E-Paper
Advertisement

‘ఆదర్శ కుటుంబం’ వాయిదాపై స్పందించిన నిర్మాత నాగవంశీ!

‘ఆదర్శ కుటుంబం’ వాయిదాపై స్పందించిన నిర్మాత నాగవంశీ!
Advertisement

Aadarsha kutumbam AK 47: త్రివిక్రమ్ (Trivikram ) దర్శకత్వంలో వెంకటేష్ (Venkatesh) హీరోగా, శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) హీరోయిన్గా నివేదా పేతురాజు (Nivetha pethuraj) కీలకపాత్రలో ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన చిత్రం ఆదర్శ కుటుంబం ఏకె47. మొదట అక్టోబర్ రెండవ తేదీన సినిమాను విడుదల చేస్తామని పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టారు. తర్వాత అక్టోబర్ 9వ తేదీన సినిమాను విడుదల చేస్తున్నామని ప్రకటించారు. అయితే ఇప్పుడు మళ్లీ ఈ సినిమా తేదీని వాయిదా వేస్తున్నామని నిర్మాత నాగ వంశీ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా ఈసారి పక్కా.. ఈసారి పక్కా.. అంటూ నిర్మాత నాగవంశీ డేట్స్ ప్రకటించడం, మళ్ళీ ఆ డేట్స్ వాయిదా వేయడంతో అభిమానులు కూడా నాగవంశీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు మళ్లీ ఎందుకు వాయిదా వేశారు? అనే విషయంపై తాజాగా నాగవంశీ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఆదర్శ కుటుంబం మళ్లీ వాయిదా..

తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించిన సూర్యదేవర నాగావంశీ.. ఆదర్శ కుటుంబం మళ్లీ వాయిదా పడడంపై స్పందిస్తూ సోషల్ మీడియాలో వచ్చే విమర్శలు, నెగటివ్ ట్రోల్లింగ్ కి భయపడే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అంటూ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎంత క్లిష్టంగా మారాయో వివరిస్తూ.. ఆదివారం నాటికి విదేశాల్లో సెన్సార్ కి అవసరమైన కాపీని కూడా అందించలేని పరిస్థితి ఏర్పడిందని వివరించారు. ముఖ్యంగా సినిమా షూటింగ్ మొత్తం పూర్తి కాలేదని, ఇంకా ట్రైలర్ వర్క్, రెండు పాటల చిత్రీకరణ, పోస్టు ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి కాలేదు. పైగా ప్రచారంపై అభిమానుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఇంకా కొన్ని సన్నివేశాలు మిగిలి ఉన్నాయి. ఈ పనులన్నీ పూర్తి కావడానికి మరో రెండు మూడు వారాలు పడుతుంది. ఈ కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడింది అంటూ నాగవంశీ క్లారిటీ ఇచ్చారు.

వాయిదా పడడానికి అసలు కారణం చెప్పిన నాగవంశీ..

Advertisement

ఇదే ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ.. నిజానికి అక్టోబర్ 9న సినిమా విడుదల చేస్తే.. మరుసటి రోజు నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో స్కూల్ కి సెలవులు వస్తాయి. ప్రొడ్యూసర్స్ గా సినిమాను అనుకున్న తేదీకే విడుదల చేసేయాలని నాకు కూడా బలంగా అనిపించింది. కానీ ఇప్పుడున్న డిజిటల్ యుగంలో సోషల్ మీడియా సృష్టించిన భయం, ఆలోచనలకు అడ్డుకట్ట వేస్తోంది. హడావిడిగా రిలీజ్ చేసి క్వాలిటీ తగ్గితే వచ్చే బ్యాక్ లాష్, చాలా దారుణంగా ఉంటాయి.

ALSO READ: హేటర్స్ కి అనసూయ దిమ్మతిరిగే రియాక్షన్!

ఆ భయంతోనే వాయిదా వేశాం..

Advertisement

ఆ భయంతోనే సినిమాని సేఫ్ గా, పక్కాగా రెడీ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే సినిమా విడుదల వాయిదా వేసాము అంటూ వివరించారు. మొత్తానికైతే మళ్లీ వాయిదా పడడంపై అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రెస్ మీట్ పెట్టి మరీ, అసలు కారణాలు చెప్పి మళ్ళీ వార్తల్లో నిలిచారు నాగ వంశీ. ఏది ఏమైనా ఆదర్శ కుటుంబం మూవీ మళ్లీమళ్లీ వాయిదా పడుతుండడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మరి కొత్త విడుదల తేదీని ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.

Related News

బోయపాటికి చిరంజీవి సవాల్.. స్వీకరిస్తానంటున్న డైరెక్టర్!

ఐటీ రైడ్స్ పై రకుల్ ప్రీత్ సింగ్ రియాక్షన్?

స్వీయ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ గ్లింప్స్ రిలీజ్!

సంచలనం సృష్టిస్తున్న డీప్ ఫేక్ వీడియోలు.. రంగంలోకి ‘మా’!

నాని రెమ్యునరేషన్ పెంచేశాడా? నిర్మాతలకు కొత్త లెక్క

రణబాలికి హైక్స్ లేవట.. మేకర్స్ లెక్క మామూలుగా లేదుగా!

‘రాజాసాబ్’ బ్యూటీ రిధి.. ఈసారి కొత్త లుక్‌తో షాక్ ఇచ్చిందే!

Big Stories

Advertisement
×