Kavya: బుల్లితెర అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ (Bigg Boss)కార్యక్రమానికి సర్వం సిద్ధం అయ్యింది. తెలుగులో ఈ కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ ఉన్న నేపథ్యంలో నిర్వాహకులు వరుస సీజన్లతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులకు కావలసిన వినోదాన్ని అందిస్తున్నారు. ఇక త్వరలోనే ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియతో పాటు బిగ్ బాస్ హౌస్ ఏర్పాట్లను కూడా నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. ఇక తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన లోగో ప్రోమోని కూడా నిర్వాహకులు విడుదల చేశారు. ఈ ప్రోమో చూస్తుంటే మాత్రం ఈసారి బిగ్ బాస్ మరింత ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతుందని అలాగే కంటెస్టెంట్ల మధ్య గట్టి పోటీ కూడా ఉండబోతుందని స్పష్టమవతుంది.
కంటెస్టెంట్ లో ఎంపిక ప్రారంభం..
ఇకపోతే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల కావడంతో ఈ కార్యక్రమంలో పాల్గొనే కంటెస్టెంట్ లో గురించి కూడా వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఎక్కువ భాగం స్టార్ మా సీరియల్స్ లో పనిచేసే సెలబ్రిటీలు పాల్గొనబోతున్నారని, అలాగే కిరాక్ బాయ్స్, కిలాడి గర్ల్స్ షో నుంచి కూడా ఎక్కువ శాతం కంటెస్టెంట్లు పాల్గొనే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇలా బుల్లితెర నటీనటులతో పాటు సోషల్ మీడియా సెలబ్రిటీలను కూడా ఎంపిక చేసినట్టు సమాచారం.
కావ్య ఎంట్రీ కన్ఫామ్?
బిగ్ బాస్ కంటెస్టెంట్లు వీళ్లే అంటూ బయటకు వచ్చిన లిస్టులో బుల్లితెర నటి కావ్య(Kavya) కూడా ఉన్నారు. బుల్లితెర నటిగా కావ్య ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న చిన్ని సీరియల్(Chinni Serial) లో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. గత కొంతకాలంగా కావ్య ఈ సీజన్లో కంటెస్టెంట్ గా పాల్గొనబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా కావ్య బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనడం పక్కా అని తెలుస్తోంది. ఈమె నటిస్తున్న చిన్ని సీరియల్ నుంచి కావ్యను తప్పించడమే అందుకు కారణమని చెప్పాలి.
చిన్ని సీరియల్ నుంచి తప్పుకున్న కావ్య..
కావ్య హీరోయిన్ గా చిన్ని సీరియల్ లో నటిస్తూ మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. అయితే ఇటీవల ఈమె పాత్ర చనిపోయినట్టు చూపించారు. ఇలా కావ్య పాత్రను చంపేయడానికి కారణం ఈమె బిగ్ బాస్ అవకాశం అందుకోవడమేనని తెలుస్తోంది. ఇక కావ్య ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారనే విషయం తెలిసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే గత సీజన్లో ఈమె మాజీ ప్రియుడు నిఖిల్ బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా సీజన్ 8 విన్నర్ గా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. మరి సీజన్ 9 కార్యక్రమంలో కావ్య ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలియగానే అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కావ్య బిగ్ బాస్ ఎంట్రీ గురించి వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి. ఇక ఈ కార్యక్రమం సెప్టెంబర్ మొదటి వారంలో ప్రసారమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.
Also Read: అతని ఇల్లు.. అతని రూల్స్.. సమంత కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి?