E-Paper
Advertisement

Sandya Theatre stampade: సంధ్య థియేటర్ తొక్కిసలాట..ఛార్జ్ షీట్ తిరస్కరించిన కోర్టు..ఏమైందంటే?

Sandya Theatre stampade: సంధ్య థియేటర్ తొక్కిసలాట..ఛార్జ్ షీట్  తిరస్కరించిన కోర్టు..ఏమైందంటే?
Advertisement

Sandya Theatre stampade: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అల్లు అర్జున్ (Allu Arjun)సుకుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప 2(Pushpa 2) సినిమా విడుదల సమయంలో సంధ్య థియేటర్ వద్ద ఈ తొక్కిసలాట ఘటన జరిగింది .ఇందులో భాగంగా రేవతి అనే ఒక మహిళ అభిమాని మరణించిన సంగతి తెలిసిందే. ఈమె మరణించడమే కాకుండా తన కుమారుడు శ్రీ తేజ్ తీవ్రమైన గాయాలు పాలయ్యారు. ఇప్పటికి ఈ చిన్నారి ఆరోగ్యం కోలుకోలేదని చెప్పాలి అయితే ఈ చిన్నారి ఆరోగ్యానికి సంబంధించిన అన్ని ఖర్చులను అల్లు అర్జున్ భరిస్తున్నారు.

23 మందిపై చార్జ్ షీట్ దాఖలు..

ఇక సంధ్య థియేటర్ తొక్కిసలాట (Sandya Theatre stampade)ఘటనలో భాగంగా అల్లు అర్జున్ ఏకంగా జైలుకు కూడా వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా జైలుకు వెళ్లిన ఈయన బెయిల్ మీద బయటకు వచ్చారు.. అల్లు అర్జున్ బయటకు వచ్చినప్పటికీ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన పై ఇంకా కోర్టులో కేసు నడుస్తూనే ఉంది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న చిక్కడపల్లి పోలీసులు కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఛార్జ్ షీట్ లో భాగంగా మొత్తం 23 మందిపై అభియోగాలు మోపారు. ఇందులో అల్లు అర్జున్ పేరు కూడా ఉండటం విశేషం. ఈయనతో పాటు తన వ్యక్తిగత సిబ్బంది బౌన్సర్ల పేర్లను కూడా చేర్చారు.

ఛార్జ్ షీట్ రిజెక్ట్ చేసిన నాంపల్లి కోర్టు..

Advertisement

ఇలా చిక్కడపల్లి పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేయడంతో కోర్టు ఈ చార్జ్ షీట్ తీరస్కరిస్తూ వస్తుంది. ఇప్పటికే రెండుసార్లు ఈ ఛార్జ్ షీట్ తిరస్కరించగా మరోసారి కూడా ఈ ఛార్జ్ షీట్ ను తిరస్కరించింది. చిక్కడపల్లి పోలీసులు దాఖలు చేసిన ఈ చార్జ్ షీట్ లో లోపాలు ఉన్నట్టు కోర్టు గుర్తించింది. ఇలా లోపాలు ఉన్న నేపథ్యంలోనే తిరస్కరణకు గురైందని తెలుస్తోంది. పోలీసులు సమర్పించిన ఈ చార్జ్ షీట్ లో సరైన ఆధారాలు, సాక్షాలు సాంకేతిక లోపాలు ఉన్నట్లు కోర్ట్ గుర్తించింది. అదేవిధంగా ఎవిడెన్స్ మెటీరియల్స్ (హార్డ్ డిస్క్ లు, పెన్ డ్రైవ్ లాంటివి సమర్పించకపోవడంతోనే ఈ చార్జర్ షీట్ తిరస్కరించారు. అయితే పోలీసులు సరైన ఆధారాలతో ఈ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై మరోసారి నాంపల్లి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.

A 11గా అల్లు అర్జున్…

Advertisement

ఇక పోలీసులు సమర్పించిన ఈ చార్జ్ షీట్ లో భాగంగా అల్లు అర్జున్ పేరును A 11గా చేర్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ తొక్కిసలాట ఘటన 2024 డిసెంబర్4 వ తేదీ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. పుష్ప 2 సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్న నేపథ్యంలో అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు అయితే అదే సమయంలోనే అల్లు అర్జున్ కూడా సంధ్య థియేటర్ వద్దకు రావడంతో అతనిని చూడటం కోసం అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డారు . దీంతో తొక్కిసలాట ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక మహిళ అభిమాని మరణించడంతోనే అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. ఇక థియేటర్ యాజమాన్యం భద్రత లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని కూడా తెలుస్తుంది.

Also Read: Rajinikanth -Kamal Hassan: రజిని కమల్ మూవీ నుంచి బిగ్ అప్డేట్.. ప్రోమో ముహూర్తం పిక్స్!

Related News

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

Big Stories

Advertisement
×