E-Paper
Advertisement

అభిమానులకు షాక్.. ఇండస్ట్రీకి దూరం కానున్న రణ్‌వీర్ సింగ్!

అభిమానులకు షాక్.. ఇండస్ట్రీకి దూరం కానున్న రణ్‌వీర్ సింగ్!
Advertisement

Ranveer Singh:ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు ఏమైంది.. నిన్నటికి నిన్న ప్రముఖ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఇండస్ట్రీకి బ్రేక్ ఇవ్వబోతోంది అంటూ వచ్చిన వార్తను అభిమానులు మరువకముందే.. ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ స్టార్ హీరోగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న రణ్‌వీర్ సింగ్ కూడా సినిమాలకు దూరం కాబోతున్నారు అనే వార్త సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. సడన్ గా సెలబ్రిటీలు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక అసలు కారణం ఏంటి? అంటూ అభిమానులు సైతం ఆరా తీస్తున్నారు. మరి రణ్‌వీర్ సింగ్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయం వెనుక అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న రణ్‌వీర్ సింగ్..

ఇటీవల ఆదిత్య ధర్ దర్శకత్వంలో ధురంధర్ 1&2 చిత్రాలు చేసి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించారు. ఈ సినిమా అటు విదేశాలలో కూడా ఊహించని రికార్డులను క్రియేట్ చేసుకుంది. తన అద్భుతమైన నటనతో అందరినీ ఈయన ఇప్పుడు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా కూడా చాలా బిజీ అయిపోయారు. ప్రస్తుతం జై మెహతా దర్శకత్వంలో ప్రళయ్ అనే సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను ఆగస్టు నెలలో ప్రారంభించనున్నారు. దీపావళి వరకు షూటింగ్ కొనసాగుతుందని , ఆ తర్వాత నవంబర్ నెల నుండి ఈయన సినిమాలకు బ్రేక్ ఇచ్చి విరామం తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇకపోతే 2027లో తిరిగి ఈ సినిమా షెడ్యూల్ ప్రారంభం అవుతుందని, అప్పటివరకు ఆయన బ్రేక్ తీసుకోబోతున్నారనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

ALSO READ:ఇండియన్ సినిమాలకు మరిన్ని ఆస్కార్స్.. అంచనాలు పెంచేసిన రాజమౌళి కొడుకు!

జాంబీ థ్రిల్లర్ గా రాబోతున్న ప్రళయ్ మూవీ..

ఇక ప్రళయ్ సినిమా విషయానికొస్తే.. ఇదొక జాంబి థ్రిల్లర్ మూవీ గా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ తరహా చిత్రంలో రణ్‌వీర్ సింగ్ నటించడం ఇదే తొలిసారి కావడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాపై ఇంకా పూర్తి విషయాలు మేకర్స్ నుండి అఫీషియల్ గా వెలువడాల్సి ఉంది. మరోవైపు రణ్‌వీర్ సింగ్ కొంతకాలం సినీ ఇండస్ట్రీకి విరామం ప్రకటించారంటూ వస్తున్న వార్తలు అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

రణ్‌వీర్ సింగ్ విరామం ఎందుకంటే?

Advertisement

ప్రముఖ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనేను వివాహం చేసుకున్న రణ్‌వీర్ సింగ్.. దశాబ్ద కాలానికి పైగా వైవాహిక జీవితంలో సంతోషంగా గడిపారు. ఇక 2024 సెప్టెంబర్ లో తొలి సంతానంగా ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. దీపిక పదుకొనే – రణ్‌వీర్ సింగ్ దంపతులు ఈ చిన్నారికి దువా అని నామకరణం కూడా చేశారు. ఇక ఇప్పుడు మరొకవైపు దీపిక రెండో బిడ్డకి కూడా జన్మనివ్వబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెన్సీ తో ఉన్న కారణంగానే ఈ సమయంలో కుటుంబంతో గడపాలి అనే ఒక ఉద్దేశంతోనే రణ్‌వీర్ సింగ్ ఇలా కాస్త సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే దీపికా డెలివరీ అయ్యే వరకు ఆమె దగ్గరే ఉండి , ఆ తర్వాత పుట్టే బిడ్డతో మరికొంత కాలం గడిపిన తర్వాత ప్రళయ్ సినిమా షూటింగ్లో ఈయన తిరిగి పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.

Related News

‘జైలర్ 2’ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

గ్లామర్ డోస్ పెంచేసిన దురంధర్ బ్యూటీ.. ఫ్యాన్స్‌కు కనువిందే!

బతుకమ్మ వేడుకల్లో లయ అందాల సందడి.. వీడియో వైరల్!

RC 17 షూటింగ్ పై సుకుమార్ బిగ్ అప్డేట్… ప్రయాణం ప్రారంభం!

బ్లూ శారీలో అదరగొట్టిన ప్రీతి ముఖుందన్.. అందం మామూలుగా లేదుగా!

మళ్లీ లాయర్‌గా కీర్తి సురేష్.. ఈసారి అయినా హిట్ కొడుతుందా?

చిరుత హీరోయిన్ అందాల విందు.. ఇన్‌స్టాలో హాట్ టాపిక్!

హైందవ టీజర్ రిలీజ్…విగ్రహాల చోరీ వెనుక రహస్యం ఏంటీ!

Big Stories

Advertisement
×