E-Paper
Advertisement

హ‌రీశ్ మాట‌లు.. ఈట‌ల నోటి వెంట‌! పాత దోస్తు కోసం మ‌ర్యాద‌ను పోగొట్టుకున్నావ్‌..! ప్చ్‌..

హ‌రీశ్ మాట‌లు.. ఈట‌ల నోటి వెంట‌! పాత దోస్తు కోసం మ‌ర్యాద‌ను పోగొట్టుకున్నావ్‌..! ప్చ్‌..
Advertisement

ఈటల రాజేంద‌ర్ ఇజ్జ‌త్ తీసుకున్నాడా? అప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న‌కు కాంగ్రెస్ కూడా మ‌ర్యాద ఇచ్చిందా? ఒక్క కాళేశ్వ‌రం గురించి, ఓ రెండు మంచి మాట‌లు చెప్ప‌డ‌మే ఆయ‌న ప‌రువు పోవ‌డానికి కార‌ణ‌మైందా? అచ్చంగా ఇదే విశ్లేష‌ణ చేస్తోంది కాంగ్రెస్ స‌ర్కార్‌.

మ‌ధ్య‌లో నీకెందుక‌యా.. ఈ విష‌యం. మేమూ మేమూ చూసుకుంటున్నాం. ఇప్పుడు నువ్వు బీజేపీ లీడ‌ర్‌. కాళేశ్వ‌రం గురించి మాట్లాడితే నీ పార్టీకి వ‌చ్చే మైలేజీ ఏమైనా ఉందా? న‌యా పైసా లేదు. అది బీఆరెస్‌కే మైలేజీ తెచ్చిపెడుతుంది. మ‌రి స‌త్య‌హ‌రశ్చంద్రుడి లెక్క నువ్వెందుకు మ‌ధ్య‌లో వ‌చ్చి మాట్లాడుతావ్‌..? నీది నీకే స‌క్క‌గా లేదు. నీ పార్టీలో నిన్నే దేకుత‌లేరు. మ‌రి దీని వ‌ల్ల ఏమ‌న్నా ప్ర‌యోజ‌నం ఉందా? అంటే కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టుందుకే పాత దోస్తానాతో చెట్టాప‌ట్టాలేసుకుని తిరుగుతున్నావా? మ‌రి మేమెందుకు నీకు మ‌ర్యాద ఇయ్యాలె.. అయితే ఇగో చూస్కో మా త‌డాఖా..! కాస్కో ఈట‌ల‌… నీకు త‌ప్ప‌విక ఈటెల పోటులు.. అని రేవంత్ బాగానే అర్సుకున్నాడు.

Advertisement

మేము కొట్లాడుతుంటే మ‌ధ్య‌లో వేలు పెట్ట‌డమే కాదు.. నాకు తెలంగాణ ప్ర‌యోజ‌నాలే ముఖ్యం.. నా క‌ణ‌త‌కు తుపాకీ గురిపెట్టి కాల్చినా.. నేను నా వైఖ‌రి వీడ‌ను.. నాకు ముందు తెలంగాణ ప్ర‌యార్టీలు ప్రాధాన్యం.. త‌రువాతే పార్టీ .. ఇంకేదైనా..? అంటూ బీరాలు ప‌లికి, నీతులు చెప్పిన వైనం ప‌ట్లా కాంగ్రెస్ క‌స్సుమంటోంది.

నేను సిద్దాంతాలు మార్చుకుని, చ‌చ్చినా నా అభిప్రాయాలు మారవు, నీతి నిజాయితీ నా రెండు కండ్లు అనే లెవ‌ల్లో సినిమా డైలాగులు కొట్టిన ఈట‌ల రాజేంద‌ర్‌ను బాగానే లెక్చ‌రిచ్చాడు రేవంత్‌రెడ్డి.

Advertisement

క‌రుడుగ‌ట్టిన న‌క్స‌లిజం భావాలు, విప్లవ భావాలు క‌లిగిన ఈట‌ల‌, త‌న అవ‌వ‌స‌రాల కోసం మ‌త‌త‌త్వ పార్టీ పంచ‌న చేర‌లేదా? అని అప్పుడే ట్రోలింగులు మొద‌ల‌య్యాయి. బీజేపీ అంటేనే గిట్ట‌ని ఈట‌ల‌.. మ‌రెందుకు ఆపార్టీని ఎంచుకున్నాడు…? కేసుల‌కు భ‌య‌ప‌డా..? ఆ పార్టీ క‌నీసం గౌర‌వం కూడా ఇవ్వ‌డం లేదు క‌దా.. మ‌రెందుకు ఆత్మ‌గౌర‌వం గురించి పెద్ద డైలాగులు అని కూడా తిట్టిపోస్తున్నారు. నీ మీద మొన్న‌టి దాకా అంతో ఇంతో మ‌ర్యాద ఉండే. ఇప్పుడు పాత దోస్తానా మాయ‌లో ప‌డి అదీ పోగొట్టుకున్నావ్‌.. పో! అని తిట్టుకున్నంత ప‌ని చేస్తున్నారు.

Related News

అప్పుడు వాళ్లు సుప్రీంలు… ఇప్పుడు ప‌ట్టింపేలేదా? ఇద్ద‌రి పాల‌న‌లో ఎమ్మెల్యేలెలా ఉన్నారు?

సీఎం బాగు కోసం ఆర్కే ప‌లుకులు.. స‌ర్కార్ వాస్త‌వ పరిస్థితి క‌ళ్ల‌ముందు పెట్టే ప్ర‌య‌త్నం.. అది సూచ‌నా? బెదిరింపా? ద‌బాయింపా?

బాల్కొండ బ‌రి నుంచి మ‌హేశ్‌? మ‌రి ఆ న‌లుగురి ప‌రిస్థితి? ఇందూరు కాంగ్రెస్‌లో ర‌చ్చ రాజ‌కీయం!

జ‌నసేన ఎంట్రీకి క‌లిసివ‌స్తోన్న జెన్‌జీ.. యువ‌త‌లో ప‌వ‌న్ క్రేజ్‌.. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు ప‌నికివ‌స్తుందా?

రాజ‌కీయాల్లో ర‌ఘువీరా మ‌ళ్లీ యాక్టివ్.. పార్టీకి పూర్వవైభవం తెస్తారా?

తండ్రి చాటు బిడ్డగానే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి! దామోద‌ర‌రెడ్డి డ్యుయ‌ల్ రోల్ అట్టర్ ఫ్లాప్?

పాడిపై ఎథిక్స్ వేటు.. చర్య‌లు తీసుకోవ‌డ‌మే త‌రువాయి.. దుందుడుకు, వివాద‌స్ప‌ద నేతకు ఇదే స‌రైన చర్యా..?

ఆయ‌న అఘోర పూజ‌లు నిజ‌మే.. కానీ కాంగ్రెస్ కోసం కాదు.. తాంత్రిక‌ పూజ‌ల గుట్టు ర‌ట్టు చేసిన క‌విత‌

Big Stories

Advertisement
×