E-Paper
Advertisement

అఖిల్ ‘లెనిన్’ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్.. థియేటర్లలో కలెక్షన్లు తగ్గితే అప్పుడే, లేదంటే..?

అఖిల్ ‘లెనిన్’ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్.. థియేటర్లలో కలెక్షన్లు తగ్గితే అప్పుడే, లేదంటే..?
Advertisement

Lenin OTT:వాలకం చూస్తుంటే అఖిల్ లెనిన్ తో గట్టి సౌండే చేసినట్టు కనిపిస్తుంది.ఇదైనా హిట్టు కాకుండా పోతుందా అంటూ చేసిన ప్రతీ సినిమా పోవడం, మళ్ళీ మరో సినిమా కోసం ఎదురు చూడటం ఈ అయ్యగారికి కామన్ అయిపొయింది.అయితే ఈ సారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ ట్రాక్ ఎక్కి తీరాల్సిందే అంటూ పట్టాలెక్కించిన లెనిన్ సినిమా మొదటి రోజు డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ క్రమక్రమంగా వసూళ్లు పెరుగుతున్నాయనే టాక్ వినిపిస్తుంది.

దాదాపు రూ. 40 కోట్ల బడ్జెట్‌

Advertisement

ఇక ఇదిలా ఉండగా సినిమా థియేటర్ లో పడకముందే సాలిడ్ గా టేబుల్ ప్రాఫిట్ ని కొట్టేశారట లెనిన్ మేకర్స్.అవును…దాదాపు రూ. 40 కోట్ల బడ్జెట్‌ కుమ్మరించిన అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్మెంట్స్ కి డబ్బింగ్, శాటిలైట్, ఆడియో, ఓటీటీ రైట్స్ రూపంలో విడుదలకు ముందే నిర్మాతలు సుమారు రూ. 34 కోట్లు వచ్చేసిందని ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్.

also read:బాలీవుడ్ నటుడి లవ్ అఫైర్స్ రచ్చ.. ఒకరితో ఎంగేజ్మెంట్.. మరొకరితో డేటింగా?

Advertisement

ఇక ఇదిలా ఉంటె ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని ఊహించని గట్టి పోటీల నడుమ ‘జీ నెట్‌వర్క్’ భారీ ఆఫర్‌తో దక్కించుకుందని సమాచారం.పై పెచ్చు శాటిలైట్ రైట్స్ కూడా జీ వాళ్ళే కొనేశారు కాబట్టి, థియేటర్లలో రన్ ముగిసాక ఈ సినిమా జీ5 (ZEE5) లో ప్రత్యక్షం కానుందన్న మాట.

అంతా అనుకున్నట్టు జరిగితే ఆగస్టు రెండో వారంలో

అయితే సినిమా ఈ ఓటీటీలోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందా అనే దానిపై అప్పుడే హాట్ హట్ డిస్కషన్ కి తెర తీశారు మూవీ లవర్స్.మాములుగా అయితే రూల్స్ ప్రకారం 4 నుంచి 8 వారాల గ్యాప్ ఉండాలి కాబట్టి, అంతా అనుకున్నట్టు జరిగితే ఆగస్టు రెండో వారంలో (ఆగస్టు 14 ) బుల్లి తెరపైకి ఎంట్రీ ఇవ్వాలి. ఒకవేళ థియేటర్లలో జనాలు విపరీతంగా క్యూ కట్టి, కలెక్షన్లు ఇంకా కురిపిస్తే మాత్రం ఓటీటీ రిలీజ్ కాస్త ఆలస్యమై ఆగస్టు చివరకు లేదా సెప్టెంబర్ మొదటి వారానికి పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఏదేమైనా, డిజిటల్ రిలీజ్ సమయానికి తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం అని తేడా లేకుండా ఐదు భాషల్లో ‘లెనిన్’ అందుబాటులోకి రానుందట.ఇక సినిమా విషయానికి వస్తే మురళి కృష్ణ అబూరు దర్శకత్వంలో  భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా మొదటి రోజే రూ.7.26 కోట్ల షేర్ వసూలు చేసినట్లు సమాచారం.

also read:మళ్ళీ వెనక్కి వెళ్ళిన జననాయగన్ …వచ్చేది ఎప్పుడంటే ?

చూడాలి OTT లోకి త్వరగా ఎంట్రీ ఇస్తాడా లేక సాలిడ్ వసూళ్లతో దర్జాగా అడుగుపెడతాడా?

Related News

‘జైలర్ 2’ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

గ్లామర్ డోస్ పెంచేసిన దురంధర్ బ్యూటీ.. ఫ్యాన్స్‌కు కనువిందే!

బతుకమ్మ వేడుకల్లో లయ అందాల సందడి.. వీడియో వైరల్!

RC 17 షూటింగ్ పై సుకుమార్ బిగ్ అప్డేట్… ప్రయాణం ప్రారంభం!

బ్లూ శారీలో అదరగొట్టిన ప్రీతి ముఖుందన్.. అందం మామూలుగా లేదుగా!

మళ్లీ లాయర్‌గా కీర్తి సురేష్.. ఈసారి అయినా హిట్ కొడుతుందా?

చిరుత హీరోయిన్ అందాల విందు.. ఇన్‌స్టాలో హాట్ టాపిక్!

హైందవ టీజర్ రిలీజ్…విగ్రహాల చోరీ వెనుక రహస్యం ఏంటీ!

Big Stories

Advertisement
×