Illu Illalu Pillalu Today Episode October 11th: నిన్నటి ఎపిసోడ్ లో.. ఇంట్లోని వాళ్లందరూ సంతోషంగా ఉండడం చూసిన నర్మదా మురిసిపోతూ ఉంటుంది. అయితే నర్మద దగ్గరకొచ్చిన సాగర్ నువ్వు ఎంత బాధ పడుతున్నావో నాకు అర్థమైంది నీ పుట్టింటి వాళ్ళు గుర్తొచ్చారా అని అడుగుతాడు. ఒకసారి అటు చూడు అని చెప్పగానే నర్మద వాళ్ళ అమ్మ నాన్న ఎదురుగా కనిపిస్తారు వాళ్ళని చూసి సంతోషంగా ఉంటుంది.. మీరేంటమ్మా ఎప్పుడు బతుకమ్మనే పెట్టరు ఇప్పుడేంటి ఇక్కడికి వచ్చారు అని నర్మదా అడుగుతుంది. మేం రాలేదమ్మా సాగర్ మా ఇంటికి వచ్చి మీ అమ్మాయి కోసమైనా మీరు రావాలి అని అడిగారు. అందుకే నీకోసమే బతుకమ్మను తీసుకొని వచ్చాను అని వాళ్ళ అమ్మ చెప్పగానే నర్మదా సంతోషపడుతుంది. సేన, రామరాజు ఇద్దరు దసరా ఉత్సవాలు చేయాలని ఊర్లో వాళ్ళు అంటారు.. ఆ మాట వినగానే సేన సీరియస్ అవుతాడు. రామరాజు పరువు తీస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. సేన రావడం చూసి ఊరి పెద్దలు మీరు బావ మరదలు కలిసి దసరా ఉత్సవాలను జరిపించాలని కోరుతారు. ఇద్దరి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది.. వేదవతి పై రామరాజు సీరియస్ అవుతాడు. సందు దొరికితే ఏదో ఒకటి అనాలని శ్రీవల్లి ఎదురుచూస్తుంది. శ్రీవల్లి మళ్లీ మీ చొక్కా చించేసినంత పని అయిందా మామయ్య గారు మిమ్మల్ని అవమానించారా అని కావాలనే రెచ్చగొడుతుంది. మీరు ఎలా ఊరుకున్నారు మావయ్య గారు అని రామరాజుతో శ్రీవల్లి అంటుంది. వైపు వేదవతి సైలెంట్ గా ఉండమని అంటున్న సరే శ్రీవల్లి వినకుండా మాటలతో రెచ్చగొడుతుంది.
అసలు ఆ నర్మదా ప్రేమలను భద్రావతి దగ్గరకు ఎందుకు వెళ్ళమన్నారు? ఎవరు వెళ్ళమని చెప్పారు అని రామరాజు అంటాడు. వీళ్లు వెళ్లడం వల్లే కదా వాడు నన్ను ఇన్ని మాటలు అన్నాడు అని రామరాజు వేదవతి పై సీరియస్ అవుతాడు.. ఆ మాటలను నర్మదా ప్రేమ ఇద్దరు విని బాధపడతారు. అయితే రామరాజు నా పరువు ని కాపాడేది ఒక శ్రీవల్లి మాత్రమే.. ఆ ఇద్దరు కోడలు నా పరువును ఎప్పుడు తీసేస్తూనే ఉంటారు. కోడల్ని కంట్రోల్లో పెట్టడం చేతకాదు మాట్లాడుతున్నావా అంటూ రామరాజు సీరియస్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
భాగ్యం ఆనందరావు బయట బజ్జీలు అమ్ముతూ బిజీగా ఉంటారు.. అమ్మడం చూసి భాగ్యం అలా అమ్మితే ఎవరూ రారు. మంచిగా అమ్ము అని అంటుంది. ఆనందరావు గొంతు విన్నా తిరుపతి అక్కడికి వచ్చి అన్నాయ్ మీది ఫైనాన్స్ బిజినెస్ కాదని అనిపిస్తుంది. మొదటినుంచి మీరు ఇదే బిజినెస్ చేసుకున్నట్లు బాగా ఆరితేరిపోయారు కదా అని అంటాడు. మీరేంటి ఇక్కడ అని అడిగితే అప్పుడే తిరుపతి బావ ఇక్కడికి రా ఒకసారి ఇది చూడు అని పిలుస్తాడు. వాళ్లను చూసిన రామరాజు షాక్ అవుతాడు..
మీరేంటమ్మా ఇక్కడ అని అడుగుతాడు.. మళ్లీ మోసం చేశారు కదా అన్నయ్యగారు మేము ఎవరిని మోసం చేయలేదు. మేము ఏదో ఒకటి చేసుకుని బతకాలి కదా అందుకే ఈ బిజినెస్ అని అంటారు. అక్కడున్న ఊరి పెద్దలు వీళ్ళని చూసి రామరాజు గారు వీళ్లు మీ వీయాంకుల బజ్జీలు మాత్రం చాలా బాగున్నాయి.. మీరు ఎప్పుడు కనబడితే అప్పుడు తినొచ్చు అని అనగానే అక్కడి నుంచి రామరాజు వెళ్లిపోతారు. తిరుపతి మాట్లాడుతుండగానే బజ్జి పది రూపాయలు ఇచ్చేసి వెళ్ళు అని భాగ్యం అడుగుతుంది. ఇలా వాళ్ల విషయాలు వీళ్ళ విషయాలు పట్టించుకుంటే నీకు పెళ్లి అవదు వెళ్లి వెతుక్కో పెళ్లి అవుతుందేమో చూసుకొని అంటుంది.
Also Read: అడ్డంగా దొరికిపోయిన పల్లవి.. షాకిచ్చిన చక్రధర్..పల్లవిని గెంటేస్తారా..?
నర్మదా ప్రేమ ఇద్దరు కూడా రామరాజు అన్న మాటలు తలుచుకొని బాధపడుతూ ఉంటారు. ఇద్దరు కోడళ్ళు నా ఇంటి పరువును తీస్తున్నారు అన్నారని బాధపడతారు. శ్రీవల్లి అమూల్యను తీసుకొని వస్తానని విశ్వంతో అంటుంది. అమూల్యని అక్కడ వదిలేసి శ్రీవల్లి వెళ్ళిపోతుంది. విశ్వం అమూల్య దగ్గరకొచ్చి పులిహోర కలుపుతూ ఉంటాడు. బలవంతంగా నీకు గాజులు కొనిస్తాను అని అంటాడు.. కామాక్షి ఎక్కడికొచ్చిందా చెల్లి చెయ్యి పట్టుకుంటావా నీకు ఎంత ధైర్యం రాని అంటుంది. వాళ్ళ ఆయన తీసుకొని వచ్చి కొట్టిస్తానని అంటుంది. కానీ విశ్వం ని చూసిన అతను అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి…