Telugu CGI:ఇప్పుడంటే తెలుగు సినిమా ప్రపంచ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్‌తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తుంది .బాహుబలి , ‘ఆర్ఆర్ఆర్’, ‘కల్కి 2898 AD’ వంటి సినిమాలు హాలీవుడ్ విజువల్స్ తో ఇంటర్నేషనల్ వైడ్ గా ఆడియన్స్ ని తన వైపు తిప్పుకుంటున్నాయి .అయితే తెలుగు సినిమాల్లో మొదటిసారి కంప్యూటర్ గ్రాఫిక్స్ ఎప్పుడో ఉపయోగించారు అన్న విషయం మీకు తెలుసా? తెలుగు సినిమాల్లో CGI అన్న పేరు విన్న వెంటనే చాలామందికి గుర్తొచ్చే సినిమా అమ్మోరు.
1995లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పటి ఆడియన్స్ కి ఒక మంచి అనుభూతిని అందించింది.దేవతా శక్తులు ,అద్భుత దృశ్యాలని కంప్యూటర్ గ్రాఫిక్స్ తో చూపించడం అప్పట్లో ఒక సెన్సేషన్.ఇక సినిమా చూసిన ఆడియన్స్ తెరపై కనిపించిన విజువల్స్ ను చూసి ఆశ్చర్యపోయారు .ముఖ్యంగా అమ్మవారి రూపం ,అద్భుత శక్తుల ప్రదర్శన దుష్టశక్తులతో పోరాట చేసే సీన్స్ అన్ని తెలుగు ఆడియన్స్ కి కొత్త అనుభూతిని తీసుకొచ్చాయి.
1990లో విడుదలైన వెంకటేష్ నటించిన బొబ్బిలి రాజా
అయితే తెలుగు సినిమాల్లో కంప్యూటర్ గ్రాఫిక్స్ ప్రయోగం అమ్మోరుతోనే మొదలైంది కాదు 1990లో విడుదలైన వెంకటేష్ నటించిన బొబ్బిలి రాజా సినిమాలోని ఒక పాటలో కంప్యూటర్ గ్రాఫిక్స్ ను వాడి నట్లు తెలుస్తుంది . అయితే అది పూర్తిస్థాయి CGI కాకపోయినా తెలుగు సినిమా టెక్నాలజీకి అదొక ఆరంభం అని చెప్పాలి. అయితే సినిమా మొత్తంగా కథాపరంగా కంప్యూటర్ గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్‌ను వినియోగించిన తొలి చిత్రం మాత్రం ‘అమ్మోరు’గానే నిలిచింది.ఆ కాలంలో కంప్యూటర్లు, డిజిటల్ ఎఫెక్ట్స్ అందుబాటులో తక్కువగా ఉన్నప్పటికీ, దర్శకుడు కోడి రామకృష్ణ సాంకేతికతపై చూపిన ఆసక్తి ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలబెట్టింది. బ్లూ మ్యాట్ టెక్నాలజీ, డిజిటల్ కంపోజిటింగ్ వంటి పద్ధతులను ఉపయోగించి అప్పటి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.ఇక అమ్మోరు సక్సెస్ తో తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక్కసారిగా విజువల్ ఎఫెక్ట్స్ పై మేకర్స్ అందరికీ కాన్ఫిడెన్స్ వచ్చేసింది .
అంజి సినిమా పూర్తిస్థాయి విజయ్ గ్రాఫికల్ ఫిలిమ్
also read:సిగరెట్‌తో కాల్చాడు.. చెంప పగిలేలా కొట్టాడు’.. మాజీ ప్రియుడిపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!
ఆ సినిమా తర్వాతే అంజి సినిమా పూర్తిస్థాయి విజయ్ గ్రాఫికల్ ఫిలిమ్ గా నిలిచింది.చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమా నిర్మాణం దాదాపు ఆరేళ్లపాటు సాగిన తెలుగు తెరపై ఎప్పుడు చూడనటువంటి గ్రాఫిక్స్ ని చూపించింది . ఆ తర్వాత అరుంధతి, మగధీర వంటి సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ ఏ రకంగా ఆడియన్స్ కి అలరించాయో చెప్పక్కర్లేదు.అయితే క్రమక్రమంగా తెలుగు సినిమా విజువల్ ఎఫెక్ట్స్ లో మరింత దూసుకుపోయింది.బాహుబలితో ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్న జక్కన్న RRR తో అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమాని మరో మెట్టెక్కించాడు.ఇక తాజాగా వచ్చిన కల్కి 2898 సినిమా హాలీవుడ్ కి ఏ మాత్రం తీసిపోని విధంగా విజువల్ ఫీస్ట్ ని అందించింది.అయితే ఈ విజువల్ ఎఫెక్ట్స్ జర్నీకి బీజం వేసింది మాత్రం బొబ్బిలి రాజా అనే చెప్పాలిపూర్తిస్థాయిCGI ని వాడిన సినిమాగా అమ్మోరు పేరు వినిపిస్తుంది.
ఏదేమైనా వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో తిరిగెక్కుతున్న విజువల్ వండర్స్ వెనుక మూడు దశాబ్దాల క్రితం తెలుగు సినిమాలో జరిగిన ఆ చిన్న చిన్న సాంకేతిక ప్రయోగాలే అసలైన పునాది అని చెప్పడంలో ఇలాంటి సందేహం లేదు.