భారతీయ రైల్వే రోజు రోజుకు టెక్నాలజీ పరంగా మరింత అప్ డేట్ అవుతోంది. ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. అయితే, రైళ్లలో అందించే ఫుడ్ విషయంలో ప్రయాణీకుల నుంచి తరచుగా ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. వీటిలో ఎక్కువగా ఫుడ్ క్వాలిటీకి సంబంధించిన కంప్లైంట్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే, తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ వీడియో చూసి ప్రయాణీకులంతా షాకయ్యారు. రైళ్లలో ఫుడ్ ఇలాంటి కంటేనర్లలో ఫుడ్ ప్యాక్ చేస్తారా? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో చూస్తుంటే రైళ్లలో ఫుడ్ తినాలంటేనే భయంగా ఉందంటున్నారు చాలా మంది ప్యాసింజర్లు.
తాజాగా ఈరోడ్-జోగ్బాని మార్గంలో నడిచే అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ (16601) నుంచి ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. ఇందులో ఓ వ్యక్తి వాడి పడేసిన డిస్పోజబుల్ కంటైనర్లను మళ్ళీ ఉపయోగించేందుకు కడుగుతూ కనిపించారు. ఈ వీడియో చూసి చాలా మంది షాకయ్యారు. అత్యాధునిక రైళ్లలో ఒకటైన అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ రైల్లోనే ఫుడ్ ఇంత అధ్వాహ్నంగా అందిస్తున్నారంటే, ఇతర రైళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో? అని ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో భారతీయ రైళ్లలో పరిశుభ్రత, ఆహార భద్రతా ప్రమాణాల గురించి తీవ్ర ఆందోళన కలిగేలా చేఇంది.
వాస్తవానికి భారతీయ రైల్వే ఆహార భద్రతను మెరుగుపరచడానికి చాలా చర్యలు చేపడుతుంది. ఆహార తయారీని పర్యవేక్షించడానికి వంటశాలలలో కెమెరాలను ఏర్పాటు చేయడం, క్యాటరింగ్ యూనిట్లకు తప్పనిసరి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) సర్టిఫికేషన్ ఉండాలనే నిబంధనలు పెట్టింది. పరిశుభ్రత, నాణ్యతా ప్రమాణాలను నిర్ధారించడానికి అధికారులు క్రమం తప్పకుండా ఆడిట్ కూడా చేస్తారు. కానీ, అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ లో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు.
At a time when Reel Minister @AshwiniVaishnaw is inaugurating “printed bed sheets” this is what “full fare” paying common Indian Citizens are getting in the name of “hygiene & service”!
This video is from Amrit Bharat Express (Crown Jewel of @RailMinIndia , inaugurated by… pic.twitter.com/f7sW0imscd
— 𝐑𝐢𝐣𝐮 𝐃𝐮𝐭𝐭𝐚 (@DrRijuDutta_TMC) October 20, 2025
ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “రైళ్లలో ఇలాంటి ఘటనలు కామన్ అయ్యాయి. క్వాలిటీ లేని ఫుడ్ అందించడంతో పాటు ఎక్కువ ధరకు అమ్మడం, ఇదేంటని అడిగిన వారిపై దాడి చేయడం లాంటి పనులు జరుగుతున్నాయి. ఇలాంటి వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి” అంటూ ఓ నెటిజన్ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో పాటు ఇండియన్ రైల్వేకు ట్యాగ్ చేశాడు ఓ నెటిజన్. “రాజధాని ఎక్స్ ప్రెస్ లో ప్యాంట్రీ సిబ్బంది ఇతర కంపార్ట్ మెంట్లలో ఉపయోగించిన ప్లాస్టిక్ ట్రేలను ఉపయోగించం నేను చూశాను” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు.
అటు ఈ వీడియో వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో అధికారులు స్పందించారు. సదరు క్యాటరింగ్ కాంట్రాక్టర్ లైసెన్స్ రద్దు చేసినట్లు ప్రకటించారు. ఈ మేరకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేసింది. “ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణించిన తర్వాత, రైల్వే అధికారులు విక్రేతను గుర్తించి వెంటనే తొలగించారు. లైసెన్స్ ను రద్దు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. భారీ జరిమానా విధించబడుతుంది” అని వెల్లడించింది.
Read Also: ప్రయాణీకుడి కాలర్ పట్టుకుని సమోసాల విక్రేత దౌర్జన్యం.. కేసు నమోదు చేసిన పోలీసులు!