Mowgli Glimpse: సందీప్ రాజ్ దర్శకత్వంలో రోషన్ కనకాల నటించిన సినిమా మొగ్లీ. ఈ సినిమా మీద మొదలైనప్పటి నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తుంది. కలర్ ఫోటో సినిమా తర్వాత సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది.
ఈ సినిమాలో బండి సరోజ్ కుమార్ ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. బండి సరోజ్ కుమార్ గురించి ప్రత్యేకించి పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. యూట్యూబ్లో తన సినిమాలకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలానే అప్పట్లో బండి సరోజ్ కుమార్ యూట్యూబ్ వీడియోలు సంచలనం అని చెప్పాలి.
గతేడాది పరాక్రమం అనే సినిమాతో ఫ్రాక్షకులు ముందుకు వచ్చాడు. ఆ సినిమాకి సరైన థియేటర్స్ దొరకలేదు. కానీ చూసిన వాళ్లు కొంతమంది మాత్రం ఆ సినిమా గురించి మంచి మాటలే చెప్పారు. మొత్తానికి సోషల్ మీడియాలో ఉన్న తెలుగు యువతకు బండి సరోజ్ కుమార్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.
మొగ్లీ నటుడు వార్నింగ్
బండి సరోజ్ కుమార్ మొగ్లీ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ వీడియో కొద్దిసేపటి క్రితం విడుదలైంది. కానీ కామెంట్స్ లో ఎక్కువగా బండి సరోజ్ కుమార్ పేరు వినిపిస్తుంది. అయితే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సరోజ్ పైన వచ్చే కామెంట్స్ డిలీట్ చేస్తున్నారు.ఇప్పుడు సరోజ్ ట్విట్టర్ వేదికగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అడ్మిన్స్ కు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. సినిమా కాన్సెప్ట్ బాగుంది అని నేను సైన్ చేశాను. అంతేకానీ ఇంకోలా కాదు. కొన్ని కామెంట్స్ డిలీట్ చేస్తున్నారని స్క్రీన్ షాట్స్ తో నా అభిమానులు నాకు మెసేజ్ లు పెడుతున్నారు. అంటూ ట్వీట్ చేశాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీని మెన్షన్ చేశాడు. దీనిపై పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి.
సరోజ్ తగ్గడు
ఇలాంటి విషయాల్లో సరోజ్ అసలు తగ్గడు. గతంలో కూడా తన సూర్యాస్తమయం సినిమాను కొంతమంది జబర్దస్త్ ఆర్టిస్టులతో ప్రమోషన్స్ చేయించారు అని బాగా ఫైర్ అయ్యాడు. దానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి. అయితే సరోజ్ మైండ్ సెట్ దృష్టిలో పెట్టుకొని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ జాగ్రత్త పడనుందా.? ఈ విషయంలో దర్శకుడు సందీప్ రాజ్ కు అయితే ఒక క్లారిటీ ఉంటుంది. సరోజ్ గురించి బాగా తెలిసిన తర్వాతనే ఆ క్యారెక్టర్ కోసం తనని సంప్రదించి ఉంటాడు. మరోవైపు సరోజ్ కూడా ఈ సినిమా తర్వాత వేరే వాళ్ళు దర్శకత్వంలో చేయను అని క్లారిటీ కూడా ఇచ్చాడు.
Also Read: Mowgli Glimpse : మోగ్లీ బంగారు ప్రేమ కథ… సుమ కొడుకు బానే కష్టపడ్డాడు