E-Paper
Advertisement

బోయపాటికి చిరంజీవి సవాల్.. స్వీకరిస్తానంటున్న డైరెక్టర్!

బోయపాటికి చిరంజీవి సవాల్.. స్వీకరిస్తానంటున్న డైరెక్టర్!
Advertisement

Chiranjeevi: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి (Chiranjeevi) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. మాస్, యాక్షన్ మొదలుకొని ఫ్యామిలీ, కామెడీ ఎంటర్టైనర్ వరకు ఇలా పలు జానర్ లలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అంతేకాదు ఇతర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటూ ఆడియన్స్ కి కన్నుల పండుగ లాంటి చిత్రాలను అందిస్తున్నారు. అలాంటి చిరంజీవి గతంలో బాలకృష్ణ (Balakrishna) 50 ఏళ్ల సినీ ప్రయాణం వేడుకల సందర్భంగా దర్శకుడు బోయపాటి శ్రీనుకి ఒక సవాలు విసిరిన విషయం తెలిసిందే. ఆ సవాల్ పై ఇప్పుడు బోయపాటి శ్రీను స్పందించిన తీరు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

బోయపాటికి చిరంజీవి సవాల్..

బాలకృష్ణ 50 ఏళ్ల సినీ ప్రయాణం వేడుకలలో పాల్గొన్న చిరంజీవి మాట్లాడుతూ.. నేను (చిరంజీవి), బాలకృష్ణతో కలసి ఒక సినిమా చేయాలి అంటూ బోయపాటికి సవాల్ విసరడంతో.. ఈ మల్టీస్టారర్ ఎప్పుడు కార్యరూపం దాలిస్తుందని అభిమానులు కూడా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తూ వచ్చారు. అయితే తాజాగా బోయపాటి శ్రీను ఈ విషయంపై స్పందించడం అభిమానులలో మరింత క్యూరియాసిటీని పెంచేసింది.

బోయపాటి శ్రీను రియాక్షన్..

Advertisement

తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బోయపాటి శ్రీను ఈ ప్రతిష్టాత్మక కాంబినేషన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ..” చిరంజీవి, బాలకృష్ణ లను కలిపి సినిమా చేయాలనే ఆలోచన కచ్చితంగా కార్యరూపం దాల్చాల్సిన విషయమే. తెలుగు సినిమా రంగానికి చిరంజీవి (Chiranjeevi), బాలకృష్ణ (Balakrishna ), వెంకటేష్(Venkatesh ), నాగార్జున (Nagarjuna)లు నాలుగు స్తంభాలాంటి వారు. అలాంటి ఇద్దరు దిగ్గజ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ లను ఒకే సినిమాలో చూపించే అవకాశం నాకు వస్తే.. అది చాలా ప్రత్యేకమైన విషయం. ఇద్దరితో కలిసి సినిమా చేయడం సాధారణ ప్రాజెక్టులా ఉండదు. పూర్తిగా అది మరో స్థాయిలో ఉంటుంది.తప్పకుండా చేద్దాం అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు.

ఇద్దరు బడా హీరోలతో సినిమా అంటే.. కచ్చితంగా ప్రణాళిక అవసరమే..

అంతేకాదు ఇద్దరూ బడా హీరోల కాల్ షీట్లు, కథ , పాత్రల ప్రాధాన్యత , ఇతర బాధ్యతలు వంటి ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ముఖ్యంగా వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా రావాలి అనే ఆలోచన ఉంటే సరిపోదు.. ఇద్దరు అగ్ర కథానాయకులకు సరిపోయే కథను సిద్ధం చేయాలి. వారి తేదీలు కూడా కలిసేలా చూసుకోవాలి . ఇద్దరికీ సమానమైన బలమైన పాత్రలను రూపొందించాలి. అప్పుడే ఆ సినిమా కార్యరూపం దాల్చి, ఎటువంటి విమర్శలకు చోటు ఇవ్వకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇకపోతే ఇద్దరు హీరోల అభిమానుల మధ్య కూడా ఏదైనా తేడా వస్తే గొడవలు కూడా జరిగిపోతాయి. ఏది ఏమైనా ఈ ఇద్దరినీ ఒకే ఫ్రేమ్ లో చూడాలన్నది ఈ హీరోల అభిమానుల కోరిక . మరి ఆ కోరికను బోయపాటి శ్రీను ఎప్పుడు నెరవేరుస్తారో చూడాలి.

Advertisement

also read: ఐటీ రైడ్స్ పై రకుల్ ప్రీత్ సింగ్ రియాక్షన్?

బాలకృష్ణ , చిరంజీవి ప్రస్తుత సినిమాలు..

ఇక వీరిద్దరి సినిమాల విషయానికొస్తే బాలకృష్ణ ప్రస్తుతం దాదా సినిమాలో నటిస్తున్నారు. అటు చిరంజీవి కాకా సినిమాలో నటిస్తున్నారు . ఈ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత భవిష్యత్తులో వీరిద్దరూ కలిసి నటించే ఆలోచన చేస్తారేమో చూడాలి.

Related News

ఐటీ రైడ్స్ పై రకుల్ ప్రీత్ సింగ్ రియాక్షన్?

స్వీయ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ గ్లింప్స్ రిలీజ్!

సంచలనం సృష్టిస్తున్న డీప్ ఫేక్ వీడియోలు.. రంగంలోకి ‘మా’!

నాని రెమ్యునరేషన్ పెంచేశాడా? నిర్మాతలకు కొత్త లెక్క

రణబాలికి హైక్స్ లేవట.. మేకర్స్ లెక్క మామూలుగా లేదుగా!

‘రాజాసాబ్’ బ్యూటీ రిధి.. ఈసారి కొత్త లుక్‌తో షాక్ ఇచ్చిందే!

నితిన్‌కు హిట్ పడి ఎన్నాళ్లయిందో.. ఈసారి అయినా లెక్క మారేనా?

Big Stories

Advertisement
×