BigTV English

BJP MLA: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. బీజేపీ అభ్యర్థి ఎవరంటే?

BJP MLA: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. బీజేపీ అభ్యర్థి ఎవరంటే?

BJP MLA: కాషాయా పార్టీ ఉప ఎన్నికకు కాలు దువ్వుతోందా..? జూబ్లీ హిల్స్ స్థానం ఆ పార్టీకి సవాల్ గా ఉన్నప్పటికీ సై అంటుందా..? ఈ సారి గురి తప్పదా..? బరిలో మహిళా నేతను దించేందుకు పక్కా పాచికలతో లెక్కలేస్తుందా..? జూబ్లీ”హిల్స్” పై ఎగిరే జెండా ఎవరిది..? కేంద్రమంత్రి ఇలాకాలో ఉన్న జూబ్లీహిల్స్ స్థానంపై బీజేపీ పట్టు సాధిస్తుందా..? అసలు జూబ్లిహిల్స్‌పై కమలం పార్టీ ప్రణాళికలేంటి..?


జూబ్లీ హిల్స్‌ ఉపఎన్నికపై బీజేపీ కన్ను

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కమలదళం కన్నేసింది. ఆ సీటును కైవసం చేసుకునేందుకు వ్యూహాలకు పదును పెడుతోంది. హిల్స్ పై జెండాను ఎగరవేసే సత్తా ఉన్న అభ్యర్థిని ప్రకటించి…ఆ స్థానాన్ని తమ ఖాతాలోకి వేసుకోవాలని కాషాయ పరివారులు ఉవ్విళ్లూరుతున్నారు. పార్టీలో టికెట్ ఆశిస్తున్న నేతలెవరు….ఆ టికెట్ కోసం పోటీ పడుతున్న నేతలెవరూ…. పార్టీ ఎవరివైపు మొగ్గు చూపుతుంది….పార్టీ ఆశీస్సులు దక్కెదెవరికి… మహిళలకు అవకాశం ఇస్తారా…లేక గత ఎన్నికల్లో అవలంభించిన ధోరణినే మళ్ళీ రిపీట్ చేస్తారా అనేది ఇప్పుడు బీజేపీలో హాట్ హాట్ గా కొనసాగుతోందట.


అన్ని రంగాల వారు కలగలిపి ఉండే జూబ్లీ హిల్స్

ధనిక, పేద కలగలిపిన అసెంబ్లీ నియోజకర్గం జూబ్లీ హిల్స్. ఎవరి స్టేటస్ వారిదే ఇక్కడ. బెంజ్ నుంచి ఆటో వరకు అన్ని రంగాల వారు ఇక్కడ కలగలిపి ఉంటారు. ముఖ్యంగా బుల్లితెర, వెండితెర సినిమా ఇండస్ట్రీ మొత్తం జూబ్లీహిల్స్‌లోనే కనిపిస్తుంది.అక్కడ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన మాగంటి గోపినాథ్ మృతి చెందడంతో ఈ అసెంబ్లీ స్థానం ఖాళీ అయ్యింది. ఎన్నికల నియమావళి లెక్కల ప్రకారం ఆరు మాసాల్లోపు ఉప ఎన్నిక ప్రక్రియ పూర్తికావాల్సి ఉంది. అందులోభాగంగానే ఈ అసెంబ్లీ స్థానంపై అన్ని రాజకీయ పక్షాలు ఉప ఎన్నిక రణరంగానికి రెడీ అవుతున్నాయి. వ్యూహాలకు పదును పెడుతున్నాయి.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు ముందు జరగనున్న ఉప ఎన్నిక

అయితే గత ఎన్నికల్లో జరిగిన తప్పిదాలను దృష్టిలో పెట్టుకొని…ఈ ఉప ఎన్నికల్లో కమలం పార్టీ పక్కా స్కెచ్ వేస్తుందనే సంకేతాలు అందుతున్నాయి. కాంగ్రెస్ ప్రజా పాలన వచ్చిన తర్వాత వస్తున్న రెండో అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక ఇది. ఈ ఎన్నిక ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు కీలకం కానుంది. ఈ ఎన్నికలో గెలుపు రాబోయే ఎన్నికలకు దిక్సూచిగా నిలుస్తుందనే అంచనాల్లో అన్ని పార్టీలు ఉన్నాయి. అంతేకాదు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు ముందు జరిగే ఈ ఉప ఎన్నిక దిశ దశలను మార్చే ఎన్నికగా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకమే ననే అభిప్రాయాలు పొలిటికల్ సర్కిల్లో వ్యక్తమవుతున్నాయి.

ఎమ్మెల్సీ స్థానాల విజయంతో జోష్ మీదున్న బీజేపీ

ఈ సారి జూబ్లీహిల్స్ స్థానంపై పట్టుబిగించాలని బీజేపీ ప్లాన్ చేస్తుంది. ఇటీవల రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధించి మంచి జోష్ మీదున్న బీజేపీ అదే జోష్ లో జూబ్లిహిల్స్ పై కాషాయ జెండా ఎగరవేయాలని చూస్తోంది. అందులో భాగంగానే కాషాయ నేతలు జూబ్లిహిల్స్ స్థానంపై గ్రౌండ్ ప్రిపేర్ చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో జూబ్లిహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. సికింద్రాబాద్ ఎంపీగా కొనసాగుతున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఈ ఉప ఎన్నిక సవాల్ గా మారనుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ కాషాయ పార్టీ మూడో స్థానానికి పరిమితమైంది. అయితే ఈ ఉప ఎన్నికల్లో కూడా గతంలో పోటీ చేసిన వారికే టికెట్ ఇస్తారా…..లేదా మరొకరికి అవకాశం ఇస్తారా అన్నది కమలంలో ఆసక్తికరంగా మారింది.

