Sreeleela : టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మొదటి సినిమాతోనే సెన్సేషనల్ క్రియేట్ చేసింది. ఇప్పటివరకు హీరోయిన్ గా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. అందులో ఆమె చేసిన ఫస్ట్ మూవీ ‘పెళ్లి సందడి’ సినిమా ఒకటే హిట్ టాక్ ను అందుకుంది. ఆ తర్వాత రవితేజతో నటించిన ధమాకా సినిమా తప్ప మిగిలిన సినిమాలు అన్ని ఆమెకు అనుకున్న హిట్ టాక్ ను అందించలేదు. కొన్ని నెలలు గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్లీ వరుస సినిమాలను అనౌన్స్ చేస్తూ బిజీ అవుతుంది. ప్రస్తుతం వరుసగా సినిమాలను అనౌన్స్ చేస్తూ వస్తుంది. ఒకవైపు చేతినిండా సినిమాలు ఉన్నా సరే మరోవైపు కోలీవుడ్ లో కూడా బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుందని తెలుస్తుంది. తాజాగా ఆమెకు ఒక గోల్డెన్ ఆఫర్ వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ సినిమా గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..
టాలీవుడ్ యంగ్ హీరోయిన్స్ శ్రీలీల ప్రస్తుతం రెండు మూడు భారీ ప్రాజెక్టులలో నటిస్తూ బిజీగా ఉంది. ఒకవైపు తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నా కూడా తమిళంలో భారీ ప్రాజెక్టులో నటించే అవకాశాన్ని అందుకుంది.. తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈమధ్య అమరన్ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ హీరో ప్రస్తుతం మరో భారీ ప్రాజెక్టులో నటిస్తున్నారు. సుధా కొంగర దర్శకత్వంలో పరాశక్తి చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ మూవీలో శ్రీలీలను ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు మరో సినిమాలో కూడా నటిస్తుందని సమాచారం. మొదటి సినిమాని స్టార్ హీరో సరసన ఛాన్స్ కొట్టడంతో ఆమె అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.
Also Read : ప్రేమ, నర్మదను అడ్డంగా ఇరికించిన శ్రీవల్లి..పరువు తీసిన భాగ్యం..అమూల్యతో విశ్వం..
కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ రెండు భారీ ప్రాజెక్టులలో నటిస్తున్నారు. ముందుగా సుధా కొంగర సినిమాని పూర్తి చేసి, ఆ వెంటనే మరో సినిమాలో నటించే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.. సిబి చక్రవర్తి దర్శకత్వంలో శివకార్తికేయన్ నటిస్తున్నారు. నవంబర్ నెలలో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించనున్నారట. ఈ మూవీలో కూడా శ్రీలీల కథానాయకగా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ వార్త కనుక నిజమైతే శ్రీ లీలా పంట పండినట్లే. ఒకేసారి రెండు భారీ హిట్ సినిమాలు తన ఖాతాలో పడతాయని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈమె రవితేజ సరసన మాస్ జాతర సినిమాలో నటిస్తుంది. అతి త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఈ మూవీ పై భారీ అంచనాలే ఉన్నాయి. మరి రిలీజ్ అయ్యాక ఎలాంటి టాక్ ని ఎందుకు ఉంటుందో చూడాలి..