SR Kalyanamandapam : ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తమ సొంత టాలెంట్ నమ్ముకుని హీరోగా ప్రూవ్ చేసుకున్న వాళ్లు ఉన్నారు. వాళ్లలో కిరణ్ అబ్బవరం ఒకరు. ముందుగా షార్ట్ ఫిలిమ్స్ తో కెరియర్ స్టార్ట్ చేసిన కిరణ్ రవి కిరణ్ కోలా దర్శకుడుగా పరిచయమైన రాజా వారు రాణి గారు సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది.
రాజావారు రాణి గారు సినిమా తర్వాత ఎస్ఆర్ కళ్యాణమండపం అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు కిరణ్. ఈ సినిమా మొదటి షో పడినప్పటి నుంచే మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. కేవలం ఈ సినిమాతో హీరో గానే కాకుండా రచయితగా కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు కిరణ్. కరోనా సెకండ్ వేవ్ టైం లో వచ్చిన ఈ సినిమా, ప్రేక్షకులు ఒక సినిమాను ఎలా ఆదరిస్తారో అని మరోసారి నిరూపించింది.
వరుస అవకాశాలు
రాజావారు రాణి గారు, ఎస్ఆర్ కళ్యాణమండపం ఈ రెండు సినిమాలు వరుసగా హిట్ అవడం వలన, కిరణ్ కు విపరీతమైన అవకాశాలు వచ్చాయి. చాలా పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ అడ్వాన్స్డ్ ఇచ్చి కిరణ్ ను లాక్ చేశాయి. ఒక తరుణంలో కిరణ్ అబ్బవరం సినిమాలో వరుసగా వచ్చేస్తూ ఉండేది. అసలు ఏ సినిమా ఎప్పుడు వచ్చి ఎప్పుడు వెళ్ళిపోయిందో అర్థం కాని పరిస్థితి కూడా మధ్యలో ఒకసారి వచ్చింది. వచ్చిన అవకాశం వదులుకోకూడదు అనే ఉద్దేశంతో బహుశా అన్ని సినిమాలను చేసేసాడు కిరణ్. అని కొన్ని సినిమా ఫలితాలు తనకు తెలియకుండానే తేడా కొట్టేసాయి. మొత్తానికి ఒక లాంగ్ బ్రేక్ తీసుకొని క సినిమాతో అదిరిపోయే కం బ్యాక్ ఇచ్చాడు. ఇక ప్రస్తుతం కిరణ్ వరుస సినిమాలతో బిజీగా మారాడు.
4 Years for SR Kalyanamandapam ❤️
Thanks for the recognition and love that you have given me for this film 😇#SRKalyanamandapam pic.twitter.com/Ndv5IvqcWB
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) August 6, 2025
పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్
రాజావారు రాణి గారు వంటి లవ్ స్టోరీ తర్వాత ఏ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తాడా అని కొద్దిపాటి మంది క్యూరియాసిటీ ఉండేది. సరిగ్గా అదే టైంలో పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు కిరణ్. ఈ సినిమాలో ప్రతి అంశం కూడా బాగా వర్క్ అయ్యాయి. ముఖ్యంగా కిరణ్ ఎంట్రీ సీన్, కొన్ని కాలేజీ ఎపిసోడ్స్, అలానే సాంగ్స్, యాక్షన్ సీన్స్ అన్నీ కూడా ఈ సినిమాకు సమపాళ్లలో కుదిరాయి. అందుకే మంచి ఆదరణ లభించింది. ఈ సినిమా వచ్చి నేటికి నాలుగు సంవత్సరాలు పూర్తవుతుంది. ఎస్ ఆర్ కళ్యాణ మండపం సినిమాతో మంచి హిట్ సినిమా కిరణ్ కెరియర్ కి వచ్చినా కూడా వరుస అవకాశాలు తెచ్చి కిరణ్ కెరియర్ ను అయోమయంలో పడేసింది కూడా ఇదే సినిమా అని చెప్పాలి.
Also Read: Manchu Manoj : కం బ్యాక్ కోసం స్ట్రగులింగ్, మరో ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్