E-Paper
Advertisement

ఘట్టమనేని ఫ్యామిలీలో పెళ్లి సందడి…పెళ్లి పీటలు ఎక్కబోయేది ఎవరో తెలుసా ?

ఘట్టమనేని ఫ్యామిలీలో పెళ్లి సందడి…పెళ్లి పీటలు ఎక్కబోయేది ఎవరో తెలుసా ?
Advertisement

Siddharth Engagement:ఘట్టమనేని ఫ్యామిలీలో పెళ్లి సందడి మరో హీరో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు.అవును …మహేష్ బాబు కి మేనల్లుడు అయిన సిద్ధార్థ్ గల్లా త్వరలోనే పెళ్లి కొడుకు కాబోతున్నాడు.ఇక మహేష్ అక్క పద్మావతి ముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ భార్య అన్న సంగతి తెల్సిందే. అయితే సిద్ధార్థ్ గల్లా పెళ్లి చేసుకోబోయేది ఎవరినో తెలుసా…కొరియన్ భామ హాయిన్ (జిన్నీ)ని.వీరికి ఇద్దరికీ జులై 12, 2026 అంటే నిన్ననే నిశ్చితార్ధం జరిగినట్టు తెలుస్తుంది.

ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న ఎంగేజ్మెంట్ పిక్స్

Advertisement

ఇక ఈవెంట్ లో మరో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే, సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, దివంగత రమేష్ బాబు కుమార్తె భారతి ఘట్టమనేని చాలా కాలం తర్వాత పబ్లిక్ వేడుకలో కనిపించడం. లైమ్‌లైట్‌కు దూరంగా ఉండే భారతి ఈ ఫంక్షన్‌లో మెరవడంతో ఘట్టమనేని ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతూ ఆ ఫొటోలను తెగ షేర్ చేస్తున్నారు. మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఎంగేజ్మెంట్ పిక్స్ నిమిషాల్లోనే ఇంటర్నెట్‌ను ఊపేశాయి. ఘట్టమనేని ఫ్యామిలీ సిస్టర్స్ అంతా ఒకే ఫ్రేమ్‌లో కనిపించి ఈ వేడుకను మరింత కలర్‌ఫుల్‌గా మార్చేశారు.

also read :జానకమ్మ మరణంపై సుశీల సంచలన వ్యాఖ్యలు.. ఆ దుర్మార్గుల కళ్లు ఇప్పుడు చల్లబడ్డాయా?

Advertisement

ఇండస్ట్రీలో నిలబడే ప్రయత్నాలు చేస్తున్న అన్నయ్య అశోక్

ఇక సిద్ధార్థ్ గల్లా తన తండ్రి బిజినెస్ సామ్రాజ్యాన్ని చూసుకుంటుంటే అన్నయ్య అశోక్ గల్లా హీరో గా ఇండస్ట్రీలో నిలబడేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. హీరో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అశోక్ , దేవకీ నందన వాసుదేవ అనే మరో సినిమాతో కొంతకాలం క్రితమే ఆడియన్స్ ని పలకరించాడు.అయితే ఈ రెండు సినిమాలు ఆడియన్స్ ని అంతగా ఆకట్టుకోకపోవడంతో ఈసారి ఎలాగైనా వీసా(వింటారా సరదాగా )అనే మరో రొమాంటిక్ కామెడీని పట్టాలెక్కించాడు.మరి ఈ సినిమా అయినా అలరిస్తుందా లేదా చూడాలి.

ఏకంగా కొరియన్ భామకే గురిపెట్టిన అల్లుడు 

ఒకవైపు ఇంట్లో ఈ రేంజ్ గ్లోబల్ మ్యారేజ్ సెలబ్రేషన్స్ జరుగుతుంటే, మరోవైపు గ్లోబల్ స్టార్ మహేష్ బాబు వారణాసి అంటూ జక్కన్న దర్శకత్వంలో ఫ్యాన్ వరల్డ్ సినిమాని పరుగులు పెట్టిస్తున్న సంగతి తెల్సిందే.ఏది ఏమైనా మామ లాగే లోకల్ కాకుండా నా రేంజ్ ఇంటర్ నేషనల్ అంటూ ఏకంగా కొరియన్ భామకే గురిపెట్టడం విశేషం.

 

also read :‘బాస్’ రంగంలోకి దిగడంతో సీన్ రివర్స్.. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ గొడవపై బిగ్ అప్‌డేట్!

Related News

డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా రఘు మాస్టర్..

నాకే ప్లాస్టిక్ బాటిల్ ఇస్తావా?..ఫైర్ అయిన స్టార్ డైరెక్టర్..అసలేం జరిగిందంటే?

NBK 112 లో మరో కోలీవుడ్ స్టార్..కొరటాల క్రేజీ ప్లాన్!

నాగార్జున వర్సెస్ షారుక్ ఖాన్ బాక్సాఫీస్ గెలుపెవరిది?

మరో రికార్డు కొల్లగొట్టిన ఇరుముడి… దండయాత్ర కొనసాగిస్తున్న రవన్న!

డ్యాన్సర్స్ అసోసియేషన్లో కొత్త చర్చలు.. సుమలత గద్దె దిగబోతోందా?

మరో క్రేజీ మూవీలో ఛాన్స్ దక్కించుకున్న రాషా తడానీ.. రిలీజ్ డేట్ లాక్!

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ …మళ్ళీ థియేటర్లలోకి బ్లాక్ బస్టర్ మూవీ!

Big Stories

Advertisement
×