Mahavathar Narasimha : ఈమధ్య వస్తున్నా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద తేడా కొట్టేస్తున్నాయి. భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు వచ్చిన మొదటి రోజే మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. కానీ ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చిన ప్రతి సినిమా మంచి టాక్ ని సొంతం చేసుకుంటుంది. గత నెల నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాలలో యానిమేషన్ మూవీ ‘మహావతార నరసింహ’ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. జూలై 25న థియేటర్లోకి వచ్చిన ఈ మూవీ మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది . నెల రోజులైనా కూడా కలెక్షన్లు ఎక్కడ తగ్గలేదు.. ఈ వీకెండ్ కూడా ఈ మూవీ ని ట్రెండ్ అవ్వడంతో సినిమాను చూసేందుకు జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ వీకెండ్ ఎన్ని కోట్లు వసూల్ అయ్యాయో చూద్దాం..
దుమ్ము దులిపేస్తున్న యానిమేషన్ మూవీ..
భారీ బడ్జెట్, తారాగణంతో పాటుగా గ్రాఫిక్స్ తో వచ్చిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతున్నాయి. గత ఏడాది వచ్చిన చిన్న సినిమాలు కోట్లు వసూల్ చేశాయి.. కానీ పెద్ద సినిమాలు డీలా పడ్డాయి. ఎటువంటి అంచనాలు క్రియేట్ చెయ్యకుండా.. చిన్న సినిమాగా వచ్చింది మాత్రం బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రజినీకాంత్ సినిమాలను పోటీ ఇచ్చింది యానిమేషన్ చిత్రం మహావతార్ నరసింహ.. సినిమా వచ్చి నెలా అవుతున్న సరే కలెక్షన్లు మాత్రం ఎక్కడా తగ్గకుండా వసూలు అవుతున్నాయి. ఇదే జోరులో కొనసాగితే ఈ సినిమా త్వరలోనే వెయ్యి కోట్లు రాబట్టిన ఆశ్చర్యపోనవసరం లేదంటూ అభిమానులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు..
‘కూలీ’కి బిగ్ షాక్..
ఇండియన్ సినిమా దగ్గర చాలా తక్కువగా వచ్చే ఈ యానిమేషన్ చిత్రాల్లో ఆల్ టైం రికార్డు గ్రాసర్ గా నిలిచింది. థియేటర్లలో రిలీజ్ అయ్యి నెల అవుతున్నా దండయాత్ర కొనసాగిస్తుంది..ఈ నెల రోజుల్లో కూడా ఈ డామినేషన్ మాత్రం ఊహించని లెవెల్లో ఉందని చెప్పి తీరాలి. ఈ మధ్య చాలానే పెద్ద హీరోల సినిమాలు వచ్చినప్పటికీ ఆడియెన్స్ ఈ సినిమాకి వాటిని మించి బ్రహ్మ రథం పడుతున్నారు. కూలీ, వార్ 2 చిత్రాలు థియేటర్లలో రన్ అవుతున్నా ఈ చిత్రానికే బుకింగ్స్ ఎక్కువగా వస్తున్నట్లు తెలుస్తుంది. కూలీకి బిగ్ షాక్.. కొన్ని చోట్ల ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుంది..
Also Read: అక్షయ్ కు క్లాస్ పీకిన అవని.. అడ్డంగా బుక్కయిన చక్రధర్.. వ్రతం ఆపేందుకు ప్లాన్..
‘మహావతార్ నరసింహ’ బడ్జెట్?
ఇప్పటి వరకు మహావతార్ నర్సింహా చిత్రం ఇండియా నెట్ రూ.217 కోట్లు, ఇండియా గ్రాస్ రూ.260 కోట్లు, ఓవర్సీస్ లో రూ.23 కోట్ల గ్రాస్ వసూళ్లు అందుకుంది. ఇక 26 రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం రూ.283 కోట్ల గ్రాస్ వసూల్ చేసిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఈ వీకెండ్ 400 కోట్ల వసూళ్లను అందుకుంటుందని టాక్.. యానిమేటెడ్ ఫిల్మ్ మహావతార్ నర్సింహాను హోంబలే ఫిల్మ్స్, క్లీమ్ వీఎఫ్ఎక్స్ స్టూడియోలు సంయుక్తంగా నిర్మించాయి. అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు.. 15 కోట్లు ఖర్చైంది, ఇక లాభాల్లోకి రావాలంటే రూ.30 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉంది. కానీ కలెక్షన్ల సునామీ సృష్టించింది.