్తున్నారు.