BigTV English

OTT Movie : పెళ్ళైన అమ్మాయిలే టార్గెట్… పోలీసులకు చెప్పి మరీ చంపే సైకో కిల్లర్… ఎందుకో తెలిస్తే మైండ్ బ్లాక్

OTT Movie : పెళ్ళైన అమ్మాయిలే టార్గెట్… పోలీసులకు చెప్పి మరీ చంపే సైకో కిల్లర్… ఎందుకో తెలిస్తే మైండ్ బ్లాక్

OTT Movie : సైకో కిల్లర్ సినిమాలు పెట్టే టెన్షన్ అంతా ఇంతా కాదు. ఈ సినిమాలలో చివరి వరకూ ట్విస్టులు వస్తూనే ఉంటాయి. చివర్లో నే కిల్లర్ ఎవరో రివీల్ చేస్తారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో, ఒక కిల్లర్ పెళ్ళయిన మహిళలను టార్గెట్ చేస్తుంటాడు. ఈ కిల్లర్ చుట్టూ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


నెట్ ఫ్లిక్స్ (Netflix) లో  

ఈ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది స్నోమాన్’ (The Snowman).  2017 లో విడుదలైన ఈ సినిమాకి టోమస్ ఆల్ఫ్రెడ్‌సన్ దర్శకత్వం వహించారు. ఇందులో మైఖేల్ ఫాస్‌బెండర్ (హ్యారీ హోల్), రెబెక్కా ఫెర్గూసన్ (కాట్రిన్ బ్రాట్), షార్లెట్ గెయిన్స్‌బర్గ్ (రాకెల్), వాల్ కిల్మర్ (గెర్ట్ రాఫ్టో), జె.కె. సిమ్మన్స్ (ఆర్వే స్టోప్) ప్రధాన పాత్రలలో నటించారు. ఈ స్టోరీ నార్వేలోని ఒస్లోలో జరిగే సీరియల్ కిల్లర్ కేసు ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరుగుతుంది. ఇక్కడ కిల్లర్ తన బాధితుల వద్ద స్నోమ్యాన్‌ను, తన కాలింగ్ కార్డ్‌గా వదిలివేస్తాడు. ఈ సినిమా 2017 ఆక్టోబర్ 7 న హైఫా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయింది. 2017 ఆక్టోబర్ 20న యూఎస్‌లో థియేట్రికల్‌గా విడుదలైంది. Netflix, Amazon Prime Video, Apple TV లలో ఈ సినిమా అందుబాటులో ఉంది.


స్టోరీలోక వెళితే 

హ్యారీ హోల్ ఒక బ్రిలియంట్ ఇన్స్పెక్టర్. మద్యపానం సమస్యలతో బాధపడుతుంటాడు. తన మాజీ ప్రేయసి రాకెల్ తో విడిపోవడం వల్ల, డిప్రెషన్‌తో పోరాడుతుంటాడు. అతను బెర్గెన్ నుండి వచ్చిన కొత్త రిక్రూట్ కాట్రిన్ బ్రాట్ తో కలసి, బిర్టే బెక్కర్ అనే మహిళ అదృశ్యం కేసును విచారిస్తాడు . కనిపించకుండా పోయిన మహిళ ఇంటి వద్ద స్నోమ్యాన్ (మంచు బొమ్మ) చుట్టూ ఆమె స్కార్ఫ్ చుట్టి ఉంటుంది.  హ్యారీ ఒక స్నోమ్యాన్ డ్రాయింగ్‌తో సంతకం చేయబడిన ఒక మిస్టీరియస్ లెటర్‌ను కూడా కనిపెడతాడు. అయితే కాట్రిన్ ఈ కేసు ఒక సీరియల్ కిల్లర్‌తో సంబంధం కలిగి ఉందని నమ్ముతుంది. ఎందుకంటే బాధితులు అందరూ వివాహిత మహిళలు. వీళ్ళంతా వైవాహిక జీవితంలో అసంతృప్తి తో ఉంటారు. ప్రతి క్రైమ్ సీన్ వద్ద స్నోమ్యాన్ బొమ్మ కనిపిస్తుంది. వీళ్ళిద్దరూ సిల్వియా ఒట్టర్‌సన్ అనే మరొక మహిళ అదృశ్యం కేసును విచారిస్తారు. ఆమె కూడా ఇదే తరహాలో చనిపోయి ఉంటుంది.

ఒస్లో నగరంలో వింటర్ గేమ్స్ బిడ్‌ను నడిపిస్తున్న బిజినెస్‌మాన్ ఆర్వే స్టోప్ పై కాట్రిన్ అనుమానం వ్యక్తం చేస్తుంది. ఆమె అతన్ని వెంబడిస్తుంది. కానీ ఇంతలో ఒక మాస్క్డ్ ధరించిన వ్యక్తి ఆమెపై దాడి చేసి, ఆమె వేలును కత్తిరించి, ఆమె టాబ్లెట్‌లోని డేటాను తొలగిస్తాడు. తర్వాత హ్యారీ తన కారు వద్ద స్నోమ్యాన్ ఆకారాన్ని చూస్తాడు . అంతే కాకుండా కాట్రిన్‌ను లోపల చనిపోయి ఉన్నట్లు గుర్తిస్తాడు. హ్యారీ ఇది చూసి ఒక్కసారిగా షాక్ లోకి వెళతాడు. ఇక తేరుకుని ఆ కిల్లర్ అంతు చూడాలనుకుంటాడు. చివరికి కిల్లర్ పెళ్ళయిన మహిళలని ఎందుకు చంపుతున్నాడు ? అతన్ని హ్యారీ పట్టుకుంటాడా ? కాట్రిన్ ను చంపింది ఎవరు ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : బొగ్గు గనిలో మనుషుల ప్రాణాలు తీసే వింత రాక్షసి… ఫ్రెంచ్ హారర్ అడ్వెంచర్ ఫాంటసీ థ్రిల్లర్

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×