Kiran Abbavaram: ఈ మధ్యకాలంలో హీరోలు చాలామంది మెగా ఫోన్ పట్టి దర్శకులుగా మారుతున్న విషయం తెలిసిందే.. అందులో భాగంగానే దర్శకుడిగా సినిమాను తెరకెక్కిస్తూనే.. హీరోగా నటిస్తూ ఆడియన్స్ కి భిన్నమైన అనుభూతిని కలిగిస్తున్నారు. ఈ క్రమంలోనే వరుస హిట్లతో జోరు మీదున్న టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) మెగా ఫోన్ పట్టి దర్శకుడిగా అవతారం ఎత్తారు. గతంలో షార్ట్ ఫిలిమ్స్ రూపొందించిన అనుభవంతోనే ఇప్పుడు ఆయన స్వయంగా దర్శకుడిగా సినిమా తీయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే నటుడిగా, నిర్మాతగా రాణిస్తున్న కిరణ్ అబ్బవరం ఇప్పుడు ఈ కొత్త ప్రయత్నంతో తనలోని మేకింగ్ టాలెంట్ ను కూడా చాటుకోవాలని చూస్తున్నారు.
అందులో భాగంగానే రియాలిటీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పైగా ఈ చిత్రంలో నటించడమే కాకుండా దర్శకత్వం వహించి, నిర్మించబోతున్నారు కూడా.. హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న కిరణ్ డైరెక్టర్గా తన టాలెంట్ ఏంటో చూపించాలని అభిమానులు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. ఇకపోతే కిరణ్ అబ్బవరం నటిస్తున్న ఈ రియాలిటీ మూవీ నుంచి తాజాగా గ్లింప్స్ విడుదల చేశారు. ఆద్యంతం ఇది ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాలను పెంచేసింది. కమర్షియల్ హంగులకు దూరంగా.. పక్కా మిడిల్ క్లాస్ బాగోద్వేగాలతో వస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో అంచనాలు భారీగా నెలకొన్నాయి.
రియాలిటీ మూవీ గ్లింప్స్ విషయానికి వస్తే.. ఇందులో కిరణ్ అబ్బవరం ఆనంద్ అనే ఒక నిజాయితీగల యువకుడి పాత్రలో నటిస్తున్నాడు. హోటల్ నడుపుతూ నలుగురికి సేవ చేయడంలోనే నిజమైన ఆనందాన్ని వెతుక్కునే కుర్రాడిగా నటిస్తున్నాడు. ఇకపోతే తన కుటుంబం చేసిన అప్పులన్నీ తీర్చడమే లక్ష్యంగా పెట్టుకున్న కిరణ్ అబ్బవరం..”ఈరోజుతో నా జీవితంలో అత్యంత హైప్ లభించింది . ఈరోజుతో మా కుటుంబానికి ఒక్క రూపాయి కూడా అప్పు లేదు” అని చెప్పే డైలాగ్ రియాలిటీని హత్తుకుంది. ఇక తాజాగా విడుదల చేసిన ఈ గ్లింప్స్ కి క్యాప్షన్ గా కిరణ్ అబ్బవరం తన ఎక్స్ ఖాతా ద్వారా..” మీరు ఎంత మంది వెయిట్ చేస్తున్నారు? ఈ మూమెంట్ గురించి” అంటూ క్యాప్షన్ కూడా జోడించారు.
జాయ్ ఫిలిమ్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. తాజాగా విడుదల చేసిన గ్లింప్స్ లో మధ్య తరగతి కుర్రాడిగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు కిరణ్ అబ్బవరం. మరి ఫ్యామిలీ ఆడియన్స్ కు హత్తుకునేలా రియాలిటీ కి దగ్గరగా ఉన్న ఈ రియాలిటీ సినిమా ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.
also read: సంచలనం సృష్టిస్తున్న డీప్ ఫేక్ వీడియోలు.. రంగంలోకి ‘మా’!
కిరణ్ అబ్బవరం విషయానికి వస్తే.. 2019లో రాజావారు రాణి గారు అనే సినిమా హీరోగా పరిచయమయ్యారు. ఇదే సినిమాలో తన సరసన నటించిన రహస్యతో ప్రేమలో పడి ఆమెను పెళ్లి చేసుకున్నారు. ఒక కొడుకుకి కూడా జన్మనిచ్చిన విషయం తెలిసిందే. కమర్షియల్ సినిమాలతో దూసుకుపోతున్న ఈయన ఇప్పటికే .. తన ఖాతాలో ఎస్ఆర్ కళ్యాణమండపం, సమ్మతమే, సెబాస్టియన్ పిసీ 524 , వినరో భాగ్యము విష్ణు కథ , కే, కే రాంప్ వంటి చిత్రాలతో మంచి విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి.
Meeru entha Mandi wait chestunaru ee Moment Gurinchi ☺️
REALITY – DECEMBER 25❤️#Reality #JoyFilms #KA13 pic.twitter.com/ZnrotCbHe2— Kiran Abbavaram (@Kiran_Abbavaram) October 5, 2026