Priyanka Arul Mohan: ప్రియాంక ఆరుళ్ మోహన్ (Priyanka Arul Mohan)ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది సెలబ్రిటీగా మారిపోయారు. ఈమె ఇటీవల పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజి సినిమా(OG Movie)లో కన్మణి పాత్ర ద్వారా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమా మంచి విజయం అందుకున్న నేపథ్యంలో ఈమెకు తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నాయని తెలుస్తుంది. అయితే తాజాగా ప్రియాంక మోహన్ కి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓజీ సినిమా మంచి విజయాన్ని అందుకున్న నేపథ్యంలో మరోసారి సుజిత్(Sujeeth) ఈమెకు అవకాశం కల్పించినట్టు తెలుస్తుంది.
ఓజి సినిమా తరువాత సుజిత్ తన తదుపరి చిత్రాన్ని నేచురల్ స్టార్ నాని(Nani)తో చేస్తున్న విషయం తెలిసిందే. బ్లడీ రోమియో(Bloody Romeo)గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల ఈ సినిమా పూజ కార్యక్రమాలు కూడా జరిగాయి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా ప్రారంభం కానున్నాయి. ఇలా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాలో మరోసారి నానికి జోడిగా ప్రియాంక మోహన్ నటించబోతున్నారనే వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.
ఇక ఈ సినిమాలో నాని రోమియోగా కనిపించగా, ప్రియాంక జూలియట్ గా నానితో మరోసారి రొమాన్స్ చేయడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఇదివరకే నాని ప్రియాంక ఆరుళ్ మోహన్ కాంబినేషన్లో గ్యాంగ్ లీడర్, సరిపోదా శనివారం వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండు సినిమాలు కూడా ఎంతో అద్భుతమైన విజయాలను అందుకున్న సంగతి తెలిసిందే. ఇలా వీరి కాంబినేషన్లో వచ్చిన రెండు సినిమాలు మంచి సక్సెస్ అయిన తరుణంలో మరోసారి సుజిత్ నాని సినిమాలో ప్రియాంకను తీసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నట్టు సమాచారం.ఇలా మరోసారి గ్యాంగ్ లీడర్ కాంబో రాబోతుందని తెలియగానే అభిమానులకు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు .
ది ప్యారడైజ్ ..
మరి ఈ సినిమాలో నానికి జోడిగా ప్రియాంక నటిస్తున్నారా లేదా అనేది తెలియాలి అంటే చిత్ర బృందం అధికారికంగా వెల్లడించాల్సి ఉంది . ప్రస్తుతం నాని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది ప్యారడైజ్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తికాగానే నాని సుజిత్ సినిమా షూటింగ్ పనులలో పాల్గొనబోతున్నారు. ది ప్యారడైజ్ సినిమా వచ్చే ఏడాది మార్చి 26వ తేదీ ఏకంగా ఎనిమిది భాషలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.. ఇక బ్లడీ రోమియో సినిమాని కూడా సుజిత్ వచ్చేయడానికి డిసెంబర్ నాటికి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన తదుపరి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: Mohan Lal: మరో అరుదైన గౌరవాన్ని అందుకున్న మోహన్ లాల్.. సంతోషంలో అభిమానులు!