BigTV English

SSMB29 : రాజమౌళి మాస్టర్ ప్లాన్, మహేష్ బాబు తో ఆ పని చేస్తున్న జక్కన్న

SSMB29 : రాజమౌళి మాస్టర్ ప్లాన్, మహేష్ బాబు తో ఆ పని చేస్తున్న జక్కన్న

SSMB29 : సౌత్ ఇండియా సినిమా మాత్రమే కాకుండా ఏకంగా ప్రపంచవ్యాప్తంగా మంచి అంచనాలు నెలకొల్పిన సినిమా SSMB29. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న ఈ సినిమాలో గతంలో ఎప్పుడూ లేని విధంగా మహేష్ బాబు కనిపిస్తున్నారు. ఈ సినిమా కోసం లాంగ్ హెయిర్ కూడా పెంచారు మహేష్. రాజమౌళి సినిమాల్లో మహేష్ బాబు ఎలా ఉండబోతున్నాడు అని చాలామందికి ఒక అవగాహన వచ్చేసింది.


ఈ అవగాహన రావడానికి కారణం మహేష్ బాబు ఎయిర్పోర్ట్ లో చాలాసార్లు కనిపించడం. షూటింగ్లో కొంత ఖాళీ సమయం దొరికితే చాలు మహేష్ బాబు విదేశాలకు చెక్కేస్తుంటారు. అందుకనే మహేష్ తో సినిమా మొదలు పెట్టినప్పుడు పాస్పోర్ట్ కూడా రాజమౌళి స్వాధీనం చేసుకున్నట్లు ఒక వీడియో బయటకు వచ్చింది. అప్పట్లో ఆ వీడియో కూడా విపరీతమైన వైరల్ అయింది. SSMB29 సినిమా నుంచి ఒక క్రేజీ అప్డేట్ బయట వినిపిస్తుంది.

రాజమౌళి మాస్టర్ ప్లాన్

ప్రియాంక చోప్రా తో కలిసి మహేష్ బాబు ఈ సినిమాలో హై ఎనర్జీ డాన్స్ నెంబర్ ఒకటి చేయబోతున్నట్లు తెలుస్తుంది. మహేష్ బాబు డైలాగు డెలివరీ పర్ఫామెన్స్ గురించి మాట్లాడుతారు కానీ మహేష్ బాబు డాన్స్ గురించి మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ. ఇక రీసెంట్ టైమ్స్ లో వస్తున్న సినిమాల్లో అయితే మహేష్ అదిరిపోయే స్టెప్పులు వేస్తున్నారు.


SSMB29 సినిమాలో ఈ ఫోక్ సాంగ్ ను రాజు సుందరం మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా అయిపోయింది. త్వరలోనే ఈ సాంగును మొదలుపెట్టనున్నారు. రాజమౌళి సినిమాల్లో సాంగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అందరికీ తెలిసిందే. పాటను కూడా చాలా అందంగా రాజమౌళి తీస్తుంటారు. ఈ సినిమాలో సాంగ్స్ గురించి కూడా చాలామందికి ఒక క్యూరియాసిటీ ఉంది.

రిలీజ్ అయ్యేది అప్పుడే 

ఈ సినిమాను 2027 వ సంవత్సరం మార్చి నెలలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే దీని గురించి అధికారక ప్రకటన ఇంకా రాలేదు. మామూలుగా అయితే రాజమౌళి సినిమాలు ఎక్కువ శాతం చెప్పిన టైంకి విడుదల కావు. మరి ఈ సినిమా విషయంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఈ సినిమా ఎప్పుడు వచ్చినా కూడా వేరే రేంజ్ లో ఉండబోతుంది అనే క్లారిటీ అయితే చాలామందికి ఉంది. ఎస్ఎస్ రాజమౌళితో మహేష్ బాబు సినిమా అయిపోయిన తర్వాత సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో సినిమా చేసే ఆలోచనలో కూడా ఉన్నారు మహేష్ బాబు.

Also Read: Bigg Boss 9 Promo : తప్పుదారిలో గేమ్స్ ఆడిన హౌస్ మేట్స్, బిగ్ బాస్ స్ట్రాంగ్ వార్నింగ్

Related News

Bahubali: బహుబలి ఫస్ట్ హీరో ప్రభాస్ కాదా? ఇన్నాళ్లకు బయట పెట్టిన నిర్మాత!

Jathi Rathnalu 2: జాతి రత్నాలు 2 అస్సలు చెయ్యను.. ఇదేం ట్విస్ట్ ప్రియదర్శి?

Akhanda 2 : బాలయ్య బాబు రికార్డ్ బిజినెస్ – ‘అఖండ 2’కు ఊహించని రేట్లు!

Priyanka Arul Mohan: జూలియేట్ గా రాబోతున్న కన్మణి.. మరోసారి నానికి జంటగా?

Heroine : హీరోయిన్ పై దారుణం, మత్తు మందిచ్చి ఆ పని చేసిన నటుడు

Mohan Lal: మరో అరుదైన గౌరవాన్ని అందుకున్న మోహన్ లాల్.. సంతోషంలో అభిమానులు!

Ravi Teja: మాస్‌ జాతర సాంగ్‌ ట్రోల్స్‌పై రవితేజ రియాక్షన్, ఏమన్నారంటే..!

Big Stories

×