E-Paper
Advertisement

400 కోట్ల కలెక్షన్స్ ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్ రిలీజ్..ఎలా ఉందంటే?

400 కోట్ల కలెక్షన్స్ ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్ రిలీజ్..ఎలా ఉందంటే?
Advertisement

Hanuman Ansh Telugu Trailer:చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన ‘హనుమాన్ అంశ్’ చిత్రం బాక్సాఫీస్‌లో భారీ విజయాన్ని సాధించి 400 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువైన నీమ్ కరోలీ బాబా జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. త్రివిక్రమ్ ద్వారా తెలుగులో విడుదల కావాల్సి ఉండగా, చివరకు ‘సలార్’, ‘కేజీఎఫ్’ వంటి భారీ చిత్రాల నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ దీని తెలుగు హక్కులను దక్కించుకుంది. తాజాగా విడుదలైన ఈ తెలుగు ట్రైలర్ విశేషాలు ఇప్పుడు చూద్దాం..

హోంబలే సంస్థ చేతుల మీదుగా తెలుగులోకి..:

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సంచలన విజయాలు సాధించిన హోంబలే ఫిల్మ్స్, ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక డ్రామాను తెలుగు ప్రేక్షకులకు అందించడానికి సిద్ధమైంది. ఇక ఇప్పటికే ఓవర్సీస్ పంపిణీని విజయవంతంగా నిర్వహించిన ఈ సంస్థ, అక్టోబర్ 9న ఈ సినిమాను తెలుగులో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.

దైవత్వంతో నిండిన ‘హనుమాన్ అంశ్’ ట్రైలర్:

Advertisement

తాజాగా మేకర్స్ విడుదల చేసిన తెలుగు ట్రైలర్ చాలా ఆహ్లాదకరంగా, ప్లెజెంట్‌గా సాగింది. బాబా సన్యాసిగా మారిన విధానం, బ్రిటిష్ కాలం నాటి కొన్ని కీలక సన్నివేశాలు, మనుషులకు ఆయన ఇచ్చే స్ఫూర్తిదాయకమైన మాటలు ట్రైలర్‌లో ఆకట్టుకున్నాయి. ఇక దైవత్వంతో నిండిన ఆయనను భార్య వదిలేస్తాననడం, ఇతరులతో బాబా చాలా సంతోషంగా, చమత్కారంగా ఉండటం వంటి భావోద్వేగాలను ఇందులో చక్కగా చూపించారు.

భక్తి పారవశ్యం.. కైంచీ ధామ్‌కు పోటెత్తుతున్న భక్తులు:

ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి జనాల్లో భక్తిభావం విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తరాఖండ్‌లోని నైనితాల్ సమీపంలో ఉన్న నీమ్ కరోలీ బాబా ఆశ్రమం ‘కైంచీ ధామ్’ క్షేత్రానికి భక్తులు వేల సంఖ్యలో క్యూ కడుతున్నారు. సినిమా చూసిన ప్రేక్షకులు బాబా దివ్యత్వాన్ని స్వయంగా అనుభూతి చెందేందుకు అక్కడికి చేరుకోవడంతో ఆ పుణ్యక్షేత్రం భక్తుల సందడితో, జై శ్రీరామ్ నినాదాలతో కిటకిటలాడిపోతోంది.

Advertisement

ALSO READ:‘ఆదర్శ కుటుంబం’ వాయిదాపై స్పందించిన నిర్మాత నాగవంశీ!

హనుమాన్ విగ్రహ ప్రతిష్ట మరియు సెంటిమెంట్:

ట్రైలర్ చివరిలో హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్టించడం, హనుమాన్‌ను జాగ్రత్తగా చూసుకోమని ఊరి జనానికి చెప్పి బాబా ఎక్కడికో వెళ్లడానికి సిద్ధమయ్యే సన్నివేశాలు ప్రేక్షకులను కంటతడి పెట్టించేలా ఉన్నాయి. కేవలం రూ. 2 కోట్ల చిన్న బడ్జెట్‌తో ప్రారంభమై బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 423 కోట్ల సునామీ సృష్టించిన ఈ చిత్రం, తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

అధ్యాత్మికత, మానవతా విలువలు కలబోసిన ఈ దృశ్య కావ్యం తెలుగు ప్రేక్షకులకు ఒక సరికొత్త దైవిక అనుభూతిని పంచడం ఖాయం. అక్టోబర్ 9న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి మరి.

Related News

‘ఆదర్శ కుటుంబం’ వాయిదాపై స్పందించిన నిర్మాత నాగవంశీ!

బోయపాటికి చిరంజీవి సవాల్.. స్వీకరిస్తానంటున్న డైరెక్టర్!

ఐటీ రైడ్స్ పై రకుల్ ప్రీత్ సింగ్ రియాక్షన్?

స్వీయ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ గ్లింప్స్ రిలీజ్!

సంచలనం సృష్టిస్తున్న డీప్ ఫేక్ వీడియోలు.. రంగంలోకి ‘మా’!

నాని రెమ్యునరేషన్ పెంచేశాడా? నిర్మాతలకు కొత్త లెక్క

రణబాలికి హైక్స్ లేవట.. మేకర్స్ లెక్క మామూలుగా లేదుగా!

Big Stories

Advertisement
×