E-Paper
Advertisement

ఎన్టీఆర్ తొలి పారితోషికం వెనుక ఉన్న ఆసక్తికర కథ.. ఈ విషయం చాలా మందికి తెలియదు!

ఎన్టీఆర్ తొలి పారితోషికం వెనుక ఉన్న ఆసక్తికర కథ.. ఈ విషయం చాలా మందికి తెలియదు!
Advertisement

NTR Remuneration:100 కోట్లు… 200 కోట్లు.. 300 కోట్లు…ఇది ఇప్పటి హీరోలు తీసుకునే పారితోషికం. కానీ సీనియర్ ఎన్టీఆర్ తీసుకున్న తొలి పారితోషికం ఎంతో తెలుసా…అక్షరాల 1116 రూపాయలు.ఏంటి వినడానికి చిన్న అమౌంట్ లా అనిపిస్తుందా..?ఇప్పుడు ఇది చిన్న అమౌంటే కావచ్చు.కానీ ఆ కాలంలో ఇది పెద్ద మొత్తమే.ఎన్టీఆర్ కుటుంబ విషయానికొస్తే ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఎన్టీఆర్ చదువులోఎప్పుడూ ముందుండేవాడు..

అలా కష్టపడి చదివి ఆ రోజుల్లో ప్రభుత్వ సబ్ రిజిస్టర్ ఉద్యోగం సంపాదించాడు .ఆ రోజుల్లో మద్రాస్ ప్రెసిడెన్సీలో ఆ ఉద్యోగం అంటే జీవితానికి ఒక మంచి భరోసా. స్థిరమైన జీవితం సొసైటీలో గౌరవం.ఇక వారికుటుంబ సభ్యులు కూడా అదే ఉద్యోగంలో స్థిరపడాలని కోరుకున్నారు.కానీ రామారావు మనసులో వేరే ఆలోచన ఉంది .కాలేజీ రోజుల్లో నాటకాల్లో వేషాలు వేస్తూ నటనపై ఇష్టం పెంచుకున్న రామారావు మనసు సినిమాల వైపు లాగేస్తుంది.అలా ఉద్యోగం చేస్తున్నా ఆయన మనసు మొత్తం సినిమాలపైనే .అయితే ఎన్టీఆర్  జీవితాన్ని మలుపు తిప్పిన క్షణం ఒక ఫోటో రూపంలో వచ్చింది.

Advertisement

అందులో ఉన్న అడ్వాన్స్ మొత్తం ఒక 1116 రూపాయలు

అవును….అప్పట్లో ప్రముఖ నిర్మాత దర్శకుడు బిఎ సుబ్బారావు కొత్త సినిమా కోసం హీరోని వెతుకుతున్నాడు .అదే సమయంలో ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక ఫోటో ఆయన చేతికి దొరికింది.ఆ ఫోటోలో ఉన్న మనిషి కళ్ళల్లో కనిపించిన కాన్ఫిడెన్స్ ,ముఖంలోని కళ దర్శకుడు సుబ్బారావుని ఎంతగానో ఆకట్టుకున్నాయి .
దాంతో పెద్దగా స్క్రీన్ టెస్ట్ లు, అడిషన్స్ ఏం లేకుండానే.. తాను తీయబోయే పల్లెటూరి పిల్ల సినిమాకి హీరోగా ఎంపిక చేశాడు .అయితే సినిమా ఒప్పందం కుదిరిన రోజే నిర్మాత బిఎస్ సుబ్బారావు రామారావు చేతిలో ఒక కవర్ పెట్టాడు.అందులో ఉన్న అడ్వాన్స్ మొత్తం ఒక 1116 రూపాయలు.అదే రామారావు తన జీవితంలో అందుకున్న తొలి రెమ్యూనరేషన్ .

Advertisement

also read:‘బాస్’ రంగంలోకి దిగడంతో సీన్ రివర్స్.. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ గొడవపై బిగ్ అప్‌డేట్!

చేతుల్లో రూపాయి లేక రోజు గడవడం కష్టం

ఇక అలా తొలి రెమ్యూనరేషన్ అందుకోగానే ఒక నిర్ణయానికి వచ్చేసాడు రామారావు .అప్పుడు చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేయాలని డిసైడ్ అయ్యాడు .
కంటి ముందు కనిపిస్తున్న మంచి భవిష్యత్తును వదిలేసి, సినిమా రంగంపై ఉన్న ఇష్టంతో మద్రాస్ రైలు ఎక్కేశాడు .అయితే రామారావు అనుకున్న సినిమా జర్నీ అంత ఈజీగా జరగలేదు.పల్లెటూరి పిల్ల సినిమా షూటింగ్ అనుకున్న సమయానికి మొదలు కాకపోవడంతో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కున్నాడు రామారావు.ఇక స్నేహితులతో కలిసి చిన్న చిన్న గదుల్లో ఉన్నాడు. చేతుల్లో రూపాయి లేక రోజు గడవడం కష్టంగా మారింది.దాంతో కుటుంబానికి ఏం జవాబు చెప్పాలో తెలియక మదన పడిపోయాడు రామారావు .

