Manchu Manoj:గత కొన్ని సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీలో బయోపిక్ ట్రెండ్ ఎక్కువగా నడుస్తున్న విషయం తెలిసిందే. సినీ సెలబ్రిటీలను మొదలుకొని రాజకీయ నాయకుల వరకూ .. అలాగే స్పోర్ట్స్ కి సంబంధించిన క్రీడాకారులపై బయోపిక్స్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అంతేకాదు దేశ సంరక్షకుల(ఆర్మీ సైనికులు)పై కూడా బయోపిక్స్ తెరకెక్కిస్తూ మంచి సక్సెస్ అందుకుంటున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మళ్లీ సినీ సెలబ్రిటీలకు సంబంధించిన బయోపిక్ లు తెరపైకి రావడానికి సిద్ధమవుతున్నాయి. అందులో భాగంగానే ఇటీవల దివంగత లెజెండ్రీ నటులు అక్కినేని నాగేశ్వరరావు(Akkineni Nageswara Rao) బయోపిక్ ను తీయడానికి ఆసక్తి కనబరిచిన నాగార్జున (Nagarjuna) త్వరలోనే మీ ముందుకు వస్తాం అన్నట్టుగా ఆయన హింట్ ఇచ్చారు.
అయితే ఇప్పుడు మరో హీరో తన బయోపిక్ పై ఆసక్తి కనబరుస్తున్నారు. అంతేకాదు తన బయోపిక్ ఎవరు తీయాలో.. ఎందుకు తీయాలో కూడా చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు..ఆయన ఎవరో కాదు మంచు మనోజ్ (Manchu Manoj). ఇటీవలే కార్తీక ఘట్టమనేని(Karthik Ghattamaneni) దర్శకత్వంలో యంగ్ హీరో తేజ సజ్జా(Teja Sajja) నటించిన ‘మిరాయ్’ సినిమాలో మొదటిసారి విలన్ పాత్ర పోషించి అందరిని ఆకట్టుకున్నారు. ఈ సినిమాతో మనోజ్ పేరు బాగా మారుమ్రోగిపోతోంది. దీంతో ఈయనకు వరుస అవకాశాలు కూడా వచ్చి పడుతున్నాయి.
నా బయోపిక్ ఆయనే తీయాలి – మంచు మనోజ్
మిరాయ్ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ఈయన తాజాగా ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో ఊహించని కామెంట్లు చేశారు. తాజాగా పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన మాట్లాడుతూ..” ఒకవేళ నా బయోపిక్ తీస్తే దానికి సందీప్ రెడ్డివంగా మాత్రమే దర్శకత్వం వహించాలి. ఆయనే ఎందుకు వహించాలి అంటే.. నేను వైల్డెస్ట్ యానిమల్ “. అంటూ తెలిపారు. ప్రస్తుతం మనోజ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. మరి మనోజ్ కోరికను సందీప్ నెరవేరుస్తారేమో చూడాలి.
ALSO READ:Deepika Padukone: మళ్లీ హాలీవుడ్ కి పయనమవుతున్న దీపిక.. అక్కడైనా?
మనోజ్ సినిమాలు..
మనోజ్ సినిమాల విషయానికి వస్తే.. దాదాపు 9 ఏళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మనోజ్.. ఇటీవల నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లతో కలిసి భైరవం సినిమా చేశారు. ఈ సినిమా పర్వాలేదు అనిపించుకుంది. ఆ తరువాత మిరాయ్ సినిమాలో విలన్ గా నటించి అదరగొట్టేశారు. ప్రస్తుతం డేవిడ్ రెడ్డితో పాటు మరో చిత్రంలో కూడా నటిస్తున్నారు మనోజ్.
వ్యక్తిగతంగా ఎన్నో ఇబ్బందులు..
ఇకపోతే కెరియర్ పరంగా అటు ఉంచితే.. వ్యక్తిగతంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు మంచు మనోజ్. అందులో భాగంగానే మొదటి భార్యకు విడాకులు ఇవ్వడం.. భూమా మౌనిక రెడ్డిని వివాహం చేసుకున్న తర్వాత ఇటు కుటుంబ సభ్యులలో వ్యతిరేకత ..ఆస్తి వివాదాలు.. మోహన్ బాబు యూనివర్సిటీలో అవకతవకలు జరుగుతున్నాయని ప్రశ్నించడంతో దాడి చేశారు అంటూ పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కారు. అలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న మనోజ్ ఇప్పుడు వరకు అవకాశాలు అందుకుంటూ బిజీ అవుతున్నారు.