Ravi Teja Reacts on Trolls: మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైయిటెడ్ మూవీ ‘మాస్ జాతర‘. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా అక్టోబర్ 31న విడుదలకు సిద్దమౌతోంది. ఈ క్రమంలో మూవీ టీం ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టింది. హీరో రవితేజ, శ్రీలీల కలిసి వరుసగా ఇంటర్య్వూలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న రవితేజ ఓలే ఓలే పాట వివాదంపై స్పందించారు.
కొన్ని లైన్స్ మాత్రమే పట్టుకుని పాట మొత్తాన్ని విమర్శించడం కరెక్ట్ కాదన్నారు. ఇంతకి అసలు విషయం ఏంటంటే.. మాస్ జాతర మూవీ నుంచి ఇటీవల ఫోక్ సాంగ్ విడుదలైన సంగతి తెలిసిందే. ఓలే ఓలే అంటూ సాగే ఈ పాట ఆగష్టులో విడుదలైంది. ఈ పాటలో మాస్ మహారాజా మ్యానరిజం, శ్రీలీల ఎనర్జిటిక్ డ్యాన్స్ బాగా ఆకట్టుకుంది. వీరిద్దరి ఎనర్జీతో పాట నెక్ట్స్ లెవెల్‌కి వెళ్లింది. విడుదలైన కొన్ని రోజుల పాటు ఈ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండింగ్ అయ్యింది. ఇది ఎంతగా పాపులర్ అయ్యిందో.. అదే స్థాయిలో విమర్శలు, ట్రోల్స్ కూడా ఎదుర్కొంది. దీనికి కారణంగా పాటలోని పదాలు.
Also Read: Shilpa Shetty: రూ. 60 కోట్ల చీటింగ్.. శిల్పా శెట్టిని ప్రశ్నించిన పోలీసులు
ఈ పాటలో లిరిక్స్‌లో ‘ఓలే ఓలే’ పాటలోని.. ‘నీ అమ్మ, నీ అయ్య, నీ అక్క, నీ చెల్లి…, గుంట, నీ ఒళ్లోకొచ్చి పంట, సిగ్గు లేదు, షేరము లేదు, లాగు లేదు’ అనే పదాలు ఉన్నాయి.ఇవి చాలా మందికి అసభ్యంగా అనిపించాయి. ఈ పాటను భీమ్స్ సిసిరోలియో స్వరపరిచారు. భాస్కర్ యాదవ్ దాసరి సాహిత్యం అందించారు. సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ, జానపద స్టైల్ పేరుతో పాటలను పాడు చేస్తున్నారంటూ నెటిజన్స్ విపరీతంగా ట్రోల్ చేశారు. అంతేకాదు ఈ పదాలపై అభ్యంతరం కూడా తెలిపారు. జానపద పాటలను ప్రయోగాలతో కూనీ చేస్తున్నారంటూ అసహనం చూపించారు.
Also Read: Bigg Boss: బిగ్ బాస్‌కి షాక్.. షో ఆపేయాలంటూ ప్రభుత్వం నోటీసులు!
ఇక పాటకు వచ్చిన ట్రోల్స్పై తాజాగా రవితేజ, శ్రీలీలు స్పందించారు. “పాటలోని కొన్ని లైన్స్ విని విమర్శలు చేస్తున్నారు. కానీ, ఆ పాట అర్థం తెలియాలంటే సినిమా చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే కథ డిమాండ్ బట్టి ఆ పాటను పెట్టారు” అని చెప్పారు. ఆ తర్వాత శ్రీలీల సైతం రవితేజ కామెంట్స్కి మద్దతు తెలిపింది. ఈ పాట సిచ్చ్యువేషన్కి కరెక్ట్గా ఆప్ట్ అవుతుందని చెప్పింది. ప్రస్తుతం వారి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మరి రవితేజ చెప్పినట్టు సినిమా రిలీజ్ తర్వాత ఈ పాటపై ట్రోలర్స్ అభిప్రాయం మారుతుందో లేదో చూడాలి. సినిమా రిలీజ్ తర్వాత మరి ఈ పాటపై ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. కాగా