తెలుగు సినీ ఇండస్ట్రీలో పాతుకుపోయిన రామారావు

అలా ఎన్నో ఇబ్బందులు ఆయనని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఇక కొన్ని రోజులు అయితే ఏకంగా ఆకలితోనే గడపాల్సి వచ్చింది.అలా అని ఊరికి వెళ్లకుండా, ఎంతో కష్టపడి, వచ్చిన ప్రతి రూపాయిలు పొదుపు చేస్తూ తన శ్రద్దని నటన పైనే పెట్టాడట రామారావు .ఆ శ్రద్దనే క్రమక్రమంగా మంచి ఫలితాలను తీసుకొచ్చింది .ఇక పల్లెటూరి పిల్ల తర్వాత వచ్చిన షావుకారు ఆ తర్వాత విడుదలైన పాతాళభైరవి, మల్లీశ్వరి సినిమాలతో తెలుగు సినీ ఇండస్ట్రీలో పాతుకుపోయాడు రామారావు.

లక్షల రెమ్యూనరేషన్ తీసుకొని నెంబర్ వన్ స్టార్ గా

ఇక శ్రీకృష్ణుడిగా, శ్రీరాముడిగా తెలుగు తెరపై ఆయన కనిపిస్తే నీరాజనాలు పట్టారు ప్రేక్షకులు.ముఖ్యంగా దుర్యోధనుడు, కర్ణుడు, రావణాసురుడు వంటి పౌరాణిక పాత్రలకు ఆయన కేరాఫ్ అయిపోయాడు .మరోవైపు సాంఘిక చిత్రాల్లోనూ తనదైన సత్తా చాటి రికార్డులను తిరగరాశాడు రామారావు .అలా ఒకప్పుడు కేవలం 1116 రూపాయలు అడ్వాన్స్ తీసుకున్న రామారావు ఆ తర్వాత కాలంలో లక్షలు రెమ్యూనరేషన్ తీసుకొని నెంబర్ వన్ స్టార్ గా ఎదిగాడు .ఒక దశలో ఆయన చివరి సినిమా మేజర్ చంద్రకాంత్ సినిమాకి ఏకంగా పాతిక లక్షల పారితోషికం తీసుకున్నాడు అన్న వార్త అడపాదడపా వినిపిస్తూనే ఉంటుంది .

also read:ఘట్టమనేని ఫ్యామిలీలో పెళ్లి సందడి…పెళ్లి పీటలు ఎక్కబోయేది ఎవరో తెలుసా ?

ఇప్పటి తరం నేర్చుకోవాల్సింది ఎంతో

ఏది ఏమైనా ఆ రోజుల్లోనే మంచి సురక్షితమైన ఉద్యోగాన్ని వదిలి ఎన్ని కష్టాలైనా సరే సినిమా రంగంలోనే భవిష్యత్తుని తేల్చుకుంటానని అడిగేసిన రామారావుని చూసి ఇప్పటి తరం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది !

Related News

డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా రఘు మాస్టర్..

నాకే ప్లాస్టిక్ బాటిల్ ఇస్తావా?..ఫైర్ అయిన స్టార్ డైరెక్టర్..అసలేం జరిగిందంటే?

NBK 112 లో మరో కోలీవుడ్ స్టార్..కొరటాల క్రేజీ ప్లాన్!

నాగార్జున వర్సెస్ షారుక్ ఖాన్ బాక్సాఫీస్ గెలుపెవరిది?

మరో రికార్డు కొల్లగొట్టిన ఇరుముడి… దండయాత్ర కొనసాగిస్తున్న రవన్న!

డ్యాన్సర్స్ అసోసియేషన్లో కొత్త చర్చలు.. సుమలత గద్దె దిగబోతోందా?

మరో క్రేజీ మూవీలో ఛాన్స్ దక్కించుకున్న రాషా తడానీ.. రిలీజ్ డేట్ లాక్!

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ …మళ్ళీ థియేటర్లలోకి బ్లాక్ బస్టర్ మూవీ!

Big Stories

Advertisement
×