E-Paper
Advertisement

Water Tourism: ఇక గోవా వెళ్లక్కర్లేదు.. తెలంగాణలో నీటిపై తేలియాడే రెస్టారెంట్.. ఎక్కడో తెలుసా..!

Water Tourism: ఇక గోవా వెళ్లక్కర్లేదు.. తెలంగాణలో నీటిపై తేలియాడే రెస్టారెంట్.. ఎక్కడో తెలుసా..!
Advertisement

Water Tourism: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు, సందర్శకులను ఆకట్టుకునేందుకు ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా భవిష్యత్తులో పర్యాటక రద్దీ పెరిగే అవకాశం ఉన్న మరో మూడు ప్రాంతాలలో కొత్తగా బోటింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. కొండపోచమ్మ సాగర్, కోస్గి, గుడిచెరువు జలాశయాల్లో బోటింగ్ నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. శాఖ ఒక ఉన్నత స్థాయి త్రిసభ్య కమిటీని సైతం ఏర్పాటు చేసింది. ఆ కమిటీ అధ్యయనం చేస్తుంది.

వసతులు, భద్రతపై కమిటీ నిఘా

ఈ త్రిసభ్య కమిటీ లో బూటింగ్, ఇంజనీరింగ్, ప్రాజెక్టు సెక్షన్ నుంచి ఉద్యోగులు ఉన్నారు. ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి ఆయా ప్రాంతాలలో పర్యాటకుల రాక ఎలా ఉంది? అక్కడ బోటింగ్‌కు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయా? పర్యాటకులకు అవసరమైన కనీస వసతులు, భద్రతా ప్రమాణాలు ఏ మేరకు ఉన్నాయి? అనే అంశాలపై సమగ్రంగా వివరాలను సేకరిస్తోంది. కమిటీ ఇచ్చే తుది నివేదిక ఆధారంగానే కోస్గి, గుడిచెరువు, కొండపోచమ్మలలో బోటింగ్ నిర్వహణపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. వీటితో పాటు ఇబ్రహీంపట్నం, బతుకమ్మ చెరువు, మల్కం చెరువు తదితర ప్రాంతాల్లోనూ త్వరలోనే బోటింగ్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

రామప్ప సరస్సులో ‘తేలియాడే రెస్టారెంట్’!

Advertisement

ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన ములుగు జిల్లాలోని చారిత్రాత్మక రామప్ప దేవాలయ పరిసరాలు పర్యాటకులను మరింతగా మంత్రముగ్ధులను చేయనున్నాయి. రామప్ప సరస్సులో సరికొత్తగా ‘తేలియాడే రెస్టారెంట్’ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. టెండర్లు సైతం ఫైనల్ అవుతున్నట్లు సమాచారం. నీటిపై తేలియాడే ఈ రెస్టారెంట్ పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించడమే కాకుండా, ఈ ప్రాంతంలో పర్యాటక రంగానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుందని అధికారులు భావిస్తున్నారు.

Also Read: భార్య మరొకరితో.. షాకైన భర్త, పిల్లలకు కరెంట్ షాక్ ఇచ్చి చంపాడు

18 రకాల టెండర్లు

Advertisement

పర్యాటక ప్రాంతాల్లో జలవిహారాన్ని మరింత చేరువ చేసేందుకు సిద్ధమైంది. పర్యాటకులకు అత్యాధునిక సౌకర్యాలు, సరికొత్త అనుభూతిని అందించే లక్ష్యంతో వివిధ జిల్లాల్లోని జలాశయాలు, చెరువుల వద్ద కొత్త బోట్లు, జెట్టీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం మొత్తం 18 విభాగాల్లో టెండర్లను ఆహ్వానించింది. త్వరలోనే పనులు కూడా ప్రారంభం కానున్నట్లు సమాచారం.లక్నవరం (లక్నాపూర్)లో ఇక్కడ పర్యాటకుల కోసం ప్రీమియం క్యాటమరాన్ బోట్లు, స్పీడ్ బోట్లు, పెడల్ బోట్లతో పాటు భారీ ఫ్లోటింగ్ జెట్టీలను ఏర్పాటు చేయనున్నారు. అదే విధంగా బోరంఛా, గుడి చెరువు, కమలాపూర్, నల్లవాగు వంటి ప్రాంతాల్లో కూడా వివిధ సామర్థ్యాలు గల స్పీడ్ బోట్లు, క్యాటమరాన్ బోట్లు, జెట్టీలను అందుబాటులోకి తెస్తున్నారు.

భద్రతకు పెద్దపీట

కేవలం వినోదమే కాకుండా, పర్యాటకుల భద్రతకు పర్యాటక శాఖ పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున లైఫ్ జాకెట్లు, పర్సనల్ ఫ్లోటేషన్ డివైజెస్, లైఫ్ బువాస్‌లను సేకరిస్తోంది. అంతేకాకుండా, నీటిపై నడిచే వాహనాల నాణ్యత, సాంకేతిక అంశాలను పర్యవేక్షించేందుకు నిపుణులైన ‘నావల్ ఆర్కిటెక్ట్స్’ సేవలను కూడా వినియోగించుకోనుంది.ఈ కొత్త వసతులు అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో వాటర్ టూరిజం కొత్త పుంతలు తొక్కడమే కాకుండా, పర్యాటకుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Also Read: పద్మ భూషణ్ అవార్డును తిరస్కరించిన జానకమ్మ.. ఆస్తుల చిట్టా తెలిస్తే షాకే!

Related News

భక్తి ముసుగులో రక్తి క్రీడ.. జూబ్లీహిల్స్‌లో గురూజీల నిజస్వరూపం బట్టబయలు!

హైటెక్స్ వేదికగా ‘సమాఖ్య-2026’ బిజినెస్ మీట్ ప్రారంభించిన సీఎం రేవంత్!

మందుబాబులకు బిగ్ షాక్.. మద్యం ధరలు పెంపు.. అధికారిక ఉత్తర్వులు జారీ!

2 లక్షల మందితో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. ఎందుకో క్లారిటీ ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్!

నీ హీరోయిన్ల జాతకం మొత్తం బయటపెడతా.. కేటీఆర్ పై బల్మూరి వెంకట్ ఫైర్!

విదేశాల్లో చదవాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. వెంటనే అప్లై చేయండి?

33 జిల్లాల తెలంగాణలో టాలెంట్ ఉన్న క్రికెటర్లు లేరా.. ధరం గురువారెడ్డి ఫైర్!

హైదరాబాద్‌కు జగన్ మకాం..అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్, న్యాయస్థానం కీలక నిర్ణయం

Big Stories

Advertisement
×