Puri Jagannath: ప్రముఖ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannath) టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు చేసి మంచి పేరు సొంతం చేసుకున్నారు. మహేష్ బాబు (Mahesh Babu) ను మొదలుకొని రామ్ పోతినేని (Ram Pothineni) వరకు ఇలా ఎంతోమంది హీరోలకు బ్లాక్ బస్టర్ విజయాలను అందించిన చరిత్ర ఆయనది. అలాంటి పూరీ జగన్నాథ గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. చివరిగా డబుల్ ఇస్మార్ట్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన పూరీ జగన్నాథ్ ఆ సినిమాతో కూడా సక్సెస్ ను అందుకోలేకపోయారు. దీంతో చాలామంది హీరోలు ఈయనకు డేట్స్ ఇవ్వడానికి వెనుకడుగు వేస్తున్న విషయం తెలిసిందే.
ఇలాంటి సమయంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) తో సినిమా ప్రకటించారు. దీనికి తోడు ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా టైటిల్ , టీజర్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేసి ఆ తమిళనాడులో జరిగిన తొక్కిసలాట విషాద సంఘటన నేపథ్యంలో దానిని కాస్త పోస్ట్ పోన్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా అర్జున్ రెడ్డి , యానిమల్ చిత్రాలకు మ్యూజిక్ అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్ (Harshavardhan Rameswar) ను అనౌన్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఒక ఫోటో పంచుకున్నారు పూరీ జగన్నాథ్. అదే ఫోటోలో హీరోయిన్ ఛార్మీ (Charmy) కూడా ఉంది. దాంతో ఈ పిక్ అందరినీ ఆకట్టుకుంది. అసలే పూరీ జగన్నాథ్ – చార్మీ మధ్య ఏదో ఉందనే వార్తలు ఇప్పటికే వినిపిస్తున్న నేపథ్యంలో.. మళ్లీ ఈ ఫోటో షేర్ చేయడంతో నిజంగానే సంథింగ్ సంథింగ్ అంటూ కామెంట్లు చేయడం మొదలుపెట్టారు నెటిజన్స్.
ALSO READ:Iswarya Menon: సక్సెస్ కోసం ఏమైనా చేస్తావా.. ఐశ్వర్యపై ట్రోల్స్.. ఏమైందంటే ?
విషయంలోకి వెళ్తే “పూరీ కనెక్ట్స్” నిర్మాణ సంస్థ, లో ఛార్మీ, పూరీ జగన్నాథ్ తో పార్ట్నర్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు రాబోయే విజయ్ సేతుపతి మూవీ కూడా ఈ బ్యానర్ పైనే రాబోతోంది. అందుకే ఈ ఫోటో షేర్ చేశారు. అయినప్పటికీ కూడా వీరిద్దరి మధ్య రూమర్స్ సృష్టిస్తున్నారు. దీనిపై స్పందించిన పూరీ జగన్నాథ్ ఘాటు వ్యాఖ్యలు ఇటీవల ఒక సందర్భంలో ఈ విషయం గురించి ప్రశ్న ఎదురవగా ఆయన మాట్లాడుతూ.. “నేను ఒక 50 సంవత్సరాలు వయసున్న లేదా అధిక బరువు ఉన్న మహిళతో కనిపిస్తే ఎవరికీ ఎటువంటి బాధ ఉండేది కాదు.. లేదా ఎవరైనా పెళ్లయిన మహిళతో ఉన్నా కూడా ఇక్కడ ఎవరికీ ఏ సమస్య లేదు. కానీ ఇక్కడ అందరి సమస్య ఏమిటంటే ఛార్మీ యంగ్.. పైగా ఆమెకు పెళ్లి కాలేదు. దానితో అందరూ మా మధ్య ఏదో ఉందనుకుంటున్నారు. ఇప్పటికైనా ఆలోచనలను మార్చుకోండి” అంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు.
అలాగే ఆయన మాట్లాడుతూ..” పైపై ఆకర్షణలు ఎక్కువ కాలం నిలబడవు. స్నేహం మాత్రమే శాశ్వతం. నాకు 13 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి ఛార్మీ తెలుసు. గత 20 ఏళ్ల నుండి ఉన్న స్నేహంతో మేము కలిసి పని చేస్తున్నాము. ఛార్మీ కి ప్రొడ్యూసర్ గా నిలబడాలనే కోరిక ఉంది. పదేళ్ల క్రితమే తన ఆలోచన నాతో చెప్పింది .మగాళ్లకు తగ్గకుండా కష్టపడే నేచర్ తనది..” గొడ్డులా పనిచేసే టామ్ బాయ్” అంటూ కామెంట్ చేశారు. మొత్తానికి అయితే చెక్కుచెదరని స్నేహంతోనే హిట్ ప్లాఫ్ తో సంబంధం లేకుండా సినీరంగంలో ముందుకు సాగుతున్నారు. మరి ఎప్పటికైనా వీరి మధ్య పుట్టుకొస్తున్న రూమర్స్ ఆగిపోతాయేమో చూడాలి.