Narne Nithin:ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు చాలామంది యంగ్ హీరోలు, హీరోయిన్లు ఒకరి తర్వాత ఒకరు బ్యాచిలర్ లైఫ్ వీడి కొత్త బంధాన్ని ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఏడాది సగం మంది బ్యాచిలర్స్ లలో కొంతమంది నిశ్చితార్థాలు చేసుకున్నారు.. ఇంకొంతమంది పెళ్లిళ్లు చేసుకొని ఒక ఇంటివారు అవుతున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్(Jr.NTR) బామ్మర్దిగా, యంగ్ హీరోగా పేరు సొంతం చేసుకున్న నార్నే నితిన్ (Narne Nithin) కూడా ఎట్టకేలకు ఒక ఇంటి వారయ్యారు.
నిన్న రాత్రి నితిన్ – శివానీల వివాహం హైదరాబాద్ శివారులోని శంకర్పల్లిలో చాలా ఘనంగా జరిగింది. ఈ వివాహానికి ఇండస్ట్రీ నుంచి పలువురు సెలబ్రిటీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఎన్టీఆర్ బామ్మర్ది హీరో నార్నే నితిన్ విషయానికి వస్తే.. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి (Lakshmi pranati)తమ్ముడే నార్నే నితిన్.’శ్రీశ్రీశ్రీ రాజా వారు’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినా.. దానికంటే ముందు మ్యాడ్ సినిమా రిలీజ్ అయ్యి.. మంచి విజయం అందుకోవడంతో మొదటి సినిమాతోనే హిట్ సొంతం చేసుకున్నారు. మ్యాడ్ తర్వాత ఆయ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాలతో మళ్లీ తనను తాను ప్రూవ్ చేసుకున్నారు.
అలా హీరోగా నిలబడడంతో వెంటనే పెద్దలు నితిన్ కి పెళ్లి చేయాలని ప్లాన్ చేశారు. అందులో భాగంగానే దగ్గుబాటి వెంకటేష్ కు దగ్గర బంధువులైన తాళ్లూరి వెంకటకృష్ణ ప్రసాద్, స్వరూపాల కుమార్తె అయిన శివాని తాళ్లూరి (Sivani thalluri) తో నితిన్ పెళ్లి జరిపించాలని నిర్ణయించి గత ఏడాది నిశ్చితార్థం కూడా జరిపించారు. ఈ పెళ్లి వేడుకలలో నితిన్ లైట్ పింక్ కలర్ షేర్వానీలో మెరవగా.. పెళ్లికూతురు శివాని రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ పట్టుచీరలో చూడ ముచ్చటగా కనిపిస్తోంది. ఈ జంటను చూసిన నెటిజన్స్ సీతారాముడి లాగా చాలా చక్కగా ఉన్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇకపోతే ఈ పెళ్లి వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది మాత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఆయన భార్య లక్ష్మీ ప్రణతి అనే చెప్పాలి. అక్క ప్రణతి , బావ ఎన్టీఆర్ కళ్యాణ మండపంలో అందరినీ ఆహ్వానిస్తూ పెళ్లి పెద్దలుగా మారి ఈ వేడుకకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. మొత్తానికైతే బావమరిది పెళ్లి హడావిడి మొత్తాన్ని బావ భుజాల మీద వేసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇక్కడ ఎన్టీఆర్ లుక్ చాలా కొత్తగా ఉంది. గుబురు గడ్డం, స్లిమ్ పర్సనాలిటీ తో చాలా అందంగా ఆకర్షణీయంగా కనిపించారు. ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా కోసం ఈ లుక్ మెయింటైన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఏది ఏమైనా ఎన్టీఆర్ లుక్ నార్నే నితిన్ పెళ్లి వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది అని చెప్పవచ్చు.
ALSO READ: Puri Jagannath: ఎట్టకేలకు ఛార్మీతో బంధంపై నోరు విప్పిన పూరీ.. ఇలా ట్విస్ట్ ఇచ్చారేంటి?
Annayya – Vadina ♥️🤩
A beautiful pair #JrNTR – #Pranathi @tarak9999 #ManOfMassesNTR pic.twitter.com/0BZEgBB4rS
— AndhraNTRFC (@AndhraNTRFC) October 11, 2025