OTT Movie : ఒకప్పుడు కథల రూపంలో దెయ్యాలను ఊహించుకునే వాళ్ళు. ఇప్పడు సినిమాల ద్వారా దెయ్యాలు ఇలా కూడా ఉంటాయా అని అనుకుంటున్నాం. వీటి గురించి ఎవరి నమ్మకం వాళ్ళది. కొంత మంది ఉన్నాయని వాదిస్తుంటారు. మరికొంత మంది వీటి గురించి అస్సలు నమ్మరు. ఏది ఏమైనా చీకటి అంటే అందరూ భయపడుతుంటారు. ఇది ఒక వింతలా అనిపిస్తుంటుంది. అయితే ఈ నేపథ్యంలో ఒక దెయ్యం గురించి చెప్పుకుందాం. ఈ సినిమాలో ఒక నెక్లెస్ లో ఉండే ఆత్మ, ఒక ఫ్యామిలీ ఇంటికి చేరుకుంటుంది. ఆ తరువాత స్టోరీ అందరికీ వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? స్టోరీ ఏమిటి ? ఎందులో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..
1960లలో డేవిస్ కుటుంబం కష్టకాలంలో ఉంటుంది. లారా తన భర్త ఫ్రాంక్ ఆల్కహాల్ కారణంగా, అతనితో విసిగిపోయి ఉంటుంది. కోపంతో అతన్ని ఇంటి నుండి బయటకు గెంటేస్తుంది. ఆ తరువాత లారా నర్సుగా ఉద్యోగానికి వెళ్తుంది. దీన్ని ఆమె కూతుళ్లు 11 ఏళ్ల ఎల్లెన్, 16 ఏళ్ల జూడీ అలాగే ఫ్రాంక్ కూడా ఇష్టపడరు. లారాను తిరిగి దక్కించుకోవడానికి ఫ్రాంక్ ప్రయత్నిస్తాడు. పోలీస్ స్టేషన్‌లో 1938 నాటి ఒక బ్యాగ్‌లో దొరికిన అందమైన యాంటీక్ నెక్లెస్‌ను ఆమెకు బహుమతిగా ఇస్తాడు. లారా దాన్ని తీసుకోవడానికి ఇష్టపడకపోయినా, ఫ్రాంక్ ఆ నెక్లెస్‌ను ఇంట్లో వదిలివెళ్తాడు. అయితే ఈ నెక్లెస్ ఒక సైకో బాలుడి ఆత్మకు కేంద్రంగా ఉంటుంది. ఈ విషయం ఎవరికీ తెలీకుండానే, లారా ఆమె కూతుళ్లను భయంకర ప్రమాదంలోకి నెట్టివేస్తుంది. ఎల్లెన్, జూడీలు వింత దృశ్యాలు, భయంకరమైన శబ్దాలు, ఆత్మ దాడులను ఎదుర్కొంటారు.
జూడీ నెక్లెస్‌ను ధరించడం ద్వారా ఆత్మ ప్రభావానికి లోనవుతుంది. ఆమె ప్రవర్తన అసాధారణంగా మారుతుంది. లారా, ఎల్లెన్ ఈ ఆత్మ గురించి తెలుసుకోవడానికి ఒక స్పిరిచ్యువల్ బీట్రిస్ సహాయం తీసుకుంటారు. ఫ్లాష్‌బ్యాక్‌ల ద్వారా ఆ నెక్లెస్ 1938లో ఒక హత్య కేసుతో ముడిపడి ఉందని, ఒక బాలుడి ఆత్మ దానిలో బంధించబడిందని తెలుస్తుంది. బీట్రిస్ ఒక రిచ్యువల్ ద్వారా ఆత్మను శాంతింపజేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆత్మ జూడీని పూర్తిగా ఆవహిస్తుంది. లారాపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. క్లైమాక్స్‌లో, ఎల్లెన్, లారా కలిసి నెక్లెస్‌ను నాశనం చేయడానికి ప్రయత్నిస్తారు. ఇక ఈ క్లైమాక్స్ ఊహించని మలుపులు తీసుకుంటుంది. ఆ ఆత్మ వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి ? ఈ కుటుంబం తిరిగి కలిసిందా? ఆ ఆత్మ గతం ఏమిటి ? అనే ప్రశ్నలకి సమాధానాలను ఈ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.
‘ది కర్స్ ఆఫ్ ది నెక్లెస్’ (The Curse of the Necklace) 2024లో విడుదలైన అమెరికన్ సూపర్ నాచురల్ హారర్ చిత్రం. జువాన్ దర్శకత్వంలో, వైలెట్ మెక్‌గ్రా (ఎల్లెన్), మడలీన్ మెక్‌గ్రా (జూడీ), సారా లిండ్ (లారా), హెన్రీ థామస్ (ఫ్రాంక్), రోమా మఫియా (బీట్రిస్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 2024 సెప్టెంబర్ 27న థియేటర్లలో 1 గంట 35 నిమిషాల రన్‌టైమ్‌తో IMDbలో 4.5/10 రేటింగ్ పొందింది. ఈ సినిమా టూబీ, ప్రస్తుతం ప్రైమ్ వీడియో, ఫాండాంగో ఎట్ హోమ్, ఆపిల్ టీవీలో ఇంగ్లీష్ ఆడియోతో, తెలుగు, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది.
Read Also : డ్రైనేజీ దగ్గర డెడ్ బాడీ… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్… స్పైన్ చిల్లింగ్ మలయాళ మర్డర్ మిస్టరీ