E-Paper
Advertisement

‘జైలర్ 2’ ట్రైలర్ ఆగయా…ఈ సారి న‌లుగురు హీరోల‌తో మాస్ జాత‌ర‌

‘జైలర్ 2’ ట్రైలర్ ఆగయా…ఈ సారి న‌లుగురు హీరోల‌తో మాస్ జాత‌ర‌
Advertisement

JAILER 2 Telugu Trailer Review: సూపర్ స్టార్ రజినీ కాంత్ (Rajinikanth) నటించిన లేటెస్ట్ మూవీ జైలర్ 2 (jailer 2). ఈ సినిమా మొదటి పార్ట్ బంపర్ హిట్ కావడంతో… పార్ట్ 2తో వస్తోంది చిత్ర బృందం. దసరా కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ జైలర్ 2 ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది. ఇందులో రిటైర్డ్ జైలర్ పాత్రలో అదరగొట్టిన రజనీకాంత్… ఈ సారి అండర్ వరల్డ్ ముప్పును ఎలా ఎదుర్కొన్నాడనేది సినిమా కథ. త‌న కుటుంబ స‌భ్యుల‌ను కాపాడుకునేందుకు పూర్తిగా డ్రైవ‌ర్ అవ‌తారం ఎత్తిన ర‌జినీకాంత్ కు మ‌రో ముగ్గురు హీరోలు ఎలా స‌హాయం చేస్తారు ? విల‌న్ ఆట ఎలా క‌ట్టిస్తాడ‌నేది చూడాలి.

జైలర్ 2 ట్రైల‌ర్ ఎలా ఉందంటే ?

రజినీకాంత్ చేసిన జైలర్ 2 మూవీ ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇందులో మొదటి పార్ట్ కంటే ఎక్కువ యాక్షన్ సీన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఎప్పటిలాగే రజినీకాంత్ తన స్టైల్, స్వాగ్ తో ఇరగదీశాడు. మాస్ యాక్షన్ సీక్వెన్స్ లు, స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ ట్రైలర్ లో హైలెట్ గా నిలిచాయని చెప్పవచ్చు. ఈ సినిమాలో రజనీకాంత్ దాదాపుగా డ్రైవర్ పాత్రలో కనిపించాడు. అతని కోసం విలన్లు వెతకడం.. సైలెంట్ గా రజినీకాంత్ తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగడం ట్రైలర్ లో కనిపించాయి.

Advertisement

West Indies arrived in India without a jersey sponsor West Indies tour of India, 2026 : భారత పర్యటనకు రాకముందు స్పాన్సర్లే లేవు….కానీ ఇప్పుడు విండీస్ కథే మారిపోయింది

అంటే విలన్లకు తెలియకుండానే… రజనీకాంత్ పని పూర్తి చేస్తాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. అటు శివన్న మోహన్ లాల్ ఇప్పటికే మొదటి పార్ట్ లో ఉండగా…. వాళ్లను రెండో పార్ట్ లో కూడా చూపించారు. దానికి తోడు హృతిక్ రోషన్ పాత్ర కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఎస్ జె సూర్య, విద్యాబాలన్ తమ పాత్రలో ఒరిగిపోయారు. దానికి తగ్గట్టుగానే, అనిరుద్ రవి చందర్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్ కే హైలెట్ గా నిలిచింది. మొత్తానికి తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్… మూవీ హైప్స్ అమాంతం పెంచేసింది.

ద‌స‌రా కానుక‌గా వ‌చ్చేస్తోన్న జైల‌ర్ 2

Advertisement

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ 2 సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 15వ తేదీన మొత్తం మూడు భాషల్లో రిలీజ్ కానుంది. తమిళ, తెలుగు తోపాటు హిందీ భాషలో కూడా రిలీజ్ చేయబోతున్నారు. మొదటి పార్ట్ 240 కోట్లతో తీయగా.. రెండో భాగం 350 కోట్లతో తెరకెక్కించారు. మ‌రి ఈ జైల‌ర్ 2 సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి.

Massive Statement by Pakistan Formar Cricketer Tanveer Ahmed on Team India Virat Kohli: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తే, ఉగాండా కంటే దారుణంగా టీమిండియా మారుతుంది

 

Related News

400 కోట్ల కలెక్షన్స్ ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్ రిలీజ్..ఎలా ఉందంటే?

‘ఆదర్శ కుటుంబం’ వాయిదాపై స్పందించిన నిర్మాత నాగవంశీ!

బోయపాటికి చిరంజీవి సవాల్.. స్వీకరిస్తానంటున్న డైరెక్టర్!

ఐటీ రైడ్స్ పై రకుల్ ప్రీత్ సింగ్ రియాక్షన్?

స్వీయ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ గ్లింప్స్ రిలీజ్!

సంచలనం సృష్టిస్తున్న డీప్ ఫేక్ వీడియోలు.. రంగంలోకి ‘మా’!

నాని రెమ్యునరేషన్ పెంచేశాడా? నిర్మాతలకు కొత్త లెక్క

Big Stories

Advertisement
×