Manchu Manoj : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ లో మంచు మనోజ్ ఒకరు. ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించేవాడు మనోజ్. కానీ కొన్ని కారణాల వలన మనోజ్ సినిమాలు చేయటం కంప్లీట్ గా తగ్గించేసాడు. అయితే మనోజ్ మళ్లీ కం బ్యాక్ ఇవ్వడం కోసం చాలా స్ట్రాంగ్ గా కష్టపడుతున్నాడు. ఇక రీసెంట్ గా ప్రేక్షకులు ముందుకు వచ్చిన భైరవం సినిమా కొంత మేరకు పరవాలేదు అనిపించింది.
మంచు ఫ్యామిలీ సినిమాలను ఒకప్పుడు విపరీతంగా ట్రోల్ చేసేవాళ్ళు. ఆ తరుణంలో మంచు మనోజ్ సినిమాలకు మంచి ఆదరణ లభించింది. మనోజ్ కథలు ఎంచుకునే విధానం చాలామందికి విపరీతంగా కనెక్ట్ అయింది. మనోజ్ కెరియర్ లో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వేదం, ప్రయాణం, మిస్టర్ నూకయ్య వంటి సినిమాలు మనోజ్ కి మంచి ప్లస్ అయ్యాయి.
మరో కొత్త సినిమా అనౌన్స్మెంట్
మంచు మనోజ్ ఇప్పటివరకు మొత్తం 20 సినిమాలు చేశారు. ఇక ప్రస్తుతం 21వ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానున్నారు. ఇప్పుడు మనోజ్ నటిస్తున్న సినిమా పేరు డేవిడ్ రెడ్డి. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. 1897 నుంచి 1922 రెండులో జరిగే ఒక యాక్షన్ డ్రామా సినిమా ఇది. ఈ సినిమాకి హనుమారెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఈ సినిమా అఫీషియల్ అప్డేట్ ట్విట్టర్ వేదికగా మనోజ్ ఇచ్చాడు. అలానే ఇన్ని సంవత్సరాలనుంచి తనను సపోర్ట్ చేస్తున్న ప్రేక్షకులకు తన తరఫున ప్రేమను తెలియజేశాడు. ఈ సినిమా కోసం తన ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నట్టు తెలిపాడు.
With a heart full of gratitude… 🙏
Today marks 21 years of my journey in cinema. I feel truly blessed to be still doing what I love.
And with the same love and hope, sharing my 21st film titled #DavidReddy ❤️🔥
A raw, intense, high-octane historical action drama set between… pic.twitter.com/aRZhjoL1jx
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) August 6, 2025
మిరాయి తో పాన్ ఇండియా
ఇక ప్రస్తుతం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సినిమా మిరాయి. ఈ సినిమాలో మంచు మనోజ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. మంచు మనోజ్ తేజ కలిసిన నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 5న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. కింద ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన టీజర్ విపరీతంగా ఆకట్టుకుంది. వి ఎఫ్ ఎక్స్ పరంగా నెక్స్ట్ లెవెల్ లో ఈ టీజర్ క్వాలిటీ ఉంది. అందుకే సినిమా మీద కూడా చాలామందికి ఒక రకమైన క్యూరియాసిటీ పెరిగింది. ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు. ఈగల్ సినిమా తర్వాత మళ్లీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కార్తీక్ దర్శకుడుగా ఈ సినిమాను చేశారు.
Also Read: Shruti Haasan : కొంతమంది సెట్స్ లో మైక్స్ విసిరేస్తారు, కానీ లోకేష్ ఎలా ఉంటాడంటే?