E-Paper
Advertisement

ప్రియుడితో సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్!

ప్రియుడితో సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్!
Advertisement

Tollywood:ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు చడీచప్పుడు లేకుండా నిశ్చితార్థం చేసుకోవడం లేదా పెళ్లిళ్లు చేసుకోవడం లాంటివి చేస్తున్నారు. అంతేకాదు పెళ్లి జరిగిన కొన్ని రోజుల వరకు ఆ విషయాన్ని అభిమానులతో పంచుకోకుండా.. సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ సడన్గా ఆ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు ఇలా సడన్గా పెళ్లి చేసుకుని షాక్ ఇవ్వగా.. ఇప్పుడు మరొక బ్యూటీ సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకొని అభిమానులను సర్ప్రైజ్ చేసింది. ఆమె ఎవరో కాదు బ్రిగిడా సాగా.. తమిళ సీరియల్స్ , సినిమాలలో నటిస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ఈమె తెలుగులో కూడా నటించింది.

సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకున్న బ్రిగిడా సాగా..

సింధూరం, పెదకాపు సినిమాల ద్వారా తెలుగు ఆడియన్స్ కు దగ్గర అయింది. అలాంటి ఈమె తాజాగా తన చిన్ననాటి స్నేహితుడు, నటుడు అనంత్ రామ్ తో గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు.. ఇటీవల అనంత్ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సడన్గా అనంత్ రామ్ తో బ్రిగిడా సాగా నిశ్చితార్థం చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మొత్తానికైతే బ్రిగిడా సాగా నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు , సెలబ్రిటీలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

కొన్ని ప్రేమకథలు తెర కోసం మాత్రమే రాయబడవు..

Advertisement

ఇదిలా ఉండగా మొన్నటికి మొన్న తన బాయ్ఫ్రెండ్ ను పరిచయం చేస్తూ ఒక పెద్ద కొటేషన్ పంచుకుంది ఈ ముద్దుగుమ్మ.. తన బాయ్ ఫ్రెండ్ తో ది కలసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ.. చిన్నప్పుడు అందమైన ప్రేమ కథలు కేవలం సినిమాలలోనే ఉంటాయని నమ్మేదాన్ని. సినిమా పూర్తయి తెరపై పేర్లు పడిపోయిన తర్వాత కూడా ఆ కథలు అలాగే మనసులో నిలిచిపోయేవి. కానీ లైఫ్ మరోలా ప్లాన్ చేస్తుంది. సినిమా రంగంలో నా ప్రయాణంలో నాలాంటి కలనే కంటూ దానిని అంతే గౌరవించే ఒక వ్యక్తి నాకు పరిచయమయ్యాడు. ముఖ్యంగా అతను నాకు భాగస్వామిగా మారకముందే బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడు. అత్యంత అందమైన ప్రేమ కథలు ఎప్పుడూ కేవలం తెర కోసం మాత్రమే రాయబడవు అని నాకు గుర్తు చేసినందుకు చాలా ధన్యవాదాలు.

నా ప్రపంచంలోకి నాలాగే ఆలోచించే వ్యక్తి వచ్చారు..

అవి నిజజీవితంలో కూడా కొన్నిసార్లు చాలా అందంగా సాగుతాయి. ఇదిగో మా ప్రపంచంలోని ఒక చిన్న భాగం మీకోసం. మేము ఎప్పుడు ఐ లవ్ యు అని చెప్పుకోలేదు. ఆ ప్రయాణంలో ఎక్కడో ఒకచోట ఆ మాటలు మరోలా మారిపోయాయి.. ఇక ఈరోజు మా ప్రపంచంలోనే ఆ చిన్న భాగాన్ని మీతో పంచుకుంటున్నా” అంటూ ఒక ఎమోషనల్ కామెంట్ షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక మొత్తానికి అయితే అనంత్ రామ్ తో చాలా రొమాంటిక్ గా కలిసి దిగిన ఫోటోలను ఈ ముద్దుగుమ్మ.. తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసింది. మొత్తానికైతే నిశ్చితార్థం చేసుకొని సడన్ సర్ప్రైజ్ ఇచ్చిన ఈమె..ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతుందో చూడాలి.

Advertisement

ALSO READ:హీరోగా ఎంట్రీ ఇస్తున్న సీఎం వారసుడు.. ఆ స్థానాన్ని భర్తీ చేస్తాడా?

 

Related News

‘జైలర్ 2’ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

గ్లామర్ డోస్ పెంచేసిన దురంధర్ బ్యూటీ.. ఫ్యాన్స్‌కు కనువిందే!

బతుకమ్మ వేడుకల్లో లయ అందాల సందడి.. వీడియో వైరల్!

RC 17 షూటింగ్ పై సుకుమార్ బిగ్ అప్డేట్… ప్రయాణం ప్రారంభం!

బ్లూ శారీలో అదరగొట్టిన ప్రీతి ముఖుందన్.. అందం మామూలుగా లేదుగా!

మళ్లీ లాయర్‌గా కీర్తి సురేష్.. ఈసారి అయినా హిట్ కొడుతుందా?

చిరుత హీరోయిన్ అందాల విందు.. ఇన్‌స్టాలో హాట్ టాపిక్!

హైందవ టీజర్ రిలీజ్…విగ్రహాల చోరీ వెనుక రహస్యం ఏంటీ!

Big Stories

Advertisement
×