Rakul Preet Singh: కెరటం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించి , వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో హీరోయిన్గా తనదైన మార్క్ కనబరిచిన రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతో ఆకట్టుకుంటూ పలువురు స్టార్ హీరోల చిత్రాలలో నటించి, మరింత ఇమేజ్ అందుకున్న ఈమె ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం అక్కడే సినిమాలు చేస్తూ తన భర్త నిర్మాణ రంగంలో భాగస్వామ్యం అవుతూ బిజీగా మారిన రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో సడన్గా ఐటి అధికారులు దాడి చేసినట్లు వార్తలు రావడంతో ఈ విషయం సోషల్ మీడియాలో కలకలం సృష్టించింది. ముఖ్యంగా రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు ఆమె మామ, భర్త అలాగే పలువురు బాలీవుడ్ సెలబ్రిటీల ఇళ్లల్లో ఐటీ సోదాలు జరిగాయి అని వార్తలు రాగా.. అసలు ఏం జరుగుతోంది అనే కామెంట్లు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న నేపథ్యంలో తాజాగా ఈ ఐటీ దాడులపై రకుల్ ప్రీత్ సింగ్ స్పందించింది.
తాజాగా ఐటీ శాఖ సోదాలతో తన పేరును ముడి పెడుతూ వస్తున్న వార్తలపై రకుల్ ప్రీత్ సింగ్ తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ఇందులో ఎలాంటి నిజం లేదని, ఆ సోదాలకు తనకు ఎటువంటి సంబంధం లేదు అంటూ వివరణ ఇచ్చింది. అంతేకాదు వాస్తవాలను తెలుసుకోకుండా మీడియా సంస్థలు, ఆన్లైన్ రిపోర్టర్లు వార్తలను సంచలనం ఎందుకు చేస్తున్నారు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె మాట్లాడుతూ ..” కొందరు ఆన్లైన్ రిపోర్టర్లు, కొన్ని ప్రధాన మీడియా సంస్థలలో వాస్తవాలను నిర్ధారించుకోకుండా వార్తలను సంచలనం చేసే ధోరణి పెరుగుతుండడం చాలా బాధాకరం . అందుకే ఒకేసారి అందరికీ స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను. ఆ సోదాలు నాకు సంబంధించినవి కావు” అంటూ తన ప్రకటనలో ఆమె క్లారిటీ ఇచ్చింది.
రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ..” నేను ఆర్మీ కుటుంబం నుంచి వచ్చాను. ఇండస్ట్రీలో నాకు ఎలాంటి గాడ్ ఫాదర్ లేరు. కేవలం నా కష్టంతోనే నేను ఈ స్థాయికి వచ్చాను. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా 20 ఏళ్ల వయసు నుంచే నేను క్రమం తప్పకుండా పన్నులు చెల్లిస్తున్నాను. ఇలాంటి నాపై ఐటి దాడుల ఆరోపణలు రావడం నిజంగా బాధను కలిగించింది” అంటూ రకుల్ ప్రీత్ సింగ్ ఆవేదన వ్యక్తం చేసింది.
also read: బిగ్ బాస్ 10లో నామినేషన్స్ సెగలు.. ఆమెపై విరుచుకుపడ్డ కంటెస్టెంట్స్!
ముఖ్యంగా నేను అక్రమ ఆస్తులు కూడబెడుతున్నానని, విదేశాలలో పెట్టుబడి పెడుతున్నానని , ఖరీదైన బహుమతులు, ఆస్తులు నాకు ఉచితంగా ఇస్తున్నారు అంటూ వస్తున్న వార్తలలో ఏమాత్రం నిజం లేదు. వ్యక్తిగతంగా గానీ, ఏ నిర్మాణ సంస్థ తరఫున గానీ నేను ఎలాంటి అక్రమ విదేశీ లావాదేవీలలో పాలు పంచుకోలేదు. విదేశాల్లో ఎవరి పేరు మీద కూడా నేను బినామీ ఆస్తులు కలిగి లేను . ఎవరు ఎప్పుడు ఎలాంటి ఆస్తులు నాకు బహుమతిగా ఇవ్వలేదు. అలాంటి ఖరీదైన బహుమతులు తీసుకోకూడదు అన్నదే నా నియమం” అంటూ తెలిపింది. ఇక అలాగే మీడియా గురించి మాట్లాడుతూ.. “నా గురించి తప్పుడు కథనాలు రచించిన వారందరూ వాటిని వెనక్కి తీసుకొని, వాస్తవాలను స్పష్టం చేయాలని కోరుతున్నాను” అంటూ కూడా పోస్ట్ పెట్టింది ..మొత్తానికైతే రకుల్ ప్రీత్ సింగ్ ఇచ్చిన క్లారిటీతో అన్ని రూమర్స్ కి చెక్ పడింది అని చెప్పవచ్చు.