Chittoor: చిత్తూరు జిల్లాలో దారుణమైన ఘటన జరిగింది. భర్తను ప్రియుడితో కలిసి భార్య ఉరేసి చంపిన ఘటన సంతపేటలో చోటుచేసుకుంది. మెుదట భార్యకు సంతానం లేకపోవడంతో తులసి మునియమ్మతో వెంకటేష్‌కు రెండో వివాహం జరిగింది. అయితే మునియమ్మకు సురేష్ అనే వ్యక్తితో కొన్ని రోజులుగా వివాహిత సంబంధం కొనసాగుతోంది. ఇది తెలిసిన వెంకటేష్.. మునియమ్మను ప్రశ్నించాడు. దీంతో వెంకటేష్ అడ్డు తొలగించుకోవాలని మునియమ్మ స్కె్చ్ వేసింది. అక్టోబర్ 6న సాయంత్రం వెంకటేష్ ఇంట్లో నిద్రిసున్న సమయంలో ప్రియుడి సహాయంతో తాడుతో ఉరేసి హత్య చేసింది. వెంకటేష్ తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు వారి శైలిలో విచారణ కొనసాగించగా నిందితులు హత్య చేసినట్టు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.