BigTV English

OG: ఓజీపై తమన్ బిగ్ అప్డేట్.. గూస్ బంప్స్ గ్యారెంటీ అంటూ!

OG: ఓజీపై తమన్ బిగ్ అప్డేట్.. గూస్ బంప్స్ గ్యారెంటీ అంటూ!

OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఈ మధ్యకాలంలో ఒకవైపు సినిమాలు.. మరొకవైపు అధికారం అంటూ బిజీగా మారిపోయిన విషయం తెలిసిందే. పదేళ్ల నిర్విరామ శ్రమ తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్ కి డీసీఎంగా బాధ్యతలు చేపట్టారు.. అలా ఒకవైపు అధికారంలో చలామణి అవుతున్న ఈయన.. మరొకవైపు అభిమానులను అలరించడానికి వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ‘హరిహర వీరమల్లు’, ‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అంటూ మూడు సినిమాలు ప్రకటించారు.. ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు యూత్ ను ఆకట్టుకునేలా అద్భుతమైన మాస్ యాక్షన్ పర్ఫామెన్స్ తో ‘ఓజీ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.


ఓజీ సినిమాపై తమన్ బిగ్ అప్డేట్..

ప్రముఖ డైరెక్టర్ సుజీత్ (Sujith)దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka Arul Mohan) హీరోయిన్ గా నటిస్తోంది. సెప్టెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు పెంచడానికి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.తమన్(S Thaman) ఒక బిగ్ అప్డేట్ ఇచ్చారు.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన మాట్లాడుతూ.. ఓజీ నుండీ పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా విడుదలైన గ్లింప్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ పాట మొత్తం 4 నిమిషాల 14 సెకండ్లు ఉంటుంది.. అదిరిపోయే బిజీఎంతో థియేటర్లలో కలుద్దాం అంటూ తమన్ కామెంట్ చేశారు. మొత్తానికైతే ఇప్పుడు ఈ సినిమాపై ఊహించని విధంగా అప్డేట్స్ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు. అసలే బర్తడే సందర్భంగా రిలీజ్ అయిన గ్లింప్స్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి అభిమానులు ఫిదా అయిపోయారు . ఇప్పుడు ఈ పాట నాలుగు నిమిషాల నిడివి ఉంటుందని చెప్పడంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి.

ఓజీ సినిమా విశేషాలు..


ఓజీ సినిమా విషయానికి వస్తే.. ప్రముఖ నిర్మాత డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో శ్రియా రెడ్డి , ప్రకాష్ రాజ్, ఇమ్రాన్ హస్మి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారని చెప్పవచ్చు.

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విశేషాలు..

ఇక మరొకవైపు పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఈ సినిమా చేస్తున్నారు. ఇందులో యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ప్రముఖ హీరోయిన్ రాశి ఖన్నా కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇక ఈ సినిమాలో కూడా ఒక స్పెషల్ నెంబర్ ను హరీష్ శంకర్ చాలా అద్భుతంగా డిజైన్ చేయబోతున్నట్లు సమాచారం. ఇందులో అశుతోష్ రాణా, సాక్షి వైద్య, కౌశిక్ మెహతా, కేఎస్ రవికుమార్, నవాబ్ షా, బి ఎస్ అవినాష్, మాగంటి శ్రీనాథ్, కేశవ దీపక్, టెంపర్ వంశీ, రామ్కీ ,చమ్మక్ చంద్ర, నాగమహేష్, పంకజ్ కేసరి, నర్రా శ్రీను తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తూ ఉండగా.. ఆనంద్ సాయి ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేస్తున్నారు.

ALSO READ :Rudramadevi: గోన గన్నారెడ్డిపై ఆశలు పెట్టుకున్న ఎన్టీఆర్, మహేష్.. మరి బన్నీతో ఎలా?

Related News

Boney Kapoor: ‘శివగామి‘ పాత్ర వివాదం.. శ్రీదేవిని అవమానపరిచారు.. పెదవి విప్పిన బోనీ కపూర్

Rudramadevi: గోన గన్నారెడ్డిపై ఆశలు పెట్టుకున్న ఎన్టీఆర్, మహేష్.. మరి బన్నీతో ఎలా?

Lokesh Kanagaraju : లోకేష్‌ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో… కూలీనే కూనీ చూసింది ?

Little hearts: రిలీజ్ అయిన ఒక్క రోజులోనే… రికార్డు క్రియేట్ చేసిన లిటిల్ హార్ట్స్!

Spirit: షూటింగ్ మొదలు కాలేదు.. అప్పుడే 70 శాతం పూర్తి అంటున్న డైరెక్టర్!

Big Stories

×