Kannappa 2: ఇటీవల కాలంలో ఒక సినిమా ఏదైనా మంచి సక్సెస్ అయితే తప్పనిసరిగా ఆ సినిమాకు సీక్వెల్ లేదా ఫ్రీక్వెల్ రావడం అనేది సర్వసాధారణం అయింది. ఇప్పటికే ఎన్నో సినిమాలు ఎంతో మంచి సక్సెస్ అందుకొని సీక్వెల్స్ సినిమాల షూటింగ్ పనులలో స్టార్ హీరోలందరూ బిజీగా ఉన్నారు. ఇకపోతే మంచు విష్ణు(Manchu Vishnu) తాజాగా నటించిన కన్నప్ప సినిమా(Kannappa Movie) నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంటుంది. ఈ సినిమాకు అన్నిచోట్ల పాజిటివ్ టాక్ రావడంతో విష్ణు సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు . ఇక ఈ సినిమా మంచి టాప్ సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమాకి కూడా సీక్వెల్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అంతా శివలీల..
ఇకపోతే ఈ సినిమా విడుదలకు ముందు చిత్ర బృందం ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా విష్ణుకి ఇదే ప్రశ్న ఎదురయింది. ప్రస్తుతానికైతే తనకు సీక్వెల్ గురించి ఎలాంటి ఆలోచన లేదని తెలిపారు. కానీ కన్నప్ప సినిమా విడుదలైన తర్వాత వచ్చే రిజల్ట్ ఆధారంగా సీక్వెల్ చేయాలా? లేదా అనే విషయాల గురించి నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు. ఇక ఇదే కథతో సీక్వెల్ సాధ్యమయ్యే పని కాదని స్పష్టం చేశారు. కానీ సూపర్ హీరోగా సీక్వెల్ కు ప్లాన్ చేసే అవకాశం ఉంటుందని విష్ణు తెలిపారు. అది కూడా శివుడి ఆశీర్వాదంతో జరగాలని చెప్పారు. దీంతో సీక్వెల్ పై విష్ణు పెద్ద సస్పెన్స్ క్రియేట్ చేశారు. ఇక ఈ విషయంపై పలువురు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు.
సూపర్ హీరో వెర్షన్..
ఒకవేళ విష్ణు సీక్వెల్ చేయాలి అనుకుంటే ఏదైనా కల్పిత కథ ఆధారంగా సినిమా చేయాలి తప్ప కన్నప్ప కథతో సాధ్యం కాదంటూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. కన్నప్ప సినిమాలో నాస్తికుడు అయినటువంటి తిన్నడు శివ భక్తుడిగా ఎలా మారాడు అనే విషయాలను చూపించారు.చివరిగా తిన్నడు శివుడిలో ఐక్యం అయిపోతాడు. దాంతో తిన్నడి జీవిత కథ ముగుస్తుంది. దీంతో తిన్నడిగా మంచు విష్ణు కన్నప్ప 2 చేయడం సాధ్యం కాదనే చెప్పాలి. ఇక మంచు విష్ణు అన్నట్టుగా సూపర్ హీరో వెర్షన్ లో సినిమా తీయాలంటే కన్నప్ప బాక్సీఫీస్ వసూళ్లపై ఆధారపడి ఉందని పలువురు వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
సీక్వెల్ చేయటం సాధ్యమేనా…
మరి విష్ణు సీక్వెల్ సినిమా చేయాలన్న ఉద్దేశంతో సూపర్ హీరో వెర్షన్ లో చేసే సినిమాకు ఏ స్థాయిలో ఆదరణ ఉంటుందో తెలియదు. కన్నప్ప సినిమా కోసమే దాదాపు పది సంవత్సరాలు పాటు పని చేస్తున్న విష్ణు సీక్వెల్ సినిమా చేయాలని ఆలోచనలో బహుశా ఉండకపోవచ్చునే తెలుస్తుంది. ప్రస్తుతం కన్నప్ప సినిమాకు మాత్రం ఇండియాలో మాత్రమే కాకుండా ఓవర్సీస్ లో కూడా మంచి ఆదరణ వస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమాని స్వయంగా మోహన్ బాబు తన నిర్మాణ సంస్థలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇండియాలో మాత్రం ప్రభాస్ కారణంగా ఈ సినిమాకు మంచి హైప్ వచ్చిందనే చెప్పాలి.
Also Read: Squid Game 3: స్క్విడ్ గేమ్ 3లో దాగుడు మూతలట.. 3 నిమిషాల సీన్ రిలీజ్, ఈ సారి కొత్త ట్విస్ట్!