BigTV English

Mass Jathara: జానీ మాస్టర్ రీ ఎంట్రీ సాంగ్.. ఓలే ఓలే.. అదిరిపోయిందిలే

Mass Jathara: జానీ మాస్టర్ రీ ఎంట్రీ సాంగ్.. ఓలే ఓలే.. అదిరిపోయిందిలే

Mass Jathara: మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. రవితేజ.. విజయాపజయాలు  అనేవాటిని అస్సలు పట్టించుకోడు. కమర్షియల్ హీరోల్లో మాస్ మహారాజా మొదట ఉంటాడు. తాంవరకు కథ ఎలా ఉన్నా అనవసరం.. డబ్బులు వచ్చాయా లేదా అనేది మాత్రమే చూస్తాడని టాలీవుడ్ లో టాక్. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. గతేడాది మిస్టర్ బచ్చన్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రవితేజ. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ పరాజయాన్ని అందుకుంది.


 

హిందీలో భారీ విజయాన్ని అందుకున్న రైడ్ సినిమాకు రీమేక్ గా మిస్టర్ బచ్చన్ ను తెరకెక్కించాడు. కానీ, ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. అయినా కూడా రవితేజ  నిరాశ చెందలేదు. ఆ తర్వాత వరుస సినిమాలను లైన్లో పెట్టి రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. అలా రవితేజ నటిస్తున్న తాజా చిత్రాల్లో మాస్ జాతర ఒకటి. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో రవితేజ సరసన శ్రీలీల నటిస్తుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన ధమాకా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే.


 

ఇక ఇప్పుడు ఈ జంట మరోసారి రొమాన్స్ చేయబోతున్నారు అనేసరికి సినిమాపై అంచనాలు ఆకాశానికి తాకాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆగస్టు 27 న మాస్ జాతర రిలీజ్ కు సిద్దమవుతుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న వేళ ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్ వరుస లిరికల్ వీడియోలను రిలీజ్ చేస్తూ మ్యూజిక్ తో మంచి పాజిటివ్ వైబ్ ను క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే మాస్ జాతర నుంచి రిలీజ్ అయిన తూ మేరీ లవర్ సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచిన విషయం తెల్సిందే. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి రెండో సాంగ్ ఓలే.. ఓలే.. ఓలే అంటూ సాగే సాంగ్ రిలీజ్ కు  ముహూర్తం ఖరారు చేశారు. తాజాగా ఈ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ప్రోమో ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

 

ఎనర్జీ అనే పేరుకు బ్రాండ్ అంబాసిడర్లు రవితేజ, శ్రీలీల. వీరిద్దరి మాస్ డ్యాన్స్ ఎలా ఉంటుందో ధమాకాలో చూసాం. ఇక ఇప్పుడు మరోసారి వీరిద్దరి మాస్ జాతర ఈ సాంగ్ లో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మాస్ సాంగ్ కు కొరియోగ్రఫీ చేసింది ఎవరో కాదు జానీ మాస్టర్. శ్రేష్టి వర్మ కేసులోజానీ మాస్టర్ జైలుపాలు అయిన విషయం తెల్సిందే. తనను పెళ్లి చేసుకోమని వేధిస్తున్నాడని డ్యాన్సర్ శ్రేష్టి వర్మ.. జానీ మాస్టర్ పై కేసు పెట్టడం, జానీని పోలీసులు అరెస్ట్ చేయడం అందరికీ తెల్సిందే. ప్రస్తుతం బెయిల్ పై బయటకు వచ్చిన జానీ.. మొదటిసారి తెలుగులో చేస్తున్న ప్రాజెక్ట్ మాస్ జాతర. ఈ సాంగ్ షూటింగ్ సమయంలోనే జానీ ఎమోషనల్ అవుతూ శ్రీలీలకు, రవితేజకు థాంక్స్ కూడా చెప్పాడు. ఇప్పుడు ఆ సాంగ్ నే రిలీజ్ కానుంది. ప్రోమోలో జానీ హుక్ స్టెప్ తోనే పిచ్చెక్కించాడు. ఆగస్టు 5 సాయంత్రం 4 గంటలకు ఓలే ఓలే ఫుల్ సాంగ్ రిలీజ్ కానుందని మేకర్స్ తెలిపారు. మరి ఈ సాంగ్ రేపు ఎలాంటి జాతర చేస్తుందో చూడాలి.

Related News

Pushpa Song AGT -2025 : అది పుష్ప సాంగ్ కాదు… అల్లు అర్జున్ పరువు తీశారు కదయ్యా

Megastar Chiranjeevi : ఎమ్మెల్యేగా చిరు పోటీ… స్వీట్ వార్నింగ్ ఇచ్చిన మెగాస్టార్

Madhupriya: సింగర్ మధుప్రియ ఇంట పెళ్లి సందడి.. హల్దీ వేడుకల్లో జోరు!

India’s Biggest Director: ఓటమెరుగని దర్శకులు.. జీరో ఫ్లాప్ తో సంచలనం సృష్టిస్తున్న డైరెక్టర్స్ వీళ్లే!

Telugu Sequel Movies : ఈ రెండు పార్ట్స్‌ గోలేంటి రాజా… మన దరిద్రం కాకపోతే ?

Balakrishna: మళ్లీ డ్యూయల్ రోల్ లో బాలయ్య.. రెండు కాలాలు.. రెండు కోణాలు.. వర్కౌట్ అయ్యేనా?

Big Stories

×