E-Paper
Advertisement

తనకంటే 16 ఏళ్ల చిన్నమ్మాయితో పెళ్లి.. సోషల్ మీడియా ట్రోల్స్ పై మ్యూజిక్ డైరెక్టర్ ఆవేదన!

తనకంటే 16 ఏళ్ల చిన్నమ్మాయితో పెళ్లి.. సోషల్ మీడియా ట్రోల్స్ పై మ్యూజిక్ డైరెక్టర్ ఆవేదన!
Advertisement

Tollywood: సాధారణంగా ఒక సినిమాలో హీరో హీరోయిన్ మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉంటే సోషల్ మీడియాలో ట్రోల్స్ రావడం సహజమే.. అలాంటిది నిజజీవితంలో సెలబ్రిటీల మధ్య ఏజ్ గ్యాప్ ఉంటే ఇక ట్రోలర్స్ ఆగుతారా? తమదైన స్టైల్ లో థంబ్ నెయిల్స్ పెట్టి మరీ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేస్తారు. అయితే ఈ ట్రోల్స్ పై కొంతమంది సెలబ్రిటీలు సైలెంట్ గా ఉంటే.. మరికొంతమంది తమదైన శైలిలో స్పందిస్తూ కౌంటర్ ఇస్తూ ఉంటారు . ఈ క్రమంలోనే ఒక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ 50 ఏళ్ల వయసులో తనకంటే వయసులో 16 ఏళ్ల చిన్నదైన ఒక సింగర్ ను వివాహం చేసుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. ఎక్కడ చూసినా వీరి ఫోటోలనే సోషల్ మీడియాలో షేర్ చేస్తూ విపరీతమైన ట్రోల్స్ , కామెంట్లు చేశారు. దీంతో ఆవేదన వ్యక్తం చేసిన ఆ మ్యూజిక్ డైరెక్టర్.. తన బాధను సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరుస్తూ తనపై ట్రోల్స్ చేస్తున్న వారికి గట్టి కౌంటర్ ఇచ్చారు.

వయసు తేడాపై సోషల్ మీడియాలో ట్రోల్స్..

ఆయన ఎవరో కాదు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ , సింగర్ రఘు దీక్షిత్. టాలీవుడ్ లో సన్నాఫ్ సత్యమూర్తి, జనతా గ్యారేజ్, శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో, కృష్ణార్జున యుద్ధం, తొలిప్రేమ అంటూ పలు చిత్రాలలో పాటలు పాడిన రఘు దీక్షిత్ గత ఏడాది అక్టోబర్లో 50 సంవత్సరాల వయసులో ప్రముఖ గాయని వరిజా శ్రీ వేణుగోపాల్ ను వివాహం చేసుకున్నారు. వివాహ సమయంలో వీరిద్దరి మధ్య 16 సంవత్సరాల వయసు తేడా ఉండడంతో విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు వాటిపై ఆయన స్పందిస్తూ కొన్ని కామెంట్స్ తనను మానసికంగా ఎంతో బాధించాయి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

ALSO READ:జానీ మాస్టర్ Vs శేఖర్ మాస్టర్.. వాగ్వాదంపై స్పందించిన జానీ!

సంతోషకరమైన జీవితానికి ఏజ్ సమస్య కాదు..

“మేము పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి మాకు సంబంధించిన ప్రతి విషయంలో కూడా ఇలా ఎన్నో అభిప్రాయాలు వస్తాయని ముందే తెలుసు. నిజం చెప్పాలంటే కొన్ని కామెంట్స్ మాత్రం మానసికంగా మరింత బాధను కలిగిస్తాయి. అయితే సంతోషకరమైన జీవితానికి కూడా చిన్న రహస్యం ఉంది. ఇంటర్నెట్లో వచ్చే ప్రతి కామెంట్ ను సీరియస్గా తీసుకోకూడదు. ముఖ్యంగా ఫ్యామిలీ , ఫ్రెండ్స్, నిజమైన అభిమానుల ప్రేమాభిమానాలే నాకు ముఖ్యం”.. అంటూ తనపై వచ్చిన ట్రోల్స్ కి గట్టి కౌంటర్ ఇచ్చారు రఘు దీక్షిత్.

ఆమె గాయని మాత్రమే కాదు వ్యక్తిత్వం ఉన్న మహిళ కూడా..

Advertisement

ఇంకా తమ బంధం గురించి ఆయన మాట్లాడుతూ.. “మేమిద్దరం చాలాకాలంగా మంచి స్నేహితులం. ప్రేమ అనేది ఒక విచిత్రమైన అనుభూతి.. ఇద్దరి మధ్య ఎప్పుడు ఎలా కలుగుతుందో చెప్పలేము. ఇక మేము పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు అది సహజంగానే జరిగిపోయింది. మా వైవాహిక జీవితం సంగీతానికే పరిమితం కాలేదు. ఇద్దరం కలిసి నవ్వుకుంటాం .. సంగీతం కంపోజ్ చేస్తాం.. వెకేషన్ కి వెళ్తాం.. ఇవే మా బంధాన్ని మరింత బలపరుస్తాయి. ఆమె సింగర్ మాత్రమే కాదు గొప్ప వ్యక్తిత్వం కలిగిన మనిషి కూడా” అంటూ తన భార్యపై ప్రశంసలు కురిపించారు రఘు దీక్షిత్. మొత్తానికైతే రఘు దీక్షిత్ అన్నింటికీ క్లారిటీ ఇచ్చారని చెప్పవచ్చు.

Related News

ప్రేమలో ఫెయిల్ అయ్యారా? అయితే రమ్యకృష్ణ ‘సెకండ్ లవ్’ చూడాల్సిందే..

ఘట్టమనేని ఫ్యామిలీలో పెళ్లి సందడి…పెళ్లి పీటలు ఎక్కబోయేది ఎవరో తెలుసా ?

జానీ మాస్టర్ Vs శేఖర్ మాస్టర్.. వాగ్వాదంపై స్పందించిన జానీ!

గతాన్ని డిలీట్ చేయొచ్చు.. ప్రేమని కాదా? హాలీవుడ్ రేంజ్ కాన్సెప్ట్‌తో వస్తున్న అక్షర హాసన్ ‘సిమ్యులాక్రా’!

‘బాస్’ రంగంలోకి దిగడంతో సీన్ రివర్స్.. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ గొడవపై బిగ్ అప్‌డేట్!

గోవిందాకు 50 అఫైర్స్ ? బాలీవుడ్‌ను షేక్ చేస్తున్న స్టార్ వైఫ్ కామెంట్స్!

అడుక్కుతింటాను కానీ అతనితో నటించను.. స్టార్ హీరోయిన్ సంచలన స్టేట్మెంట్!

Big Stories

Advertisement
×