Squid Game 3:ఇటీవల కాలంలో ఎన్నో సరికొత్త కథ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తూ అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇతర భాష సినిమాలు వెబ్ సిరీస్ లను చూసే అవకాశం కూడా లభించిందని చెప్పాలి. ఇలా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి సిరీస్ లలో స్క్విడ్ గేమ్(Squid Game ) సిరీస్ ఒకటి. ఇలా ఈ సిరీస్ పేరు చెప్పగానే ప్రేక్షకులదరూ కూడా తమ సీట్లకే పరిమితం అవుతూ కల్లార్పకుండా ఈ సిరీస్ చూస్తారు. ఇప్పటికే రెండు సీజన్లను ఎంతో విషయవంతంగా పూర్తి చేసుకున్న ఈ సిరీస్ మూడవ సీజన్ కూడా ప్రసారమవుతుంది.
అప్పుల పాలయ్యి..
నేడు స్క్విడ్ గేమ్3(Squid Game 3) సిరీస్ నెట్ ఫ్లిక్స్(Net Flix) లో ప్రసారమవుతుంది అయితే తాజాగా నెట్ ఫ్లిక్స్ తన అధికారిక యూట్యూబ్ ఛానల్ ద్వారా మూడు నిమిషాల ఒక వీడియోని విడుదల చేశారు. ఇలా ఈ మూడు నిమిషాల వీడియో సిరీస్ పై ఎంతో ఆసక్తిని పెంచేస్తోంది. హ్యాంగ్ డాంగ్ హ్యూక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ మొదటి రెండు భాగాలు మంచి ఆదరణ సొంతం చేసుకున్నాయి. అప్పుల పాలయ్యి జీవితంలో నిస్సహాయ స్థితిలో ఉన్న 456 మందిని ఒక రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ చిన్నపిల్లలు ఆడే ఆటల రూపంలో పోటీలు నిర్వహిస్తారు. ఈ ఆటలు మొదట కనిపించడానికి సాధారణంగానే అనిపించినా, ఓడిపోతే వారిని హతమార్చేస్తారు.
దాగుడుమూతల ఆట..
ఇలా ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగే ఈ సిరీస్ 3 సీజన్ ప్రసారమవుతుంది. తాజాగా విడుదల చేసిన ఈ వీడియోలో భాగంగా కొంతమందిని బంధించి వారిని రెండు భాగాలుగా విడదీసి ఒకరిని రెడ్ టీం, మరొకరిని బ్లూ టీం గా విభజిస్తారు. అయితే వీరందరికీ ఒక చిన్న బాక్స్ ఇస్తారు. ఆ బాక్స్ లో తాళం చెవి ఉంటుంది. అయితే టీం బ్లూ లో ఉన్నవాళ్లు అక్కడి నుంచి 30 నిమిషాలలో తప్పించుకునే ప్రయత్నం చేయాలని చెబుతారు. అలాగే రెడ్ టీం కూడా తప్పించుకోవాలని చెబుతారు. ఈ విధంగా దాక్కున్న తర్వాత టీం రెడ్, టీం బ్లూ వారిని గుర్తించి 30 నిమిషాలలో చంపేయాలని లేకపోతే ఈ ఆట నుంచి ఎలిమినేట్ అవుతారంటూ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు.
ఇలా దాగుడుమూతల ఆట పేరుతో చంపుకోమని చెప్పడంతో అక్కడున్న వారందరూ షాక్ అవుతారు. చివరికి వారంతా కూడా ఈ హైడ్ అండ్ సీక్ ఆట ఆడారా? అక్కడి నుంచి ఎలా బయటపడ్డారు అనే విషయాలు కాస్త ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఈ మూడవ సీజన్లో, ఆటల వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు, మరియు అతను కావాలనే ఎందుకు ఓడిపోయాడనే విషయాలు ఎంతో ఆసక్తికరంగా మారుతాయి. ప్రస్తుతం ఈ సీజన్ జూన్ 27వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కాబోతోంది. మూడవ సీజన్ లో లీ జంగ్-జే మళ్ళీ గి-హున్, లీ బైయుంగ్-హున్ ఈసారి కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అలాగే, కొత్త పాత్రలలో కాంగ్ హా-న్యూల్ , పార్క్ గ్యు-యంగ్ (నో-యుల్), యాంగ్ డాంగ్-గ్యూన్ (యోంగ్-సిక్) జో యూరి (జున్-హీ) వంటి వారు ఈ సిరీస్ లో భాగమయ్యారని తెలుస్తుంది.
Also Read: