Mohan Lal: మలయాళ సినీ నటుడు మోహన్ లాల్(Mohanlal) గత నాలుగు దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలు చేస్తూ నటుడిగా మంచి గుర్తింపు పొందారు. ఇలా ఈయన మలయాళ చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా నటుడిగా ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటిస్తూ ఇండస్ట్రీకి ఈయన చేసిన సేవలను గుర్తిస్తూ ఇటీవల భారత ప్రభుత్వం మోహన్ లాల్ కు దాదాసాహెబ్ ఫాల్కే(Dadasaheb Phalke) అవార్డును అందజేసిన సంగతి తెలిసిందే. ఇటీవల భారత ప్రభుత్వం ప్రకటించిన 71వ జాతీయ చిత్ర ప్రధానోత్సవ కార్యక్రమాలలో భాగంగా ఈయన రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
ఈ విధంగా మోహన్ లాల్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు అయితే తాజాగా ఈయన మరొక గౌరవాన్ని అందుకున్నారు. మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన ఆర్మీ చీఫ్ తో ఈయన సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి మోహన్ లాల్ లెఫ్టినెంట్ కల్నల్ మోహన్ లాల్ హోదాలో హాజరయ్యారు. ఈ విధంగా మోహన్ లాల్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది చేతుల మీదుగా ఈయన సీవోఏఎస్ కమెండేషన్ (COAF Comendation)పురస్కారాన్ని అందుకున్నారు. అనంతరం ఆయనతో కలిసి దిగిన ఫోటోని తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ తన సంతోషాన్ని వ్యక్తపరిచారు.
” నేడు ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, PVSM, AVSM, నన్ను ఆర్మీ ప్రధాన కార్యాలయానికి పిలిచే గౌరవం లభించింది. ఈ ప్రధాన కార్యాలయంలో భాగంగా ఏడుగురు ఆర్మీ కమాండర్ల సమక్షంలో సీవోఏఎస్ పురస్కారం లభించింది.గౌరవ లెఫ్టినెంట్ కల్నల్‌గా ఈ గుర్తింపు పొందడం ఎంతో గర్వంతో అలాగే కృతజ్ఞతతో కూడిన క్షణం అని తెలిపారు.. నేను అందుకున్న ఈ గౌరవం వారి మద్దతు కోసం జనరల్ ఉపేంద్ర ద్వివేదికి, మొత్తం భారత సైన్యానికి మరియు నా మాతృ టెరిటోరియల్ ఆర్మీ యూనిట్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను “అంటూ తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరిచారు.
Today, I had the honour of being called by the Chief of the Army Staff, General Upendra Dwivedi, PVSM, AVSM, to the Army Headquarters, where I was awarded the COAS Commendation Card in the presence of seven Army Commanders.
Receiving this recognition as an Honorary Lieutenant… pic.twitter.com/0E4SuJIxLg— Mohanlal (@Mohanlal) October 7, 2025
ఇలా తమ అభిమాన నటుడు మోహన్ లాల్ కు ఈ పురస్కారం లభించిన నేపథ్యంలో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఈయనకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇక మోహన్ లాల్ ఇప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక మోహన్లాల్ కు తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. జనతా గ్యారేజ్ సినిమా ద్వారా తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకున్న మోహన్ లాల్ ఈ సినిమా తర్వాత ఆయన నటించిన మలయాళ సినిమాలను కూడా తెలుగులో విడుదల చేస్తున్నారు. ఇక ఇటీవల మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్ప సినిమాలో కూడా కీలకపాత్రలో మోహన్ లాల్ నటించి సందడి చేసిన సంగతి తెలిసిందే.
Also Read: Allari Naresh: పాములకు భయపడి బ్లాక్ బస్టర్ వదులుకున్న అల్లరి నరేష్..ఎంత పని చేశావయ్యా!