E-Paper
Advertisement

ఇండియన్ సినిమాలకు మరిన్ని ఆస్కార్స్.. అంచనాలు పెంచేసిన రాజమౌళి కొడుకు!

ఇండియన్ సినిమాలకు మరిన్ని ఆస్కార్స్.. అంచనాలు పెంచేసిన రాజమౌళి కొడుకు!
Advertisement

Karthikeyaటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఓటమెరుగని దర్శకుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకుని, తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్లలు దాటించి.. ఆస్కార్ రెడ్ కార్పెట్ పై నడిచిన రాజమౌళి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇక అలాంటి రాజమౌళికి వెన్నెముకగా నిలుస్తూ.. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి అంతర్జాతీయ చిత్రాలకు ప్రీ ప్రొడక్షన్ నుండి పోస్ట్ ప్రొడక్షన్ ప్రమోషన్ వరకు అన్ని వ్యవహారాలను సమర్ధవంతంగా నిర్వహించే ఎగ్జిక్యూటివ్ గా రాజమౌళి కొడుకు కార్తికేయకు సుదీర్ఘ అనుభవం ఉంది. ముఖ్యంగా రాజమౌళి సినిమాలన్నింటికీ కూడా తెర వెనుక కీలకంగా ప్రవర్తించే కార్తికేయ ఇప్పుడు ఆ అనుభవంతోనే నిర్మాతగా మారి వరుస చిత్రాలతో టాలీవుడ్ సినీ పరిశ్రమలో దూసుకుపోతున్నారు.

నిర్మాతగా మారిన కార్తికేయ..

ఇక అందులో భాగంగానే.. పుష్ప 2 తర్వాత మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ తెలుగులో చేస్తున్న మరో స్ట్రెయిట్ మూవీ డోంట్ ట్రబుల్ ది ట్రబుల్.. ఈ టైటిల్ తో రాబోతున్న ఈ చిత్రానికి శశాంక్ యేలేటి దర్శకత్వం వహిస్తుండగా.. స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రెజెంటర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక బాహుబలి ప్రొడ్యూసర్లైన ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ తో కలిసి రాజమౌళి తనయుడు కార్తికేయ ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే సెప్టెంబర్ 11వ తేదీన థియేటర్లలోకి రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. హీరోయిన్ పాత్ర లేకుండా కేవలం ఫహద్ ఫాజిల్ తో పాటు ఒక చిన్నారి దెయ్యంగా నటిస్తున్న సారా పాలేకర్ చుట్టూ ఈ సినిమా కథ మొత్తం సాగుతుందని మేకర్స్ అంటున్నారు. మరి హీరోయిన్ పాత్ర లేకుండా ఈ సినిమాతో మేకర్స్ చేస్తున్న ఈ కొత్త ప్రయోగం ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

Advertisement

ALSO READ:ప్రియుడితో సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్!

సెప్టెంబర్ 11న థియేటర్లలోకి..

ఇకపోతే సెప్టెంబర్ 11వ తేదీన ఈ సినిమా థియేటర్లలోకి రానున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం భాషల్లో కూడా విడుదల కానున్నట్లు స్పష్టం చేశారు. ఇక ఈ సినిమాకి కాలభైరవ మ్యూజిక్ అందిస్తుండగా.. రాజమౌళి భార్య రమా రాజమౌళి స్టైలిస్ట్ గా పని చేస్తున్నారు. డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి కొడుకు శశాంక్ యేలేటి డోంట్ ట్రబుల్ తోనే ఫస్ట్ టైం దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న కార్తికేయ.. మరొకవైపు ఇండియన్ సినిమాలపై చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఇండియన్ సినిమాలకు ఆస్కార్..

Advertisement

ఆయన మాట్లాడుతూ..” భారతీయ సినిమాలకు భవిష్యత్తులో మరిన్ని ఆస్కార్లు వచ్చే అవకాశం ఉంది” అంటూ నిర్మాత కార్తికేయ ధీమా వ్యక్తం చేశారు. ఆస్కార్ ప్రక్రియ చాలా కష్టమైనదని , కానీ రాబోయే రోజుల్లో మంచి భారతీయ సినిమాలు వస్తున్నాయని స్పష్టం చేశారు. ఇక మన కంటెంట్ ప్రపంచ వేదిక పైకి వెళ్తే కచ్చితంగా ఆస్కార్ సొంతం చేసుకుంటామని రాజమౌళి తనయుడు కార్తికేయ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కార్తికేయ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి

Related News

ఎన్టీఆర్ తొలి పారితోషికం వెనుక ఉన్న ఆసక్తికర కథ.. ఈ విషయం చాలా మందికి తెలియదు!

అభిమానులకు షాక్.. ఇండస్ట్రీకి దూరం కానున్న రణ్‌వీర్ సింగ్!

ప్రియుడితో సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్!

హీరోగా ఎంట్రీ ఇస్తున్న సీఎం వారసుడు.. ఆ స్థానాన్ని భర్తీ చేస్తాడా?

తనకంటే 16 ఏళ్ల చిన్నమ్మాయితో పెళ్లి.. సోషల్ మీడియా ట్రోల్స్ పై మ్యూజిక్ డైరెక్టర్ ఆవేదన!

ప్రేమలో ఫెయిల్ అయ్యారా? అయితే రమ్యకృష్ణ ‘సెకండ్ లవ్’ చూడాల్సిందే..

ఘట్టమనేని ఫ్యామిలీలో పెళ్లి సందడి…పెళ్లి పీటలు ఎక్కబోయేది ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×