OTT Movie : మలయాళ సినిమాలకు ఫాలోయింగ్ బాగా పెరుగుతోంది. ఈ ఇండస్ట్రీ నుంచి వస్తున్న థ్రిల్లర్ సినిమాల కోసం ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. ఒక్కసారి ఈ సినిమాలపై ఓ లుక్ వేస్తే గాని ఆడియన్స్ కి మనసు కుదుట పడట్లేదు. ఈ నేపధ్యంలో ఒక మలయాళ ఫౌండ్-ఫుటేజ్ థ్రిల్లర్ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది. ఈ సినిమాలో మంజు వారియర్ ప్రధాన పాత్రలో నటించారు. ఆమె ఈ సినిమాలో సైలెంట్ గా ఉంటూ, వైలెంట్ పనులు చేస్తుంటుంది. సీట్ ఎడ్జ్ థ్రిల్ పక్కా ఉంటుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో ఉంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …
ఎందులో స్ట్రీమింగ్ అంటే
‘ఫుటేజ్’ (Footage) 2024లో విడుదలైన మలయాళ ఫౌండ్-ఫుటేజ్ థ్రిల్లర్ చిత్రం. సైజు శ్రీధరన్ డైరెక్ట్ చేసిన తొలి చిత్రం. ఇందులో మంజు వారియర్, విశాక్ నాయర్, గాయత్రి అశోక్ ప్రధాన పాత్రల్లో నటించారు. మూవీ బకెట్, పేల్ బ్లూ డాట్ ఫిల్మ్స్, కాస్ట్ ఎన్ కో బ్యానర్లపై బినీష్ చంద్రన్, సైజు శ్రీధరన్ దీనిని నిర్మించారు. 2024 ఆగస్ట్ 23న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, 2025 సెప్టెంబర్ 5 నుంచి Sun NXT లో స్ట్రీమింగ్ కానుంది.
కథలోకి వెళ్తే
విశాక్, గాయత్రి ఒక యూట్యూబ్ వ్లాగర్ జంట. కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో తమ రోజువారీ జీవితాన్ని, సరదా వ్లాగ్‌లను రికార్డ్ చేస్తూ, వింత ప్రదేశాలు, వ్యక్తుల గురించి వీడియోలు చేస్తారు. ఒకసారి వీళ్లు తమ అపార్ట్‌మెంట్‌లో ఉంటూ, పనిమనిషి ద్వారా తెలిసిన ఒక మూగ పొరుగు మహిళను రహస్యంగా ఫాలో చేస్తారు. ఆమె వింత ప్రవర్తన, రాత్రిపూట బయటకు వెళ్లడం వంటివి చూసిన తరువాత ఆమె గురించి తెలుసుకోవాలనే ఆసక్తి మరింత పెరుగుతుంది. ఒక రోజు ఆమెను ఫాలో అవుతూ ఒక అడవిలోని ఒక ఇంటికి వెళతారు. అక్కడ వీళ్ల కెమెరాలు ఊహించని రహస్యాలను రికార్డ్ చేస్తాయి. ఫస్ట్ హాఫ్ వీళ్ల వ్లాగింగ్, రొమాంటిక్ మూమెంట్స్, కెమెరా పర్స్‌పెక్టివ్‌తో సాగుతూ, ఫౌండ్-ఫుటేజ్ స్టైల్‌లో టెన్షన్‌ను పెంచుతుంది. అడవిలోని వాతావరణం, వర్షం, గాలి సౌండ్స్ వణుకు పుట్టిస్తాయి.
సెకండ్ హాఫ్‌లో, కథ గాయత్రి కెమెరా పర్స్‌పెక్టివ్‌కు మారి, ఫస్ట్ హాఫ్ గ్యాప్‌లను ఫిల్ చేస్తూ, మంజు వారియర్ పాత్ర గురించి సీక్రెట్స్ బయటపెడుతుంది. వీళ్లు ఆమె అపార్ట్‌మెంట్‌లోకి చొరబడి, ఆమె డైరీని చదివి, ఆమె గతంలోని ఒక విషాద సంఘటన గురించి తెలుసుకుంటారు. ఇది ఆమె మూగగా ఉండటానికి, రివేంజ్ తీర్చుకోవడానికి కారణమవుతుంది. అయితే వీళ్ల అత్యుత్సాహం వీళ్లను ప్రమాదంలో పడేస్తుంది. ఇక క్లైమాక్స్ ఎప్పటిలాగే షాకింగ్ ట్విస్టులతో అదరగొడుతుంది. ఈ క్లైమాక్స్ ట్విస్ట్ ఏమిటి ? ఆ మూగ మహిళ గతం ఏమిటి ? యూట్యూబ్ జంట ఎదుర్కునే సమస్యలు ఏమిటి ? ఇందులో క్రైమ్ సీన్స్ ఎలా ఉంటాయి ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాని మిస్ కాకుండా చుడండి.
Read Also : ఇంట్లోనే శవమై కన్పించే జడ్జ్… ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్… ఊహించని మలుపులున్న ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్