25 వేల ఓట్లు మాత్రమే దక్కించుకున్న దీపక్‌రెడ్డి

ఉపఎన్నిక షెడ్యూల్‌ హడావుడి కంటే పార్టీలో టికెట్ ఎవరికి అనేదానిపై చర్చ మొదలైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి లంకాల దీపక్ రెడ్డికి పార్టీ అవకాశం ఇచ్చింది.లంకాల దీపక్ రెడ్డికి కేవలం 25 వేల ఓట్లే పోలయ్యాయి. అధిష్టాన పెద్దలు దీపక్ రెడ్డి వైపుకు పెద్దగా మొగ్గు చూపకపోయినప్పటికీ, కేవలం కిషన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరుండటం వల్లే దీపక్ రెడ్డికి గత ఎన్నికల్లో అవకాశం వచ్చిందనే టాక్ ఉంది. అయితే గత ఎన్నికల్లో పరాజయం పాలైన దీపక్ రెడ్డిపై సానుభూతి కలిసొస్తుందని కిషన్ రెడ్డి భావిస్తున్నారంట. కిషన్ రెడ్డి ఆశీస్సులతో మళ్ళీ దీపక్ రెడ్డికి టికెట్ దక్కే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది.

మహిళల ప్రాతినిధ్యం తగ్గిందని విమర్శలు

అయితే బీఆర్ఎస్ నుంచి దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ భార్యను బరిలోకి దింపేందుకు ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం ఉంది. దీంతో ఈ సారి ఉప ఎన్నికల్లో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలనే చర్చ బీజేపీ నేతల్లో జరుగుతుందట. అంతేకాదు మహిళకు ఈసారి అవకాశం ఇస్తే బీజేపీలో మహిళా ప్రాతినిథ్యం తగ్గిందనే విమర్శలు సైతం చెక్‌ పెట్టోచ్చని పార్టీ పెద్దలు భావిస్తున్నారంట. ప్రస్తుతం పార్టీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిపి 21 మంది ఉన్నారు. వారిలో ఎంపీ డీకే అరుణను మినహాయిస్తే చట్ట సభల్లో మహిళా ప్రాతినిథ్యమే కనిపించదు. అందులో భాగంగానే ఉప ఎన్నికల్లో మహిళలకు అవకాశం ఇవ్వాలనే యోచనలో నాయకత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. మహిళా శక్తితోనే జూబ్లీహిల్స్‌లో విజయం సాధించి కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీనే అని చాటుకోవడానికి బీజేపీ పెద్దలు తాపత్రయపడుతున్నారంట.

మహిళ అభ్యర్తినిగా ఫోకస్ అవుతున్న జూటూరి కీర్తిరెడ్డి

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీజెపీ అధిష్టాన పెద్దల ఆశీస్సులు ఎవరికి దక్కుతాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మహిళ ప్రాతినిథ్యం కోణంలో పార్టీ ఆలోచిస్తే గనక ఈ స్థానం నుంచి జూటూరి కీర్తి రెడ్డి, ముందు వరసలో ఉన్నారనే చర్చ పార్టీలో ఉంది. అయితే బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి పేరు కూడా ప్రధానంగా తెర మీదకు వస్తుంది. గత ఎన్నికల్లో కూడా జూటూరీ కీర్తి రెడ్డి టికెట్ కోసం చాలానే ప్రయత్నాలు చేశారు. ఆ క్రమంలో ప్రాధాన్యత ఎవరికి దక్కుతుందనే సస్పెన్స్ కొనసాగుతుంది. అయితే గత ఎన్నికల్లో ఫలితాలను విశ్లేషించుకుని ఈ సారి అందుకు భిన్నంగా మహిళా నేతను రంగంలోకి దింపేందుకు సిద్ధం అయినట్టుగా తెలుస్తోంది.

Also Read: హాట్ టాపిక్‌గా మారిన పవన్‌కళ్యాణ్ న్యూ లుక్

ఆది అటుంచితే జూబ్లీహిల్స్ టికెట్ కేటాయించాలని గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం పార్టీ అధిష్టానాన్ని చాలామంది ఆశావాహులు వేడుకున్నారు. ఈ సారి ఛాన్స్ దక్కించుకోవడానికి ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ మొదలుపెట్టినట్లు ప్రచారం సాగుతోంది. మరి చూడాలి పార్టీ అధిష్టానం ఎవరికి అవకాశం ఇస్తుందో?

Story By Apparao, Bigtv

Related News

Drinking Water Project: ఒక్క ప్రాజెక్ట్‌తో హైదరాబాద్‌కు తాగునీటికి నో ఢోకా.. ఎలా అంటే..!

AP Liquor Scam: వైసీపీలో గుబులు.. లిక్కర్ స్కాంలో నెక్స్ట్ అరెస్ట్ ఎవరు?

kavitha Political Future: రాజీనామా తర్వాత కవిత సైలెంట్..! జాతీయ పార్టీలో చేరతారా?

Tadipatri Politics: జేసీ యాక్షన్ ప్లాన్..! పెద్దారెడ్డికి మళ్లీ షాక్..

GST 2.0: ప్రజల డబ్బు బయటకు తెచ్చేందుకు.. జీఎస్టీ 2.0తో మోదీ భారీ ప్లాన్

Meeting Fight: ఎమ్మెల్యే Vs కమిషనర్.. హీటెక్కిన గుంటూరు కార్పొరేషన్ కౌన్సిల్

×